E-Paper
Advertisement

షుగర్ పేషెంట్లకు వరం లాంటి పండ్లు.. ఇక స్వీట్ క్రేవింగ్స్‌కు గుడ్ బై

షుగర్ పేషెంట్లకు వరం లాంటి పండ్లు.. ఇక స్వీట్ క్రేవింగ్స్‌కు గుడ్ బై
Advertisement

Diabetes Friendly Fruits: డయాబెటిస్ లేదా మధుమేహం రాగానే చాలా మంది తమకు ఇష్టమైన ఆహార పదార్థాలన్నింటికీ దూరంగా ఉంటారు. ముఖ్యంగా పండ్లు తింటే ఎక్కడ బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయో అని అస్సలు ముట్టుకోరు. నిజానికి పండ్లలో ఉండే ఫ్రక్టోజ్ వల్ల షుగర్ పెరుగుతుందనేది నిజమే అయినా.. కొన్ని రకాల పండ్లలో ఉండే ఫైబర్ (పీచు పదార్థం) రక్తంలో చక్కెర నెమ్మదిగా కలవడానికి సహాయ పడుతుంది. మధుమేహ రోగులు ఎలాంటి భయం లేకుండా నిశ్చింతగా తినగలిగే 7 అద్భుతమైన పండ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

రక్తంలో చక్కెరను అదుపులో ఉంచే 7 అద్భుతమైన పండ్లు:

మధుమేహ రోగులు పండ్లను ఎంచుకునేటప్పుడు వాటి గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉందా లేదా అనేది చూసుకోవాలి. లో-జీఐ ఉన్న పండ్లు తింటే బ్లడ్ షుగర్ అకస్మాత్తుగా పెరగదు. అలాంటి 7 సూపర్ ఫ్రూట్స్ ఇవే..

Advertisement

1. జామ పండు:
మనకు అత్యంత అందుబాటులో ఉండే జామ పండు డయాబెటిస్ ఉన్నవారికి ఒక అమృతం లాంటిది. ఇందులో విటమిన్-సి , ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇది తింటే.. కడుపు నిండిన ఫీలింగ్ రావడమే కాకుండా.. బ్లడ్ షుగర్ లెవెల్స్ పర్ఫెక్ట్‌గా మేనేజ్ అవుతాయి.

2. యాపిల్:
“రోజుకో యాపిల్ తింటే.. డాక్టర్‌తో పనే ఉండదు” అనే సామెత మధుమేహ రోగులకు కూడా వర్తిస్తుంది. యాపిల్‌లో సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది. ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచడానికి, చక్కెర శోషణను తగ్గించడానికి అద్భుతంగా పనిచేస్తుంది.

Advertisement

3. నేరేడు పండ్లు :
ఆయుర్వేదంలో కూడా డయాబెటిస్ నివారణకు నేరేడు పండ్లను ఎక్కువగా వాడతారు. ఈ పండులో ఉండే ‘జాంబోలిన్’ అనే గ్లూకోసైడ్, గింజలలో ఉండే స్టార్చ్.. శరీరంలో చక్కెరగా మారకుండా అడ్డుకుంటాయి. ఇవి షుగర్ పేషెంట్లకు మోస్ట్ రికమండెడ్ ఫ్రూట్.

4. బొప్పాయి :
బొప్పాయిలో సహజసిద్ధమైన యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీని గ్లైసిమిక్ ఇండెక్స్ మీడియంగా ఉన్నప్పటికీ.. ఇందులోని పీచు పదార్థం వల్ల ఇది గుండెకు , రక్తంలో చక్కెరను అదుపు చేయడానికి ఎంతగానో మేలు చేస్తుంది.

5. కివీ:
విదేశీ పండైనా ఇప్పుడు మనకు బాగా దొరుకుతున్న కివిలో విటమిన్-సి, పొటాషియం, ఫైబర్ అధికంగా ఉంటాయి. దీని జీఐ స్కోరు చాలా తక్కువ. కాబట్టి ఇది తింటే ఇన్సులిన్ స్థాయిలు స్థిరంగా ఉంటాయి.

6. ఆరెంజ్ లేదా బత్తాయి:
నారింజ, బత్తాయి లాంటి సిట్రస్ పండ్లలో ఫైబర్ తో పాటు విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది. ఇవి నేరుగా బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్‌పై పాజిటివ్ ఇంపాక్ట్ చూపిస్తాయి. అయితే, వీటిని జ్యూస్ రూపంలో కాకుండా నేరుగా పండులా.. తింటేనే పూర్తి ఫైబర్ అందుతుంది.

7. దానిమ్మ :
దానిమ్మ గింజల్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు ఇన్సులిన్ నిరోధకతను తగ్గించడంలో సహాయ పడతాయి. ఇది డయాబెటిస్ వల్ల వచ్చే గుండె జబ్బుల రిస్క్‌ను కూడా తగ్గిస్తుంది.

గుర్తుంచుకోవాల్సిన స్మార్ట్ టిప్స్:
జ్యూస్‌లు వద్దు: పండ్లను ఎప్పుడూ జ్యూస్ రూపంలో తాగకూడదు. జ్యూస్ చేయడం వల్ల అందులోని ఫైబర్ పోయి, షుగర్ లెవెల్స్ ఫాస్ట్‌గా పెరిగిపోతాయి.

పరిమాణం ముఖ్యం: ఏ పండైనా సరే ఒకేసారి ఎక్కువగా కాకుండా.. ఒక చిన్న కప్పు మోతాదులో మాత్రమే తినాలి.

సరైన సమయం: పండ్లను సాయంత్రం వేళల్లో స్నాక్స్‌లా లేదా ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తర్వాత తినడం మంచిది.

మధుమేహం ఉన్నంత మాత్రాన పండ్లకు దూరం కావాల్సిన అవసరం లేదు. పైన పేర్కొన్న 7 పండ్లను మీ డైలీ డైట్‌లో భాగం చేసుకోవడం వల్ల శరీరానికి కావలసిన పోషకాలు అందడమే కాకుండా.. బ్లడ్ షుగర్ కూడా కంట్రోల్‌లో ఉంటుంది. అయితే.. మీ షుగర్ రీడింగ్స్ బట్టి ఒకసారి మీ డాక్టర్ లేదా డైటీషియన్‌ను సంప్రదించి సరైన క్వాంటిటీని డిసైడ్ చేసుకోవడం మంచిది.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×