E-Paper
Advertisement

Ashwagandha: ప్రతిరోజూ చిటికెడు అశ్వగంధ తీసుకుంటే కలిగే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

Ashwagandha: ప్రతిరోజూ చిటికెడు అశ్వగంధ  తీసుకుంటే కలిగే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు
Advertisement

వేగవంతమైన జీవనశైలిలో ప్రజలు ఒత్తిడి, నిద్రలేమి, అలసటతో బాధపడుతున్నారు. ఇలాంటి సమయంలో శరీరాన్ని సహజంగా బలపరచే ఆయుర్వేద ఔషధాలను తీసుకునేందుకు ఎంతో మంది ప్రయత్నిస్తున్నారు. ఆయుర్వేదంలో అశ్వగంధ ముఖ్య ఔషధం. శతాబ్దాలుగా ఆయుర్వేదంలో దీన్ని ఒత్తిడి తగ్గించే ఔషధంగా ఉపయోగిస్తున్నారు. తాజాగా నిపుణులు కూడా దీనిలో ఉన్న సహజ పదార్థాలు శరీరానికి అనేక విధాలుగా ఉపయోగపడతాయని చెబుతున్నారు.

అశ్వగంధను రోజూ తగిన మోతాదులో తీసుకుంటే మొదటగా కనిపించే ప్రయోజనం ఒత్తిడి తగ్గడం. ఇందులో ఉన్న అడాప్టోజెన్స్ అనే పదార్థాలు శరీరాన్ని స్ట్రెస్‌ను ఎదిరించే విధంగా పనిచేస్తాయి. రోజు రోజుకు పెరుగుతున్న పని ఒత్తిడి, మానసిక భారం కారణంగా ఇబ్బంది పడే ఉద్యోగులకు ఇది ఎంతో ఉపయోగకరం. అశ్వగంధ తీసుకోవడం వల్ల మనసు ప్రశాంతంగా ఉండి, టెన్షన్ తగ్గడం నిపుణులు పేర్కొంటున్నారు.

Advertisement

అశ్వగంధతో ఉపయోగాలు
అశ్వగంధ వల్ల కలిగే మరో ముఖ్యమైన ప్రయోజనం మంచి నిద్ర. నేటి కాలంలో చాలామందికి నిద్ర సమస్యలు పెరిగాయి. మొబైల్ వాడకం, పని ఒత్తిడి, చెడు జీవనశైలి వల్ల నిద్రలేమి సాధారణ సమస్యగా మారిపోయింది. అశ్వగంధ నాడీ వ్యవస్థను శాంతింపజేసి సహజంగా నిద్ర వచ్చేలా చేస్తుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. నిద్రలేమితో బాధపడే వారికి ఇది పెద్ద ఉపశమనంగా మారుతోంది. శరీరంలో తరచూ అలసట, బలహీనత అనిపించే వారికి అశ్వగంధ మంచి పరిష్కారంగా చెప్పుకోవచ్చు. ఇది శరీరానికి కొత్త ఉత్సాహం, శక్తి నిచ్చే గుణం దీనికి ఉంటుంది. జిమ్‌ చేసే యువతలో కూడా అశ్వగంధ వినియోగం పెరుగుతోంది. ఇది స్టామినాను పెంచి వ్యాయామ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుందని అంటారు.

అశ్వగంధను ప్రతిరోజూ తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. చిన్న చిన్న ఇన్‌ఫెక్షన్లను శరీరం తట్టుకునేలా చేయడంలో ఇది సహాయపడుతుంది. జలుబు, దగ్గు వచ్చినప్పుడు త్వరగా కోలుకునే అవకాశాలు పెరుగుతాయని నిపుణులు సూచిస్తున్నారు. మహిళల్లో హార్మోన్ అసమతుల్యత ఒక ముఖ్యమైన సమస్య. PCOS, అధిక రుతుస్రావం వంటి సమస్యలతో బాధపడేవారికి అశ్వగంధ మంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇది శరీరంలోని హార్మోన్ల సమతుల్యం కోసం పనిచేస్తుంది. అశ్వగంధ మెదడు పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. రోజూ తింటే ఏకాగ్రత, ఆలోచన శక్తి పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. చదువులో దృష్టి పెట్టలేని విద్యార్థులకు కూడా ఇది కొంత ఉపయోగం ఉంటుంది.

Advertisement

మధుమేహం ఉన్నవారికి అశ్వగంధ ఎంతో ఉపయోగపడుతుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రించడంలో కూడా కొంత ప్రభావం చూపుతుందని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. అయితే డయాబెటిస్ ఉన్నవారు తప్పనిసరిగా అశ్వగంధను తీసుకునే ముందు వైద్యుడి సలహా తీసుకోవడం మంచిది.

ఎలా తినాలి?
అశ్వగంధను పౌడర్ రూపంలో మార్కెట్లో దొరుకుతుంది. రోజు 1–3 గ్రాములు లేదా ఒక టాబ్లెట్ లేదా క్యాప్సుల్ రూపంలో తీసుకోవచ్చు. పాలను లేదా గోరు వెచ్చని నీటిలో దీన్ని కలిపి తీసుకుంటే మరింత మంచిది. అయితే గర్భిణీలు, థైరాయిడ్ మందులు తీసుకునేవారు, చిన్నపిల్లలు డాక్టర్ సలహా లేకుండా దీనిని వాడకపోవడం మంచిది. మొత్తం మీద అశ్వగంధ ఒక సాధారణ మూలిక కాదు. శరీరం, మనసు, రోగనిరోధక వ్యవస్థ… ఇలా పలు అంశాల్లో ఇది ఆరోగ్యాన్ని మెరుగుపర్చే శక్తి కలిగి ఉంటుంది. సరైన మోతాదులో తీసుకుంటే అశ్వగంధ ప్రతిరోజూ జీవితంలో చిన్నప్పటి నుంచి ఉన్న ఆరోగ్య సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుందని నిపుణుల అభిప్రాయం.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×