E-Paper
Advertisement

Headache: భరించలేని తలనొప్పి క్షణాల్లో మాయం.. ఐస్ వాటర్‌లో దాగున్న అద్భుత రహస్యమిదే!

Headache: భరించలేని తలనొప్పి క్షణాల్లో మాయం.. ఐస్ వాటర్‌లో దాగున్న అద్భుత రహస్యమిదే!
Advertisement

Headache: ఉరుకుల పరుగుల జీవితంలో తీవ్రమైన ఒత్తిడి ద్వారా చాలామందిని తరచూ వేధించే సమస్య తలనొప్పి. దీనికి తోడు ఎక్కువగా స్మార్ట్‌ఫోన్ స్క్రోలింగ్, గంటల తరబడి కంప్యూటర్ ముందు కూర్చోవడం, నిద్రలేమి.. ఇవన్నీ కలిసి తీవ్రమైన నొప్పికి దారిస్తుంటాయి. దీంతో ఆ నొప్పిని భరించలేక వెంటనే మందులు వేసుకుంటారు కొంతమంది. అయితే, ఇలా ప్రతిసారీ మందులు వాడటం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అందుకే.. ఎంత తీవ్రమైన తలనొప్పి అయినా చిటికెలో తగ్గిపోయేలా ‘వాటర్ థెరపీ’ ప్రయత్నించమని సలహా ఇస్తున్నారు వైద్య నిపుణులు.

ఒత్తిడి నుంచి ఉపశమనం:

బాగా తలనొప్పిగా ఉన్నప్పుడు ఐస్ వాటర్‌లో కాసేపు చేతులను ముండచడం లేదా ఐస్ క్యూబ్స్‌ను ఏదైనా కాటన్ వస్త్రంలో చుట్టి తల, మెడ, నుదురు, కళ్ల కింద, కనుబొమ్మల పైభాగంలో సున్నితంగా రాయడం వల్ల తక్షణ రిలీఫ్ లభిస్తుంది. దీని వెనుక శాస్త్రీయ ఆధారం కూడా ఉందని చెబుతున్నారు నిపుణులు. 2023లో జర్నల్ ఆఫ్ పెయిన్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. ఐస్ ఎక్స్‌పోజర్ వల్ల వాగస్ నర్వ్ యాక్టివేట్ అవుతుంది. దీంతో శరీరం రీలాక్స్ అవ్వడమే కాక.. ఒత్తిడీ తగ్గుతుంది. దీంతోపాటే మనసు ప్రతికూల ఆలోచనల నుంచి సానుకూల దిశగా ఫోకస్ చేస్తుంది.

Advertisement

Read Also: అమ్మాయిలు ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేస్తారో తెలుసా?.. మీరు అనుకున్నదే నిజమైంది!

తీవ్రమైన నొప్పులకూ చెక్:

ఐస్ వాటర్ థెరపీ వల్ల వాగస్ నర్వ్ యాక్టివేషన్‌తో పాటు మెదడులో డోపమైన్ అనే హ్యాపీనెస్ హార్మోన్ విడుదల అవుతుంది. దీని వల్ల మనసుకు హాయిగా అనిపించడమే కాక.. కార్టిసోల్ అనే ఒత్తిడి హార్మోన్ స్థాయులు తగ్గుతాయి. దీంతో సాధారణ తలనొప్పి మాత్రమే కాదు.. మైగ్రేన్ వంటి తీవ్రమైన నొప్పులు కూడా తగ్గుతాయని చెబుతున్నారు.

మానసిక ప్రశాంతత లభ్యం:

Advertisement

ఈ ఐస్ వాటర్ థెరపీ వల్ల రక్తనాళాలు సంకోచిస్తాయి. ఇది మంటను తగ్గించి మెదడులో ఒత్తిడి సిగ్నల్స్‌ను శాంతింపజేస్తుంది. ఐస్ క్యూబ్స్ వేసిన నీటిలో 5 నిమిషాల పాటు చేతులు పెట్టడం లేదా నేరుగా ఐస్ ముక్కలను రాయడం వల్ల బాడీలోని పారాసింపథెటిక్ నాడీ వ్యవస్థ యాక్టివ్ అవుతుంది. దీని వల్ల తలనొప్పి తగ్గడంతో పాటు మనసుకు ఒకరకమైన ప్రశాంతత కూడా లభిస్తుంది.

సహజసిద్ధమైన పద్ధతి:

ఐస్ వాటర్ థెరపీ పద్ధతి అద్భుతంగా పనిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు కూడా చెబుతున్నారు. ఐస్ ఎక్స్‌పోజర్ వల్ల శరీరంలో సహజంగా కలిగే హీలింగ్ మెకానిజం వేగంగా పనిచేస్తుంది. మందుల వాడకం తగ్గించి సహజంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఇది చాలా మంచి పద్ధతిని నిపుణులు అంటున్నారు. అయితే, ఈ ఐస్ వాటర్ థెరపీని ఎక్కువ సేపు చేయకూడదు. 5 నుండి 7 నిమిషాలు చేస్తే చాలు. తరచూ చేయడం వల్ల మెదడు ఫ్రెష్‌గా ఉండటమే కాకుండా.. స్ట్రెస్ హార్మోన్లు తగ్గుతాయి.

Read Also: క్యాప్సికమంటే మొహం చిట్లించుకుంటున్నారా?.. శీతాకాలంలో తింటే లెక్కలేనన్ని ప్రయోజనాలు!

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×