E-Paper
Advertisement

Coffee: మీరు కోరుకోని గట్ సమస్యలకు కాఫీనే కారణం ! ఇప్పటికైనా తప్పు తెలుసుకోండి

Coffee: మీరు కోరుకోని గట్ సమస్యలకు కాఫీనే కారణం ! ఇప్పటికైనా తప్పు తెలుసుకోండి
Advertisement

Coffee: ప్రపంచవ్యాప్తంగా కాఫీ అత్యంత ప్రజాదరణ పొందిన పానీయం. ఉదయాన్నే ఒక కప్పు వేడి కాఫీ తాగడం వల్ల ఉత్సాహం లభిస్తుంది. కానీ మనం కాఫీని తీసుకునే విధానంలో చేసే కొన్ని చిన్న పొరపాట్లు మన జీర్ణ వ్యవస్థ ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీయవచ్చు.పేగు ఆరోగ్యం మొత్తం శారీరక ఆరోగ్యం , మానసిక స్థితిని ప్రభావితం చేస్తుంది కాబట్టి.. కాఫీ తాగేటప్పుడు నివారించాల్సిన 7 ముఖ్యమైన తప్పులు ఇక్కడ తెలుసుకుందాం.

కాఫీ పేగు ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం:
1. ఖాళీ కడుపుతో తాగడం : ఉదయాన్నే ఖాళీ కడుపుతో కాఫీ తాగడం వల్ల పొట్టలో హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉత్పత్తి పెరుగుతుంది. కడుపులో ఆహారం లేనప్పుడు, ఈ యాసిడ్ పేగు, పొట్ట గోడలను చికాకు పెట్టి, గుండెల్లో మంట, ఎసిడిటీ సమస్యలకు దారితీస్తుంది. కాఫీని బ్రేక్ ఫాస్ట్ తర్వాత తీసుకోవడం ఉత్తమం.

Advertisement

2. అతిగా కెఫిన్ తీసుకోవడం: రోజుకు అధికంగా కెఫిన్ తీసుకోవడం వలన పేగు కదలికలు వేగవంతం అవుతాయి. ఇది కొంతమందిలో అతిసారం లేదా పొట్ట ఉబ్బరానికి కారణమవుతుంది. అధిక కెఫిన్ పేగు గోడలపై ఒత్తిడిని పెంచుతుంది.

3. కృత్రిమ స్వీటెనర్‌లు వాడటం : చక్కెర లేని కాఫీ కోసం చాలామంది కృత్రిమ స్వీటెనర్‌లు వాడుతుంటారు. ఇవి పేగులలోని ఆరోగ్యకరమైన మైక్రోబయోమ్‌ను (మంచి బ్యాక్టీరియా) దెబ్బతీస్తాయి. మంచి బ్యాక్టీరియా సమతుల్యత చెడిపోతే.. జీర్ణ వ్యవస్థ పనితీరు మందగిస్తుంది.

Advertisement

4. ఫ్లేవర్డ్ సిరప్‌లు లేదా క్రీములు కలపడం: కేఫ్‌లలో లభించే ఫ్లేవర్డ్ కాఫీలలో అధిక చక్కెర, శుద్ధి చేసిన నూనెల, కృత్రిమ రంగులు ఉంటాయి. ఈ పదార్థాలు పేగులలోని హాని కరమైన బ్యాక్టీరియాకు ఆహారంగా మారి.. పేగు గోడల్లో మంటను పెంచుతాయి.

5. నిద్రపోయే ముందు తాగడం: రాత్రిపూట నిద్రలో.. పేగు గోడలు తమను తాము పునరుద్ధరించుకుంటాయి. నిద్రవేళకు దగ్గరగా కాఫీ తాగడం వల్ల నిద్రకు భంగం కలిగి, ప్రేగు పునరుద్ధరణ ప్రక్రియ దెబ్బతింటుంది. దీని వల్ల జీర్ణవ్యవస్థ మొత్తం ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది.

6. నాణ్యత లేని కాఫీ సీడ్స్ : కొన్ని నాణ్యత లేని లేదా సరిగా నిల్వ చేయని కాఫీ గింజలలో మైకోటాక్సిన్స్ ఉండే అవకాశం ఉంది. ఈ విష పదార్థాలు జీర్ణ వ్యవస్థకు చికాకు కలిగించి, దీర్ఘకాలిక పేగు సమస్యలకు దారితీయవచ్చు. ఎల్లప్పుడూ నాణ్యమైన, తాజాగా కాల్చిన గింజలను ఎంచుకోవాలి.

7. పేగు సమస్యలను పట్టించుకోకపోవడం : కాఫీ తాగిన తర్వాత మీకు తరచుగా కడుపు ఉబ్బరం, అధిక గ్యాస్, ఎసిడిటీ లేదా కడుపు తిమ్మిర్లు వంటి లక్షణాలు కనిపిస్తే.. మీ శరీరం కాఫీని సరిగా తీసుకోలేకపోతోందని అర్థం. ఈ హెచ్చరిక సంకేతాలను విస్మరించి తాగడం కొనసాగిస్తే.. పేగు గోడలు దెబ్బతిని లీకీ-గట్ వంటి సమస్యలు రావచ్చు.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×