E-Paper
Advertisement

Coffee: మహిళలు కాఫీ మానేయాలా ? ఈ 5 లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆపేయండి!

Coffee: మహిళలు కాఫీ మానేయాలా ? ఈ 5 లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆపేయండి!
Advertisement

Coffee: చాలామంది మహిళలు అలసటను తగ్గించుకోవడానికి లేదా ఉత్సాహం కోసం రోజుకు నాలుగైదు సార్లు కాఫీ తాగుతుంటారు. అయితే.. కాఫీలోని కెఫీన్ అందరి శరీరాలకు సరిపడదు. ముఖ్యంగా మహిళల హార్మోన్ల వ్యవస్థపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుంది. మీరు కాఫీ తాగినప్పుడు శరీరం కొన్ని ప్రతికూల సంకేతాలను పంపుతుంది. ఆ సంకేతాలను గుర్తించకపోతే దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు తప్పవని న్యూట్రిషనిస్టులు హెచ్చరిస్తున్నారు. ఆడవారు కాఫీకి దూరంగా ఉండాలని సూచించే 5 ప్రధాన లక్షణాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

కాఫీలో ఉండే కెఫిన్ మెదడును చురుగ్గా ఉంచుతుంది కానీ.. అది మహిళల శరీరంలో ఉండే ‘ఎండ్రోక్రైన్’వ్యవస్థను దెబ్బతీస్తుంది. పురుషులతో పోలిస్తే.. మహిళల శరీరంలో హార్మోన్ల మార్పులు ఎక్కువగా జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో.. కింది 5 లక్షణాలు మీలో కనిపిస్తుంటే మీరు కాఫీని మానేయడం లేదా తగ్గించడం చాలా మంచిది.

Advertisement

1. హార్మోన్ల అసమతుల్యత,పీరియడ్స్ సమస్యలు:
మహిళల్లో ఈస్ట్రోజెన్ హార్మోన్ స్థాయిలను కెఫీన్ ప్రభావితం చేస్తుంది. పీరియడ్స్ సమయంలో తీవ్రమైన కడుపు నొప్పి, అధిక రక్తస్రావం లేదా నెలసరి సరిగ్గా రాకపోవడం వంటి సమస్యలు ఉంటే దానికి కాఫీ ఒక కారణం కావచ్చు. కాఫీ తాగడం వల్ల శరీరంలో కార్టిసాల్ పెరిగి, ప్రొజెస్టెరాన్ స్థాయిలు తగ్గుతాయి. దీని వల్ల సంతానోత్పత్తి సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

2. విపరీతమైన ఆందోళన,చిరాకు:
కాఫీ తాగిన తర్వాత మీ గుండె వేగంగా కొట్టుకోవడం లేదా చేతులు వణకడం వంటివి జరుగుతున్నాయా? అయితే మీ శరీరం కెఫీన్‌ను తట్టుకోలేకపోతుందని అర్థం. కెఫీన్ ‘అడ్రినల్’ గ్రంధులను ప్రేరేపించి శరీరంలో భయాందోళనలను పెంచుతుంది. పదేపదే చిరాకు పడటం, చిన్న విషయానికే కంగారు పడటం వంటి లక్షణాలు ఉంటే అది మీరు తాగే కాఫీ ప్రభావమే కావచ్చు.

Advertisement

3. నిద్రలేమి సమస్య :
చాలామంది మహిళలు పగటిపూట అలసటగా ఉందని కాఫీ తాగుతారు. కానీ.. ఇది రాత్రి నిద్రపై ప్రభావం చూపుతుంది. కెఫీన్ శరీరంలో దాదాపు 6 నుంచి 10 గంటల పాటు ఉంటుంది. మధ్యాహ్నం తాగిన కాఫీ కూడా రాత్రి గాఢ నిద్రకు ఆటంకం కలిగిస్తుంది. నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల హార్మోన్ల వ్యవస్థ మరింత గందరగోళానికి గురవుతుంది. ఒకవేళ మీకు రాత్రిపూట నిద్ర పట్టడం లేదంటే.. కొన్ని రోజులు కాఫీకి దూరంగా ఉండి చూడండి.

4. జీర్ణక్రియ సమస్యలు, ఎసిడిటీ:
కాఫీ ఆమ్ల గుణాన్ని కలిగి ఉంటుంది. ఖాళీ కడుపుతో కాఫీ తాగడం వల్ల కడుపులో మంట, గ్యాస్ , ఎసిడిటీ సమస్యలు పెరుగుతాయి. మహిళల్లో ఇది ఐరన్, కాల్షియం శోషణను అడ్డుకుంటుంది. దీని వల్ల రక్తహీనత, ఎముకల బలహీనత వంటి సమస్యలు తలెత్తుతాయి. ఆహారం తీసుకున్న వెంటనే కాఫీ తాగడం వల్ల పోషకాలు శరీరానికి అందవు.

Also Read: క్యారెట్ Vs చిలగడదుంప.. కంటి చూపుకు ఏది బెస్ట్ ?

5. చర్మ సమస్యలు, మొటిమలు:
మీ చర్మంపై అకస్మాత్తుగా మొటిమలు రావడం లేదా చర్మం పొడిబారిపోవడం జరుగుతుంటే కాఫీ కారణం కావచ్చు. కెఫీన్ శరీరంలోని నీటి శాతాన్ని తగ్గిస్తుంది. దీని వల్ల చర్మం తన మెరుపును కోల్పోతుంది. అలాగే.. కార్టిసాల్ లెవల్స్ పెరగడం వల్ల చర్మంలో నూనె ఉత్పత్తి ఎక్కువై మొటిమలకు దారితీస్తుంది.

కాఫీకి ప్రత్యామ్నాయంగా గ్రీన్ టీ, హెర్బల్ టీ లేదా నిమ్మరసం వంటివి తీసుకోవడం మహిళల ఆరోగ్యానికి ఎంతో మేలు. పైన పేర్కొన్న లక్షణాలు మీలో కనిపిస్తుంటే.. వెంటనే నిపుణుల సలహా తీసుకోవడం, కాఫీ అలవాటును క్రమంగా తగ్గించుకోవడం ఉత్తమం. మీ శరీరం ఇచ్చే చిన్న చిన్న సంకేతాలే రేపటి మీ ఆరోగ్యానికి పునాది.

 

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×