E-Paper
Advertisement

Relationship secrets: భార్యకు ఈ 7 లక్షణాలు ఉంటే.. ఆ భర్త అదృష్టవంతుడే!

Relationship secrets: భార్యకు ఈ 7 లక్షణాలు ఉంటే.. ఆ భర్త అదృష్టవంతుడే!
Advertisement

Relationship secrets: “సంసారం ఒక చదరంగం” అన్నాడు ఒక సినీ కవి. ఎత్తులు, పైఎత్తులు.. గొడవలు, సమాధానాలు.. ఇవన్నీ కలిస్తేనే కాపురం. అయితే పెళ్లయ్యాక గొడవలు లేని కాపురం ఈ ప్రపంచంలోనే ఉండదు. కానీ, ఆ గొడవలను ఎంతవరకు తీసుకెళ్తున్నాం అనేదే ముఖ్యం. మీ మ్యారేజ్ లైఫ్ ఎప్పటికీ ‘హ్యాపీ’గా, ‘క్రేజీ’గా సాగిపోవాలంటే.. పురాణాలు, మోడరన్ సైకాలజీస్టులు  చెబుతున్న ఈ 7 గోల్డెన్ రూల్స్ పై మీరూ ఓ లుక్కేయండి!

 ప్రేమను దాచుకోకండి.. ఎక్స్‌ప్రెస్ చేయండి!

“ప్రేమ మనసులో ఉంటే సరిపోదు.. అది మాటల్లో, చేతల్లో కనిపించాలి” అంటున్నారు నిపుణులు. “నాకు తెలుసు కదా తనకి నా మీద ప్రేమ ఉందని” అని భార్యాభర్తలు అనుకుంటే అక్కడే గ్యాప్ మొదలవుతుంది. చిన్న చూపు, ఒక చిన్న స్పర్శ, ఒక ప్రేమగా పలికే మాట.. బంధాన్ని వెయ్యి ఏనుగుల బలాన్ని ఇస్తాయి. అందం కంటే మనసును ప్రేమించినప్పుడే ఆ బంధం కలకాలం నిలుస్తుంది.

 ‘రెస్పెక్ట్’ – రిలేషన్‌కి ఇదే అసలైన బ్రేక్!

Advertisement

ప్రేమ ఎంత ముఖ్యమో.. గౌరవం అంతకంటే ముఖ్యం. కోపంలో నోరు జారితే, ఆ మాటలు గుండెల్లో గుచ్చుకుంటాయి. ఒక్కసారి మాట జారితే రిలేషన్ బ్రేక్ అయ్యే వరకు వెళ్తుంది. ముఖ్యంగా భర్త కుటుంబ సభ్యుల ముందు ఇచ్చే గౌరవం, అతడి దృష్టిలో మీ విలువను పెంచుతుంది.

 ఊహల్లో వద్దు.. క్లారిటీతో ఉండండి!

చాలామంది భార్యలు చేసే పొరపాటు.. “నేను చెప్పకుండానే అతను నా మనసు తెలుసుకోవాలి” అని ఆశించడం. ఇది సినిమాల్లో బాగుంటుంది కానీ రియల్ లైఫ్‌లో అపార్థాలకు దారి తీస్తుంది. మనసులో ఏమున్నా సూటిగా చెప్పేయండి. క్లారిటీ ఉంటేనే కాపురం సాఫీగా సాగుతుంది.

 మార్పులను అంగీకరించండి (The Parenting Phase)

Advertisement

పిల్లలు పుట్టాక లైఫ్ స్టైల్ మొత్తం మారుతుంది. బాధ్యతలు పెరుగుతాయి, పర్సనల్ టైమ్ తగ్గుతుంది. కానీ, ఆ బిజీలో కూడా భార్యాభర్తలు ఒకరికోసం ఒకరు కనీసం పది నిమిషాలు కేటాయించుకోవాలి. ఆ చిన్న క్షణాలే మీ బంధానికి బూస్ట్ ఇస్తాయి.

 షేరింగ్ ఈజ్ కేరింగ్: చేతులు కలపండి!

ఇంటి పనుల్లో భర్త, బయట పనుల్లో భార్య.. ఇలా ఒకరికొకరు తోడుగా నిలబడాలి. “ఇది నా పని.. అది నీ పని” అనే బౌండరీలు దాటి చేతులు కలిపితే ఆ బంధం ఉక్కులా మారుతుంది.

 పబ్లిక్‌లో గౌరవం.. ప్రైవేట్‌లో ప్రేమ!

భార్య తన భర్తను నలుగురిలో గౌరవిస్తే, అతనికి అది గర్వంగా ఉంటుంది. అయితే, భర్త కూడా ఆ గౌరవానికి తగినట్టుగా ప్రవర్తించాలి. ఒకరి లోపాలను ఒకరు బయటపెట్టుకోకుండా, ఒకరికొకరు సపోర్ట్‌గా ఉండటమే అసలైన విజయం.

also read:Relationship Secrets: భర్త తన మాటే వినాలంటే భార్య ఏం చేయాలి…?

 ఇల్లే ఒక దేవాలయం..

ఇల్లు అంటే కేవలం ఇటుకలు, సిమెంట్ కాదు.. అదొక ఎమోషనల్ ప్లేస్. ఇంటిని ప్రేమతో, శుభ్రంగా చూసుకునే భార్య కాపురానికి ప్రాణం పోస్తుంది. ఆ ఇల్లు ప్రశాంతంగా లేకపోతే, ఎంత పెద్ద బంగళా అయినా శ్మశానంతో సమానమే!

ఫైనల్ పంచ్: హ్యాపీ మ్యారేజ్ అంటే కేవలం కలిసి ఉండటం కాదు.. ప్రేమ + గౌరవం + అర్థం చేసుకోవడం అనే ఈ ఫార్ములాను పాటించడం. ఈ 7 సూత్రాలు పాటిస్తే మీ వైవాహిక జీవితం ఎప్పటికీ స్వర్గమే!

మీకు ఏమనిపిస్తుంది? ఈ సూత్రాల్లో ఏది కరెక్ట్ అనిపిస్తోంది? కామెంట్ సెక్షన్‌లో మీ అభిప్రాయాన్ని పంచుకోండి!

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×