E-Paper
Advertisement

Depression: ఈ లక్షణాలున్నాయా ? గ్యారంటీగా డిప్రెషన్ ఉన్నట్లే !

Depression: ఈ లక్షణాలున్నాయా ? గ్యారంటీగా డిప్రెషన్ ఉన్నట్లే !
Advertisement

Depression: డిప్రెషన్ కేవలం “బాధగా ఉండటం” కాదు. ఇది ఒక తీవ్రమైన మానసిక ఆరోగ్య పరిస్థితి. దీనిని తెలుగులో సాధారణంగా కుంగుబాటు అంటారు. చాలా మందికి.. డిప్రెషన్ నెమ్మదిగా మొదలవుతుంది. అందుకే ప్రారంభ లక్షణాలను గుర్తించడం చాలా ముఖ్యం. త్వరగా గుర్తించి.. చికిత్స తీసుకోవడం వల్ల ఈ పరిస్థితి తీవ్రం కాకుండా నిరోధించవచ్చు.

డిప్రెషన్ ప్రారంభ లక్షణాలు:

Advertisement

1.  బాధ  :
ఎలాంటి స్పష్టమైన కారణం లేకుండా.. తరచుగా లేదా నిరంతరంగా బాధగా నిస్సత్తువగా లేదా లోపల ఏదో కోల్పోయినట్లుగా అనిపించడం. ఆశ లేని, శూన్యమైన భావనతో ఎక్కువ సమయం గడపడం వంటివి డిప్రెషన్ లక్షణాలు.

2. ఆసక్తి కోల్పోవడం:
గతంలో ఆనందాన్నిచ్చిన హాబీలు, స్నేహితులతో మాట్లాడటం, పని లేదా పనుల్లో ఆసక్తిని పూర్తిగా కోల్పోవడం. దేనిలోనూ ఉత్సాహం లేకపోవడం.

Advertisement

3. నిద్రలో మార్పులు:
ఇది రెండు విధాలుగా ఉండవచ్చు: నిద్ర పట్టకపోవడం (నిద్రలేమి లేదా ఇన్సోమ్నియా), లేదా అతిగా నిద్రపోవడం (హైపర్సోమ్నియా). ఉదయాన్నే చాలా తొందరగా నిద్ర లేవడం కూడా ఒక లక్షణం.

4. శక్తి లేకపోవడం, అలసట:
నిద్ర బాగా పోయినా కూడా నిరంతరం అలసటగా.. బలహీనంగా అనిపించడం. చిన్న పనులు చేయడానికి కూడా శక్తి లేనట్లుగా, శరీరం బరువుగా అనిపించడం.

5. ఏకాగ్రత లోపం:
ఏకాగ్రత పెట్టడంలో ఇబ్బంది పడటం.. చిన్న నిర్ణయాలు తీసుకోవడానికి కూడా చాలా కష్టపడటం, విషయాలను గుర్తుంచుకోవడంలో సమస్యలు ఎదురవడం. చదువు లేదా ఆఫీసు పనిపై ప్రభావం పడటం.

6. ఆకలి, బరువులో మార్పులు:
ఆకలి బాగా తగ్గిపోయి బరువు తగ్గడం, లేదా దీనికి విరుద్ధంగా, అతిగా తినడం వల్ల బరువు పెరగడం జరగవచ్చు. ఒక నెలలో శరీర బరువులో 5% కన్నా ఎక్కువ మార్పు వస్తే గమనించాలి.

7. నిస్సత్తువ:
తాము పనికిరాని వారమని.. అనవసరమైన వారమని భావించడం. చిన్న చిన్న తప్పులకు కూడా తమను తాము తీవ్రంగా నిందించుకోవడం లేదా అతిగా అపరాధ భావనకు లోనవడం.

8. చిరాకు, కోపం:
కొంతమంది డిప్రెషన్ ఉన్న వ్యక్తులు విచారంగా ఉండకపోవచ్చ. కానీ తరచుగా చిరాకుగా, ఉద్రిక్తంగా లేదా కోపంగా ఉండవచ్చు. సహనం కోల్పోవడం, చిన్న విషయాలకే అకస్మాత్తుగా ఆగ్రహానికి గురికావడం.

Also Read: బ్రేక్ ఫాస్ట్ మానేస్తున్నారా ? మీరు ఎదుర్కోబోయే 10 తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఇవే !

9. శారీరక నొప్పులు:
తల నొప్పి, కడుపు నొప్పి, కీళ్ల నొప్పులు లేదా ఇతర శారీరక నొప్పులు తరచుగా వేధించడం, కానీ వైద్య పరీక్షలలో ఎటువంటి నిర్దిష్ట కారణం కనపడకపోవడం. చికిత్స తీసుకున్నా తగ్గకపోవడం.

10. సామాజిక దూరం:
స్నేహితులు, కుటుంబ సభ్యులకు దూరంగా ఉండటం, సామాజిక కార్యక్రమాలలో పాల్గొనడానికి ఇష్టపడకపోవడం లేదా ఆసక్తి చూపకపోవడం. ఒంటరిగా గడపడానికి ప్రయత్నించడం.

లక్షణాలను ఎందుకు నిర్లక్ష్యం చేయకూడదు ?
డిప్రెషన్ అనేది సరైన చికిత్స తీసుకోకపోతే.. అది మీ ఆరోగ్యం, వృత్తి, సంబంధాలు, మొత్తం జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ప్రారంభ దశలోనే ఈ లక్షణాలను గుర్తించి.. మానసిక ఆరోగ్య నిపుణులను (సైకియాట్రిస్ట్ లేదా కౌన్సిలర్) సంప్రదించడం ద్వారా డిప్రెషన్‌ను సమర్థవంతంగా నిర్వహించవచ్చు. అంతే కాకుండా నయం చేయవచ్చు. చికిత్సలో కౌన్సిలింగ్, థెరపీ లేదా అవసరమైతే మందులు ఉంటాయి.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×