E-Paper
Advertisement

Tamarind For Digestion: రోజూ చింతపండు తింటే మీ కడుపు క్లీన్.. ఎలాగో తెలుసా?

Tamarind For Digestion: రోజూ చింతపండు తింటే మీ కడుపు క్లీన్.. ఎలాగో తెలుసా?
Advertisement

Tamarind For Digestion: చాలా మంది ఇళ్లో వంటకాల్లో చింతపండు ఉపయోగిస్తారు. ఇది కేవలం ఆహారం యొక్క రుచిని పెంచడమే కాకుండా ఆయుర్వేదంలో కూడా గొప్ప ఔషధంగా గుర్తింపు పొందింది. పులుపు రుచికి పెట్టింది పేరు అయిన చింతపండు, పూర్వీకుల కాలం నుంచి జీర్ణ సంబంధిత సమస్యల నివారణకు దీనిని ఉపయోగిస్తున్నారు. ఇందులో ఉండే విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపి, జీర్ణవ్యవస్థను శుద్ధి చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. సరైన మోతాదులో చింతపండును తీసుకోవడం వల్ల పొట్ట ఆరోగ్యంగా ఉండటమే కాకుండా మొత్తం శరీర రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీనికి సంబంధించిన మరిన్ని ప్రయోజనాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

జీర్ణక్రియకు చింతపండు అందించే 6 ప్రయోజనాలు:

Advertisement

1. సహజ విరోచనకారి:
చింతపండులో పొటాషియం బిటార్ట్రేట్, మాలిక్ యాసిడ్ ,టార్టారిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటాయి. ఇవి సహజ విరోచనకారిగా పని చేస్తాయి. మలబద్ధకంతో ఇబ్బంది పడేవారు చింతపండు గుజ్జును తీసుకోవడం వల్ల మలవిసర్జన సాఫీగా జరుగుతుంది. ఇది పేగు కదలికలను మెరుగుపరుస్తుంది.

2. జీర్ణరసాల ఉత్పత్తిని పెంచుతుంది:
మనం తీసుకున్న ఆహారం సరిగ్గా అరగాలంటే శరీరంలో జీర్ణరసాలు తగినంతగా ఉత్పత్తి కావాలి. చింతపండు జీర్ణ ఎంజైమ్ల విడుదలను ప్రేరేపిస్తుంది. దీని వల్ల ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు సులభంగా విచ్ఛిన్నం చేయబడి.. పోషకాలు శరీరానికి అందుతాయి.

Advertisement

3. గ్యాస్, కడుపు ఉబ్బరం తగ్గింపు:
తిన్న ఆహారం సరిగ్గా అరగనప్పుడు కడుపులో గ్యాస్ చేరి ఉబ్బరంగా అనిపిస్తుంది. చింతపండులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు జీర్ణవాహికలో వాపును తగ్గించి, గ్యాస్ సమస్యను నివారిస్తాయి. భోజనం తర్వాత చిన్న చింతపండు ముక్క తీసుకోవడం వల్ల అజీర్తి సమస్యలు తగ్గుముఖం పడతాయి.

4. పేగు ఆరోగ్యం:
చింతపండులో ఫైబర్ (పీచు పదార్థం) అధికంగా ఉంటుంది. ఈ ఫైబర్ మన పేగుల్లో ఉండే మంచి బ్యాక్టీరియాకు ఆహారంగా పనిచేస్తుంది. పేగుల్లో ఉండే వ్యర్థాలను, టాక్సిన్స్‌ను తొలగించి, పేగు క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

5. పిత్తాశయ పనితీరును మెరుగుపరుస్తుంది:
కాలేయం నుండి బైల్ రసం ఉత్పత్తిని చింతపండు పెంచుతుంది. ఇది ముఖ్యంగా.. కొవ్వు పదార్థాలను అరిగించడంలో సహాయ పడుతుంది. కాలేయ ఆరోగ్యానికి చింతపండు చాలా మేలు చేస్తుంది. తద్వారా జీర్ణక్రియ ప్రక్రియ మొత్తం సజావుగా సాగుతుంది.

Also Read: టేస్టీగా వేడి వేడి టమోటా పులావ్ తింటే నోరూరిపోతుంది, రెసిపీ ఇదిగో

6. కడుపులోని ఇన్ఫెక్షన్ల నివారణ:
చింతపండుకు యాంటీ మైక్రోబియల్ , యాంటీ సెప్టిక్ లక్షణాలు ఉన్నాయి. ఇది కడుపులోని హానికరమైన బ్యాక్టీరియాను, పరాన్నజీవులను నశింపజేస్తుంది. విరేచనాలు, నులిపురుగుల సమస్యల నివారణకు పూర్వకాలం నుంచి చింతపండు నీటిని వాడటం ఒక అలవాటు.

చింతపండు రుచితో పాటు అపారమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. అయితే.. దీనిని మితంగా తీసుకోవడం ముఖ్యం. అతిగా తీసుకుంటే పంటి ఎనామిల్ దెబ్బతినే అవకాశం ఉంది లేదా గొంతులో మంట రావచ్చు. కాబట్టి.. రోజువారీ వంటకాల్లో లేదా డ్రింక్ రూపంలో తగినంత చింతపండును చేర్చుకోవడం ద్వారా మీరు మీ జీర్ణవ్యవస్థను మెరుగుపరుచుకోవచ్చు.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×