E-Paper
Advertisement

వేసవిలో ఈ 6 తప్పులు చేస్తున్నారా? అయితే మీ ఆరోగ్యానికి డేంజర్ బెల్స్ మోగినట్టే!

వేసవిలో ఈ 6 తప్పులు చేస్తున్నారా? అయితే మీ ఆరోగ్యానికి డేంజర్ బెల్స్ మోగినట్టే!
Advertisement

Summer Health Mistakes: సమ్మర్ వచ్చేసింది. బయట ఎండలు 40 డిగ్రీలు దాటేస్తున్నా చాలా మంది షికార్లు, పార్టీలు అంటూ బిజీగా గడిపేస్తుంటారు. అయితే, ఈ జోష్‌లో ఆరోగ్యాన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ‘హెల్త్ రిస్క్’ తప్పదు. కేవలం దాహం వేసినప్పుడు మాత్రమే నీళ్లు తాగడం, కూల్ డ్రింక్స్‌పై అతిగా ఆధారపడటం వంటి తప్పుల వల్ల బాడీ ఈజీగా డీహైడ్రేషన్ బారిన పడుతుంది. సమ్మర్ లో తెలియక చేసే 6 సాధారణ పొరపాట్లు ఏంటి? వాటి నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

సమ్మర్ జాగ్రత్తలు: ఈ 6 తప్పులు అస్సలు చేయకండి!

Advertisement

వేసవి కాలం ఎంజాయ్ చేయడానికి ఎంత బాగుంటుందో.. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే అంత ఇబ్బందిగానూ మారుతుంది. ముఖ్యంగా కాలేజీ స్టూడెంట్స్, ఆఫీస్ గోయర్స్ ఈ ఎండలను లైట్ తీసుకుంటారు. కానీ బాడీ లోపల జరిగే మార్పులను గమనించకపోతే.. హాస్పిటల్ పాలు కావాల్సి వస్తుంది. మీరు చేసే ఆ 6 తప్పులు ఇవే..

1. దాహం వేసినప్పుడే నీళ్లు తాగడం:
చాలా మంది చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఇది. దాహం వేసిందంటే మీ బాడీ అప్పటికే డీహైడ్రేషన్ మోడ్‌లోకి వెళ్లిపోయిందని అర్థం. ఎండలో తిరిగేటప్పుడు దాహంతో సంబంధం లేకుండా గంటకోసారి నీళ్లు తాగుతూ ఉండాలి. లేదంటే తలనొప్పి, నీరసం వంటివి ఎదుర్కోవాల్సి వస్తుంది.

Advertisement

2. కూల్ డ్రింక్స్‌:
దాహం తీర్చుకోవడానికి సోడాలు, ఎనర్జీ డ్రింక్స్, లేదా సాఫ్ట్ డ్రింక్స్ తాగుతుంటారు. వీటిలో ఉండే కెఫీన్ , షుగర్ మీ బాడీని ఇంకాస్త డీహైడ్రేట్ చేస్తాయి తప్ప లాభం ఉండదు. వాటికి బదులు కొబ్బరి నీళ్లు, మజ్జిగ లేదా నిమ్మరసం తీసుకోవడం బెస్ట్.

3. సన్‌స్క్రీన్ లేకుండా బయటకు వెళ్లడం:
“అబ్బాయిలకు సన్‌స్క్రీన్ ఎందుకు?” అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. సూర్యుడి నుంచి వచ్చే యూవీ (UV) కిరణాలు చర్మాన్ని కాల్చేస్తాయి. సన్ ట్యాన్ మాత్రమే కాదు.. స్కిన్ క్యాన్సర్ వచ్చే రిస్క్ కూడా ఉంటుంది. బయటకు వెళ్లే 20 నిమిషాల ముందే మంచి సన్‌స్క్రీన్ రాసుకోవడం మర్చిపోవద్దు.

4. మధ్యాహ్నం వేళలో వర్కౌట్స్ :
జిమ్ లేదా గ్రౌండ్‌కు వెళ్లే అలవాటు ఉన్న యూత్, ఎండ ఎక్కువగా ఉన్న సమయంలో వ్యాయామం చేయకూడదు. దీనివల్ల బాడీ టెంపరేచర్ అకస్మాత్తుగా పెరిగి ‘హీట్ ఎగ్జాషన్’ వచ్చే ప్రమాదం ఉంది. వర్కౌట్స్ చేయాలనుకుంటే.. ఉదయం 7 లోపు లేదా సాయంత్రం 6 తర్వాత ప్లాన్ చేసుకోండి.

5. హెవీగా తినడం (ముఖ్యంగా మసాలా ఫుడ్):
సమ్మర్‌లో డైజెస్టివ్ సిస్టమ్ కాస్త వీక్‌గా ఉంటుంది. ఇలాంటి టైమ్‌లో ఘాటైన బిర్యానీలు, స్పైసీ చికెన్ వంటివి తింటే కడుపులో మంట, ఎసిడిటీ మొదలవుతాయి. వీలైనంత వరకు పండ్లు, ఆకుకూరలు వంటి ఆహారం తీసుకోవడం మేలు.

6. డార్క్ కలర్ , సింథటిక్ బట్టలు ధరించడం:
నలుపు రంగు బట్టలు వేడిని ఎక్కువగా పీల్చుకుంటాయి. అలాగే జీన్స్ లేదా సింథటిక్ మెటీరియల్స్ వేసుకుంటే గాలి ఆడక చెమట పట్టేసి స్కిన్ ఇన్ఫెక్షన్లు వస్తాయి. ఈ వేసవిలో కాటన్ బట్టలు, లైట్ కలర్స్ వేసుకుంటే బాడీ కూల్‌గా ఉంటుంది.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×