E-Paper
Advertisement

ఫ్రిజ్‌లో ఈ బాటిల్స్ వాడుతున్నారా? అయితే మీరు డేంజర్‌లో ఉన్నట్లే!

ఫ్రిజ్‌లో ఈ బాటిల్స్ వాడుతున్నారా? అయితే మీరు డేంజర్‌లో ఉన్నట్లే!
Advertisement

Summer tips: సమ్మర్ వచ్చిందటే చాలు ..అందరి చేతులు ఫ్రిడ్జ్ వైపే.. సూర్యుడి ప్రతాపం ఆ రేంజ్ లో ఉంటుంది మరి.అయితే చాలా మంది చల్లని నీళ్ళని గడ గడ తాగేస్తుంటారు కాని , అసలు ఫ్రిడ్జ్ లో ఎలాంటి బాటిల్ ని పెడుతున్నాం, ఏంటి అన్న విషయాలని అసలు లెక్కలోకే తీసుకోరు.కాని ఈ బాటిల్ పైనే మన హెల్త్ అన్నది ఆధారపడి ఉందన్న సంగతి మీకు తెలుసా …అవును   మనం చేసే ఈ చిన్న చిన్న తప్పులే మన హార్మోన్ సిస్టం ని కొలాప్స్ చేసే చాన్స్ ఉందంటున్నారు ఎక్స్పర్ట్స్.

శరీరంలోని హార్మోన్లని ఇంబాలెన్స్ చేసే ప్లాస్టిక్ 

Advertisement

ఇక్కడ చాలా మంది చేసే తప్పు ఏంటంటే మార్కెట్ లో చీప్ గా దొరికేస్తున్నాయ్ అని ప్లాస్టిక్ బాటిళ్లని కొనేసి తెగ వాడేస్తుంటారు. సాధారణ ప్లాస్టిక్ బాటిళ్లలో BPA (Bisphenol A) అనే భయంకరమైన కెమికల్ ఉంటుంది. ఈ బాటిళ్లను గనుక ఎక్కువ రోజులు అలాగే వాడుతూ ఉంటె ఆ కెమికల్ మెల్లగా నీటిలో కలిసిపోతాయి. ఇది మన శరీరంలోని హార్మోన్లని ఇంబాలెన్స్ చేస్తుంది.సో వీలైనంత త్వరగా కు ప్లాస్టిక్ యూసేజ్ తగ్గించాలి. ఒకవేళ తప్పని పరిస్థితుల్లో మాత్రమే BPA Free అని ఉన్న బాటిళ్లను మాత్రమే వాడాలని సజీషన్ ఇస్తున్నారు ఎక్స్పర్ట్స్.

గాజు బాటిల్స్ (సీసాలు)నే వాడటం ఉత్తమం 

Advertisement

ఇక హెల్త్ విషయంలో అస్సలు కాంప్రమైజ్ కాని వారు మాత్రం గాజు బాటిల్స్ (సీసాలు)నే వాడటం ఉత్తమమని సలహా ఇస్తున్నారు ఎక్స్పర్ట్స్.ఎందుకంటే గాజు ఎలాంటి కెమికల్స్ ని రిలీజ్ చేయదు కాబట్టి.ఇక నీళ్ళ ప్యూరిటీ టేస్ట్ ఏ మాత్రం మారకుండా తాజాగా ఉంటుందట. అయితే ప్లాస్టిక్ బాటిల్స్ తో పోలిస్తే గాజు బాటిల్స్ పగిలిపోయే ప్రమాదం ఉన్నా, ఇంట్లో ఉండి హెల్త్ కి ప్రయారిటీ ఇచ్చేవారికి మాత్రం ఇవే బెస్ట్ ఆప్షన్.

స్టెయిన్‌లెస్ స్టీల్ బాటిళ్లు ఒక వరం

ఇక జర్నీ లేదా ఆఫీస్ లకి వెళ్లే వారికి స్టెయిన్‌లెస్ స్టీల్ బాటిళ్లు ఒక వరం అనే చెప్పాలి.ఇవి ప్లాస్టిక్ కంటే వెయ్యి రెట్లు మేలు.వీటి వల్ల నీళ్ళు ఎక్కువ సేపు చల్లగా ఉండటమే కాకుండా,వీటితో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఒక రకంగా ఫ్రిజ్‌లో పెట్టడానికి ఇవే పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు.

ఫ్రిజ్‌లో పెట్టుకునేలా మట్టి సీసాలు

ఇక వీటన్నింటితో పాటు  ప్రస్తుతం మార్కెట్‌లో ఫ్రిజ్‌లో పెట్టుకునేలా మట్టి సీసాలు (Clay Bottles) కూడా ఈజీగానే దొరికేస్తునాయ్. ఇవి న్యాచురల్ గా కూల్ గా ఉండటమే కాకుండా , నీటిలో ఉన్న మలినాలను గ్రహిస్తాయి కూడా. ఇక ఆయుర్వేద పరంగా చూస్తే రాగి పాత్రలు కూడా మంచివే కానీ, వాటిని ఫ్రిజ్‌లో పెట్టడం కంటే బయట ఉంచి వాడుకోవడమే మేలని సూచిస్తున్నారు ఆయుర్వేద నిపుణులు .

హాస్పిటల్ కి అడ్రస్ వెతుక్కోవాల్సిందే

ఇక ఫైనల్ గా మీ బడ్జెట్ ఎంతైనా, లైఫ్ స్టైల్ ఏదైనా కావొచ్చు. కానీ ప్లాస్టిక్ బాటిల్స్‌ను ఫ్రిజ్‌లో పెట్టడం అంటే మాత్రం రోగాలను డబ్బులిచ్చి మరీ కొని తెచ్చుకోవడమే.సో ఇప్పటికైనా మీ ఫ్రిజ్‌లోని ప్లాస్టిక్ బాటిళ్లను బయటపడేసి గాజు లేదా స్టీల్ బాటిళ్లకు షిఫ్ట్ అవ్వండి. లేదంటే హాస్పిటల్ కి అడ్రస్ వెతుక్కోవాల్సిందే !

also read:ఒకరికి హిట్టు లేదు.. మరొకరికి ఫామ్ లేదు! అయ్యగారికి మళ్లీ ‘ఏజెంట్’ రిపీట్ అవుతుందా ?

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×