E-Paper
Advertisement

Aava pulihora: ఆవ పులిహోర ఇలా చేస్తే ఇంటిల్లిపాది ఇష్టంగా తినేస్తారు

Aava pulihora: ఆవ పులిహోర ఇలా చేస్తే ఇంటిల్లిపాది ఇష్టంగా తినేస్తారు
Advertisement

తెలుగు రాష్ట్రాల్లో పండుగలు, శుభకార్యాలు వచ్చాయంటే కచ్చితంగా ఇంట్లో పులిహోర ఉండాల్సిందే. ఒక్కసారి ఆవ పెట్టిన పులిహోర వండి చూడండి. ఇది చాలా రుచిగా ఉంటుంది. దీన్ని వండడం చాలా సులువు. ఇది ఎలా చేయాలో రెసిపీ ఇక్కడ ఇచ్చాము. ఇలా ఫాలో అయిపోతే ఆవ పులిహోర రెడీ అయిపోతుంది.

ఆవ పులిహోర రెసిపీకి కావాల్సిన పదార్థాలు
వండిన బియ్యం – రెండు కప్పులు
ఉప్పు – తగినంత
చింతపండు – నిమ్మకాయంత
నీరు – ఒక కప్పు
నూనె – మూడు టేబుల్ స్పూన్లు
ఆవాలు – ఒక టీ స్పూన్
శెనగపప్పు – ఒక టీ స్పూన్
మినప్పప్పు – ఒక టీ స్పూన్
వేరుశనగ పలుకులు – రెండు టేబుల్ స్పూన్లు
ఎండు మిరపకాయలు – రెండు
పచ్చిమిరపకాయలు – రెండు
కరివేపాకులు – గుప్పెడు
పసుపు – అర స్పూన్
ఇంగువ – చిటికెడు
ఆవాలు – 1 టేబుల్ స్పూన్

Advertisement

Also read: Mexican Chicken: నోరూరించే మెక్సికన్ చికెన్, ఫ్రైడ్ రైస్ తో పాటూ బెస్ట్ కాంబినేషన్

ఆవ పులిహోర రెసిపీ
1. ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి, మెత్తగా కాకుండా మెతుకులు విడివిడిగా వచ్చేలా అన్నం వండుకోవాలి. అన్నం పూర్తిగా చల్లారాక ఒక పెద్ద గిన్నెలోకి మార్చాలి.
2. ఇప్పుడు చింతపండును గోరువెచ్చని నీటిలో నానబెట్టి, బాగా పిసికి రసం తీయాలి. ఈ రసంలో ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టాలి.
3. తర్వాత ఆవాలను కొద్దిగా నీరు వేసి మిక్సీలో మెత్తగా పేస్ట్‌లా చేసుకోవాలి. ఇదే ఈ పులిహోరకు ప్రత్యేకమైన రుచి ఇస్తుంది.
4. ఇప్పుడు ఒక కళాయిని స్టవ్ మీద పెట్టి నూనె వేసి వేడి చేయాలి. అందులో ఆవాలు వేసి చిటపటలాడనివ్వాలి.
5. ఆ తర్వాత శెనగపప్పు, మినప్పప్పు, వేరుశనగ పలుకులు వేసి వేయించాలి.
6. తరువాత ఎండు మిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి కొద్దిసేపు వేయాలి.
7. ఇప్పుడు పసుపు, ఇంగువ వేసి వెంటనే చింతపండు రసం పోయాలి. ఈ మిశ్రమాన్ని 5 నుంచి 7 నిమిషాలు మరిగించాలి.
8. స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని చల్లారనివ్వాలి. తరువాత అన్నంలో ఈ పులుసును, ఆవ పేస్ట్‌ను వేసి మెల్లగా కలపాలి. అన్నం మెత్తబడకుండా జాగ్రత్తగా కలపాలి.
9. అంటే రుచికరమైన ఆవ పెట్టిన పులిహోర సిద్ధం. ఇది గంట రెండు సేపు ఉంచిన తరువాత తింటే మంచి రుచి వస్తుంది.

Advertisement

Also read: Carrot Bobbatlu: క్యారెట్ హల్వా స్టఫ్ చేసిన బొబ్బట్లు రెసిపీ.. చూస్తేనే నోరూరిపోతుంది

మీరు ఒక్కసారి ఇలా ఆవ పులిహోర తింటే జీవితం మర్చిపోలేరు. సాధారణ పులిహోరతో పోలిస్తే ఇది ఎంతో రుచిగా ఉంటుంది. దీనికి జతగా పక్కన మసాలా పెట్టిన వండిన బంగాళాదుంప కూర కూడా తింటే అద్భుతంగా అనిపిస్తుంది. ఇంకెందుకాలస్యం ఒక్కసారి వండుకుని తిని చూడండి.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×