E-Paper
Advertisement

OTT Movie : చేపల ఆంటీకి వల వేసే సిటీ కుర్రాడు … ఆ వయసులో ఇవేం పాడు పనులో

OTT Movie : చేపల ఆంటీకి వల వేసే సిటీ కుర్రాడు … ఆ వయసులో ఇవేం పాడు పనులో
Advertisement

OTT Movie : ఓటిటిలో హాలీవుడ్ రొమాంటిక్ సినిమాలకు ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. లవ్ తో పాటు రొమాంటిక్ సీన్స్ ఎక్కువగా వీటిలో  ఉంటాయి. అందుకే ఈ సినిమాలను ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఇప్పుడు మనం చెప్పుకునే మూవీలో చేపలు అమ్ముకునే ఆంటీ తో, ఒక కుర్రాడు సంబంధం పెట్టుకుంటాడు. చివరికి ఇది ఎటు దారి తీస్తుంది అనే విషయం, స్టోరీ లోకి వెళ్లి తెలుసుకుందాం. ఈ రొమాంటిక్ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…

గూగుల్ ప్లే (Google Play) లో

Advertisement

ఈ హాలీవుడ్ రొమాంటిక్ మూవీ పేరు ‘వైల్డ్ సీస్’ (Wild Seas). 2022 లో వచ్చిన ఈ ఫ్రెంచ్ డ్రామా రొమాంటిక్ మూవీకి హెలోయిస్ పెల్లోక్వెట్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ ఫ్రాన్స్‌లోని అట్లాంటిక్ తీరంలోని, ఒక ద్వీపంలో నివసించే జంట చుట్టూ తిరుగుతుంది. సముద్రం నేపథ్యంలో సెట్ చేయబడిన ఈ మూవీ ప్రేమ, కోరిక, వ్యక్తిగత స్వేచ్ఛ గురించి సున్నితమైన అనుభూతులను అందిస్తుంది. ఈ సినిమాను ఒంటరిగా చూడటం మంచిది. ఇందులో కొన్ని సీన్స్ చాలా హాట్ గా ఉంటాయి.  ఈ రొమాంటిక్ మూవీ గూగుల్ ప్లే లో స్ట్రీమింగ్ అవుతోంది.

స్టోరీలోకి వెళితే

Advertisement

చియారా అనే మహిళ తన భర్తతో కలిసి చేపల వేట వృత్తిలో పని చేస్తుంది. చేపలు పట్టుకుని, అమ్ముతూ వాళ్ళు సంతోషకరమైన జీవితాన్ని గడుపుతుంటారు. ఇంతలో మాక్సెన్స్ అనే యువకుడు రాకతో, వారి జీవితంలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటాయి. మాక్సెన్స్ వయసులో ఉండడంతో చియారా అతనికి బాగా అట్రాక్ట్ అవుతుంది. అతను అక్కడికి చేపల గురించి, వాటిని పట్టడం గురించి తెలుసుకోవడానికి వస్తాడు.  అయితే అమ్మాయితో కాకుండా, నలభై వయసున్న ఆంటీతో రొమాన్స్ చేయడానికి సిద్దపడతాడు. కొద్దిరోజుల్లోనే ఒకరికి ఒకరు బాగా దగ్గర అవుతారు. ఒకసారి భర్త ఇంట్లో లేనప్పుడు ఇద్దరూ కలసి ఇంటిమేట్ కూడా అవుతారు. అయితే చియారా భర్తకు తెలియకుండా, ఈ పని చేసినందుకు చాలా బాధపడుతుంది. ఒకరోజు భర్త పనిమీద వేరే సిటీకి వెళ్లతాడు. ఇక ఆ సమయంలో కూడా ఇద్దరూ ఒళ్ళు తెలియకుండా రెచ్చిపోతారు.

ఈ విషయం అక్కడ ఉన్న కొంతమందికి తెలిసిపోతుంది. ఆమెను అక్కడ ఉన్నవాళ్లు ద్వేషించడం మొదలుపెడతారు. ఈ బాధలు తట్టుకోలేక అక్కడ నుంచి దూరంగా వెళ్లిపోవాలని చియారా నిర్ణయించుకుంటుంది. ఆమె ఇక అక్కడ ఉండలేక వెళ్ళిపోతుంది. ఈ క్రమంలోనే కొంతకాలం తర్వాత విడాకుల కోసం అప్లై కూడా చేస్తుంది. అయితే ఆమె భర్త కూడా చియారా మీద ద్వేషం పెంచుకోకుండా విడాకులు తీసుకుంటాడు. విడిపోయేటప్పుడు కూడా పాత జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ విడిపోతారు. చివరికి ఆమె ఎటువంటి జీవితాన్ని ఎంచుకుంటుంది? మాక్సెన్స్ తో కలసి ఉంటుందా ? ఆమెకు జీవితం నేర్పిన పాఠం ఏమిటి? ఈ విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే,  ‘వైల్డ్ సీస్’ (Wild Seas) అనే ఈ రొమాంటిక్ మూవీని మిస్ కాకుండా చూడండి.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×