// // Drinks For Thyroid: థైరాయిడ్ పనితీరును మెరుగుపరిచే 7 అద్భుతమైన డ్రింక్స్.. -->
E-Paper
Advertisement

Drinks For Thyroid: థైరాయిడ్ సమస్యా ? ఈ డ్రింక్స్‌ తాగితే అంతా సెట్

Drinks For Thyroid: థైరాయిడ్ సమస్యా ? ఈ డ్రింక్స్‌ తాగితే అంతా సెట్
Advertisement

Drinks For Thyroid: థైరాయిడ్ గ్రంథి అనేది శరీర జీవక్రియ, శక్తి ఉత్పత్తి, ఉష్ణోగ్రత నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తుంది. థైరాయిడ్ పని తీరు సరిగా లేకపోతే అలసట, బరువు పెరగడం, జుట్టు రాలడం వంటి అనేక సమస్యలు తలెత్తుతాయి. సరైన ఆహారం, జీవనశైలి మార్పులతో పాటు, కొన్ని సహజమైన డ్రింక్స్ తాగడం ద్వారా థైరాయిడ్ ఆరోగ్యాన్ని మెరుగు పరచవచ్చని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.

థైరాయిడ్ పనితీరును మెరుగుపరచడానికి సహాయపడే 7 సహజ డ్రింక్స్:

Advertisement

1. నిమ్మకాయ, అల్లం కలిపిన గోరువెచ్చని నీరు:
నిమ్మరసంలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అల్లంలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు థైరాయిడ్ గ్రంథి చుట్టూ ఉండే వాపును తగ్గించడానికి సహాయ పడతాయి. ఉదయాన్నే దీనిని తీసుకోవడం వల్ల జీవక్రియ  మెరుగుపడుతుంది.

2. పసుపు, పాలు:
పసుపులో శక్తివంతమైన యాంటీ ఇన్‌ఫ్లమేటరీ సమ్మేళనం అయిన కర్కుమిన్ ఉంటుంది. ఇది థైరాయిడ్ వాపును తగ్గించడంలో , ఆటో ఇమ్యూన్ థైరాయిడ్ పరిస్థితులలో (హషిమోటోస్ వంటివి) ప్రయోజనకరంగా పనిచేస్తుంది. రాత్రి పడుకునే ముందు గోరు వెచ్చని పాలలో చిటికెడు పసుపు కలిపి తాగడం మంచిది.

Advertisement

3. క్యారెట్ , బీట్‌రూట్ జ్యూస్:
ఈ జ్యూస్‌లో విటమిన్ ఎ, యాంటీఆక్సిడెంట్లు, ముఖ్యంగా ఐరన్ అధికంగా ఉంటాయి. ఐరన్ , విటమిన్ ఎ లోపాలు థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తిని ప్రభావితం చేస్తాయి. ఈ జ్యూస్ రక్తహీనతను నివారించి, థైరాయిడ్ గ్రంథికి అవసరమైన పోషకాలను అందిస్తుంది.

4. కొబ్బరి నీరు :
కొబ్బరి నీరు ఎలక్ట్రోలైట్లు, మెగ్నీషియం , పొటాషియంతో నిండి ఉంటుంది. థైరాయిడ్ సమస్యలతో బాధపడేవారిలో తరచుగా కనిపించే అలసటను ఇది తగ్గిస్తుంది. దీనిలోని సహజ చక్కెరలు తక్షణ శక్తిని అందిస్తాయి. అంతే కాకుండా జీవ క్రియను మెరుగు పరుస్తాయి.

Also Read: డైలీ వేరుశనగ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే.. షాక్ అవుతారు !

5. గ్రీన్ టీ :
గ్రీన్ టీలో కేటెచిన్స్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ముఖ్యంగా.. హైపోథైరాయిడిజంతో వచ్చే బరువు పెరగడాన్ని నియంత్రించడంలో ఇది సహాయ పడుతుంది. జీవక్రియ రేటును స్వల్పంగా పెంచి.. కొవ్వును కరిగించే ప్రక్రియను ఇది ప్రేరేపిస్తుంది.

6. యాపిల్ సైడర్ వెనిగర్ డ్రింక్ :
యాపిల్ సైడర్ వెనిగర్ శరీరం యొక్క pH స్థాయిలను సమతుల్యం చేయడంలో సహాయ పడుతుందని కొందరు నిపుణులు సూచిస్తారు. ఇది థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తిని ప్రేరేపించడంలో, శరీరంలో హార్మోన్ల సమతుల్యతను మెరుగు పరచడంలో సహాయ పడుతుంది. ఒక గ్లాస్ నీటిలో ఒక టీస్పూన్ ఈ జ్యూస్ తో పాటు తేనె కలిపి తీసుకోవచ్చు.

7. పాలకూర, అరటిపండు స్మూతీ:
పాలకూరలో ఫోలేట్, ఐరన్, మెగ్నీషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి థైరాయిడ్ పని తీరుకు చాలా అవసరం. అరటిపండుతో కలిపి తీసుకునే ఈ స్మూతీ ఒక ఆరోగ్యకరమైన.. పోషకాలతో కూడిన భోజన ప్రత్యామ్నాయంగా పనిచేసి.. జీవక్రియను మెరుగు పరుస్తుంది.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×