// // Amla Wter With Turmeric: ఈ ఒక్క డ్రింక్ తో ఆరోగ్య సమస్యలన్నీ పరార్ -->
E-Paper
Advertisement

Amla Wter With Turmeric: ఈ ఒక్క డ్రింక్‌తో.. ఆరోగ్య సమస్యలన్నీ పరార్

Amla Wter With Turmeric: ఈ ఒక్క డ్రింక్‌తో.. ఆరోగ్య సమస్యలన్నీ పరార్
Advertisement

Amla Wter With Turmeric:ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకునే కొన్ని రకాల డ్రింక్స్ మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. మన వంటింట్లో సులభంగా లభించే ఉసిరి , ప సుపు కలిపిన నీటిని తాగడం వల్ల శరీరానికి అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుతాయి. ఆయుర్వేదం ప్రకారం.. ఈ రెండింటి కలయిక ఒక శక్తివంతమైన ‘హెల్త్ టానిక్’ లాగా పనిచేస్తుంది. ఉదయాన్నే ఉసిరి-పసుపు నీటిని తాగడం వల్ల కలిగే 5 ముఖ్యమైన ప్రయోజనాలను గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

1. రోగనిరోధక శక్తి పెరుగుదల :
ఉసిరిలో విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలోని తెల్ల రక్త కణాల ఉత్పత్తిని పెంచుతుంది. పసుపులో ఉండే ‘కర్కుమిన్’ అనే సమ్మేళనం శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. ఈ రెండూ కలిసినప్పుడు శరీరానికి వైరల్ ఇన్ఫెక్షన్లు, జలుబు, దగ్గు వంటి సమస్యలతో పోరాడే శక్తి లభిస్తుంది. ముఖ్యంగా.. మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో ఇది రక్షణ కవచంలా పనిచేస్తుంది.

Advertisement

2. జీర్ణక్రియ మెరుగుపడుతుంది:
చాలా మంది ఎదుర్కొనే గ్యాస్, ఎసిడిటీ , మలబద్ధకం వంటి సమస్యలకు ఈ నీరు చక్కని పరిష్కారం. ఉసిరిలోని ఫైబర్ జీర్ణవ్యవస్థను శుభ్రపరుస్తుంది. పసుపు జీర్ణ రసాల ఉత్పత్తిని ప్రేరేపించి.. మనం తిన్న ఆహారం త్వరగా అరిగేలా చేస్తుంది. ఉదయాన్నే ఈ నీటిని తాగడం వల్ల ప్రేగులు శుభ్రపడి, రోజంతా తేలికగా అనిపిస్తుంది.

3. చర్మ సౌందర్యం, జుట్టు ఆరోగ్యం:
లోపలి నుంచి శరీరాన్ని శుద్ధి చేస్తేనే బయట చర్మం మెరుస్తుంది. ఈ డ్రింక్‌లోని యాంటీ ఆక్సిడెంట్లు రక్తంలోని మలినాలను తొలగిస్తాయి. దీని వల్ల మొటిమలు తగ్గి, చర్మం సహజమైన కాంతిని పొందుతుంది. అలాగే.. ఉసిరి జుట్టు కుదుళ్లను బలోపేతం చేసి, జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. తెల్లుట్టును అరికట్టడంలో కూడా ఇది సహాయపడుతుంది.

Advertisement

4. బరువు తగ్గడానికి సహకరిస్తుంది:
శరీరంలోని మెటబాలిజం (జీవక్రియ) రేటును పెంచడంలో ఉసిరి-పసుపు నీరు కీలక పాత్ర పోషిస్తుంది. ఇది శరీరంలో పేరుకుపోయిన అనవసరపు కొవ్వును కరిగించడమే కాకుండా.. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఉదయాన్నే ఈ నీరు తాగడం వల్ల ఆకలి అదుపులో ఉంటుంది. ఫలితంగా బరువు తగ్గడం సులభం అవుతుంది.

5. డిటాక్సిఫికేషన్ :
రోజూ మనం తీసుకునే ఆహారం, కాలుష్యం వల్ల శరీరంలో పేరుకుపోయే విషతుల్యాలను బయటకు పంపడం చాలా ముఖ్యం. పసుపు కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది. ఈ నీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తం శుద్ధి జరిగి, అంతర్గత అవయవాలు చురుగ్గా పనిచేస్తాయి.

ఈ డ్రింక్ ఎలా తయారు చేయాలి ?
ఒక గ్లాసు గోరు వెచ్చని నీటిని తీసుకోండి.

అందులో ఒక టీస్పూన్ ఉసిరి రసం లేదా అర టీస్పూన్ ఉసిరి పొడి కలపండి.

చిటికెడు పసుపు, కొంచెం నల్ల మిరియాల పొడి (పసుపులోని కర్కుమిన్ శరీరం గ్రహించడానికి ఇది అవసరం) వేసి బాగా కలపండి.

అవసరమైతే రుచి కోసం ఒక స్పూన్ తేనె కలుపుకోవచ్చు.

ప్రకృతి ప్రసాదించిన ఈ రెండు అద్భుత ఔషధాలను మన దైనందిన జీవితంలో భాగం చేసుకోవడం ద్వారా దీర్ఘకాలిక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. అయితే.. ఏదైనా కొత్త అలవాటును మొదలుపెట్టే ముందు, ముఖ్యంగా గర్భిణీలు లేదా ఏదైనా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు డాక్టర్‌ల సలహా తీసుకోవడం ఉత్తమం.

 

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×