E-Paper
Advertisement

Whirlpool 3-Door Fridge: వర్ల్‌పూల్ నుంచి.. 3 డోర్ల మ్యాజిక్ ఫ్రిడ్జ్ లాంచ్.. ఇది నిజంగా సూపర్ బ్రో!

Whirlpool 3-Door Fridge: వర్ల్‌పూల్ నుంచి.. 3 డోర్ల మ్యాజిక్ ఫ్రిడ్జ్ లాంచ్.. ఇది నిజంగా సూపర్ బ్రో!
Advertisement

Whirlpool 3-Door Fridge: వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రముఖ కంపెనీలు.. సరికొత్త రిఫ్రిజిరేటర్లను మార్కెట్ లో లాంచ్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే వర్ల్ పూల్ Whirlpool సంస్థ.. భారత్ లో Protton NXT పేరుతో సరికొత్త 3-డోర్ రిఫ్రిజిరేటర్ల శ్రేణిని విడుదల చేసింది. డబుల్ డోర్ల రిఫ్రిజిరేటర్లతో పోలిస్తే చల్ల గాలి వృథాను ఇది 43 శాతం వరకూ తగ్గిస్తుందని కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఈ సరికొత్త ఫ్రిడ్జ్ లోని ప్రధాన ఫీచర్లు? దాని వల్ల కలిగే లాభాలు? ధర వివరాలను ఇప్పుడు పరిశీలిద్దాం.

3 డోర్ల ప్రత్యేకత

Protton NXT రిఫ్రిజిరేటర్ల ప్రధానమైన ఫీచర్లుగా 3 డోర్లను చెప్పుకోవచ్చు. మూడు డోర్లు ఉండటం వల్ల మీకు అవసరమైన దానినే తెరిచే అవకాశం కల్పిస్తుంది. ఒక డోర్ తెరిచినప్పుడు ఇతర రెండు డోర్లు క్లోజ్ అయ్యి ఉండటం వల్ల.. చల్లదనం బయటకు వెళ్లిపోదు. తద్వారా 2 డోర్ ఫ్రిడ్జ్ లతో పోలిస్తే.. 43 శాతం తక్కువ కూలింగ్ గాలి బయటకు పోతుంది.

విద్యుత్ ఆదా

Advertisement

2026 BEE ప్రమాణాల ప్రకారం వీటిని రూపొందించినట్లు వర్ల్ పూల్ వర్గాలు తెలిపాయి. వీటిని 4 స్టార్ రేటింగ్‌తో తీసుకొస్తున్నందున చాలా తక్కువ విద్యుత్తును వినియోగిస్తాయని పేర్కొన్నారు.

బ్యాక్టీరియా ఉండదు!

ఈ ఫ్రిడ్జ్ ను మైక్రోబ్లాక్ టెక్నాలజీతో రూపొందించినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. ఇది బ్యాక్టీరియా వృద్ధిని 99% వరకు అడ్డుకుంటుందని పేర్కొన్నాయి. తద్వారా పండ్లు, కూరగాయలు 15 రోజుల వరకు తాజాగా ఉంటాయి.

అదనపు స్టోరేజ్

Advertisement

పండ్లు, కూరగాయల కోసం ప్రత్యేకంగా కేటాయించిన బాటమ్ డ్రాయర్‌లో ఇతర ఫ్రిడ్జ్ లతో పోలిస్తే 40% అదనపు స్థలం లభిస్తుందని కంపెనీ పేర్కొంది.

యాక్టివ్ డియో (Active Deo)

Protton NXT సిరీస్ ఫ్రిడ్జ్ లలో ప్రధానంగా చెప్పుకోవాల్సిన ఫీచర్ యాక్టివ్ డియో. ఇది ఫ్రిడ్జ్ లోని వివిధ కంపార్ట్ మెంట్ల మధ్య వాసనలు లేదా దుర్వాసనల బదిలిని అడ్డుకుంటుంది. ఇతర వాటిపై ఆహార పదార్థాల వాసనల ప్రభావం పడకుండా నియంత్రిస్తుంది.

360 డిగ్రీ కూలింగ్

ఈ ఫ్రిడ్జ్ లోని ‘ఫ్రెష్ ఫ్లో’ అనే మరో ఫీచర్ ద్వారా ఫ్రిజ్ అంతటా సమానంగా గాలి ప్రసరించి అన్ని వస్తువులను ఒకేలా చల్లబరుస్తుంది.

Also Read: Best SIM in India: కొత్త సిమ్ కావాలా? Jio, Airtel, BSNL, Vi.. సిగ్నల్, ప్లాన్స్, డేటాలో ఏది బెటర్?

ధర ఎంతంటే?

Whirlpool Protton NXT ఫ్రిడ్జ్ ప్రారంభ ధర రూ.27,500గా కంపెనీ నిర్ణయించింది. ప్రముఖ ఆన్‌లైన్ ఈ-కామర్స్ సైట్లు (Amazon, Flipkart), దేశవ్యాప్తంగా ఉన్న రిటైల్ స్టోర్లలో ఈ అడ్వాన్స్డ్ ఫ్రిడ్జ్ లను కొనుగోలు చేయవచ్చని కంపెనీ పేర్కొంది.

Also Read: Jio Recharge Plan: జియోలో ఈ ప్లాన్ గురించి తెలుసా? ఇన్నాళ్లు ఎలా మిస్ అయ్యారు!

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×