E-Paper
Advertisement

Perfume: రోజంతా ‘ఫ్రెష్‌’గా ఉండాలా? పర్ఫ్యూమ్ మ్యాజిక్ వర్కవుట్ అవ్వాలంటే ఇవి పాటించండి

Perfume: రోజంతా ‘ఫ్రెష్‌’గా ఉండాలా? పర్ఫ్యూమ్ మ్యాజిక్ వర్కవుట్ అవ్వాలంటే ఇవి పాటించండి
Advertisement

Perfume: పర్ఫ్యూమ్ వాడటం అనేది ఒక కళ. కేవలం సువాసన కోసం బాటిల్ తీసుకుని ఒళ్ళంతా చల్లుకోవడం వల్ల సరైన ఫలితం ఉండదు. చాలా మంది పర్ఫ్యూమ్ వాడుతున్నప్పుడు తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తుంటారు. దీని వల్ల ఆ సువాసన త్వరగా ఆవిరైపోవడమే కాకుండా.. చర్మ సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. పర్ఫ్యూమ్ వాడేటప్పుడు మనం చేసే 5 సాధారణ పొరపాట్లు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

1. మణికట్టును ఒకదానికొకటి రుద్దడం:

చాలా మంది పర్ఫ్యూమ్ కొట్టుకున్న వెంటనే రెండు చేతుల మణికట్టులను కలిపి గట్టిగా రుద్దుతారు. ఇది చాలా పెద్ద తప్పు. ఇలా రుద్దడం వల్ల పర్ఫ్యూమ్‌లోని అణువుల మధ్య ఘర్షణ జరిగి, ఆ సువాసనలోని అసలైన నోట్స్ విచ్ఛిన్నమవుతాయి. ఫలితంగా పర్ఫ్యూమ్ వాసన మారిపోతుంది. అంతే కాకుండ ఎక్కువ సేపు ఉండదు. పర్ఫ్యూమ్ స్ప్రే చేశాక దానంతట అదే చర్మంపై ఆరిపోయేలా వదిలేయాలి.

Advertisement

2. పొడి చర్మంపై స్ప్రే చేయడం:

పర్ఫ్యూమ్ అనేది తేమ ఉన్న చర్మంపై ఎక్కువ సేపు నిలుస్తుంది. చర్మం పొడిగా ఉన్నప్పుడు పర్ఫ్యూమ్ సువాసనను పీల్చుకోకుండా గాలిలో కలిసి పోతుంది. స్నానం చేసిన వెంటనే చర్మంపై కొద్దిగా మాయిశ్చరైజర్ లేదా వాసెలిన్ రాసి.. ఆ తర్వాత పర్ఫ్యూమ్ వాడితే అది రోజంతా ఫ్రెష్‌గా ఉంటుంది. 

3. బట్టలపై స్ప్రే చేయడం:

చాలా మంది పర్ఫ్యూమ్‌ను బట్టలపై మాత్రమే కొట్టుకుంటారు. కానీ పర్ఫ్యూమ్ అనేది చర్మంపై ఉండే వేడికి ప్రతిస్పందించి సువాసనను వెద జల్లుతుంది. బట్టలపై స్ప్రే చేయడం వల్ల కొన్ని సార్లు మరకలు పడవచ్చు లేదా సువాసన సరిగ్గా రాకపోవచ్చు. పల్స్ పాయింట్స్ అంటే మెడ, మణికట్టు, చెవుల వెనక స్ప్రే చేయడం సరైన పద్ధతి.

4. బాటిల్‌ను షేక్ చేయడం:

చాలా మంది ఉపయోగించే ముందు పర్ఫ్యూమ్ బాటిల్‌ను బలంగా ఊపుతారు. ఇలా చేయడం వల్ల బాటిల్‌లో గాలి బుడగలు ఏర్పడి పర్ఫ్యూమ్ నాణ్యత దెబ్బతింటుంది. పర్ఫ్యూమ్ తయారీలో ఉపయోగించే రసాయనాలు ఆక్సిజన్‌తో కలిసినప్పుడు వాటి ప్రభావం తగ్గుతుంది. కాబట్టి బాటిల్‌ను అస్సలు కదపకుండా నేరుగా స్ప్రే చేయాలి.

Also Read: వారానికి 3 సార్లు బొప్పాయి ఆకుల నీరు తాగితే.. మీ శరీరంలో జరిగే అద్భుతాలు ఇవే!

5. పర్ఫ్యూమ్‌ను తప్పుగా స్టోర్ చేయడం:

పర్ఫ్యూమ్ బాటిల్స్‌ను బాత్‌ రూమ్‌లో లేదా ఎండ తగిలే చోట ఉంచకూడదు. బాత్‌రూమ్‌లోని తేమ, వేడి వల్ల పర్ఫ్యూమ్‌లోని ఆయిల్‌లు పాడైపోయి వాసన మారుతుంది. పర్ఫ్యూమ్‌ను ఎప్పుడూ చల్లని, చీకటిగా ఉండే ప్రదేశంలో లేదా ఒరిజినల్ బాక్స్‌లోనే ఉంచడం మంచిది. 

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×