E-Paper
Advertisement

Vitamin D : విటమిన్ డి మాత్రలు ఎప్పుడు వాడాలి?

Vitamin D : విటమిన్ డి మాత్రలు ఎప్పుడు వాడాలి?
Advertisement

Vitamin D : ఎముకల ఆరోగ్యానికి విటమిన్‌ డి ఎంతగానో ఉపయోగపడుతుంది. కొవ్వులో కరిగే విటమిన్ కూడా ఇదే. మన ఇమ్యూనిటీ పెంచేందుకు ఇది చాలా అవసరం. విటమిన్ డి స్థాయి తక్కువగా ఉన్నవారికి శరీర పెరుగుదల ఆగిపోతుంది. అయితే విటమిన్‌ డి ఎంత స్థాయిలో తీసుకోవాలో, అసలు వాడొచ్చా అనేది ముందుగా డాక్టర్‌ను సంప్రదిస్తే మంచిది. ప్రతి ఒక్కరూ ఏదో సమయంలో విటమిన్ డి లోపాన్ని ఎదుర్కొంటారు. విటమిన్ డి లోపం మగవాళ్ల పోలిస్తే రుతుక్రమం ఆగిపోయిన స్త్రీలపై ఎక్కువగా ఉంటుంది. సూర్యరశ్మికి ఉండడం వల్ల మనకు ఎక్కువ మోతాదులో విటమిన్ డి అందుతుంది. ఎండాకాలంలో 15 నుంచి 20 నిమిషాలు వారానికి రెండు నుండి మూడు సార్లు చేతులు, కాళ్లను ఎండలో ఉంచడం మంచిది. సాధారణంగా అయితే విటమిన్ డిని పొందడానికి సూర్యుడి ఎండలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్యకాలంలో ఉండాలి. మన శరీరం తక్కువ సమయంలో విటమిన్ డిని ఎక్కువగా తయారు చేస్తుంది. చలికాలంలో ఎక్కువ ఎండ అందుబాటులో లేని ప్రదేశాల్లో మీకు విటమిన్‌ డి లభించదు అలాంటప్పుడు కొన్ని విటమిన్‌ డి ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవాలి. అవి సాల్మన్, రెడ్ మీట్, గుడ్డు సొన, లివర్‌లో ఎక్కువగా విటమిన్‌ డి ఉంటుంది. ఊబకాయం ఉన్నవారు, 65 ఏళ్ళ కంటే ఎక్కువ వయసు ఉన్నవారికి విటమిన్‌ డి స్థాయిలు తక్కువగా ఉంటాయి. విటమిన్ డి ఎక్కువగా తీసుకోవడం కూడా మన శరీరంపై నెగెటీవ్ ఎఫెక్ట్స్ చూపుతుంది. ఇది కాల్షియం ఏర్పడేందుకు దారి తీస్తుంది. ఇది ఎముకలను బలహీనపరుస్తుంది. అంతేకాకుండా గుండె, మూత్రపిండాలను దెబ్బతీస్తుందని వైద్యులు అంటున్నారు. ఒకటి నుండి 10 సంవత్సరాలలోపు పిల్లలకు విటమిన్‌ డి స్థాయి 50 మైక్రోగ్రాముల కంటే మించకూడదు. 12 నెలల లోపు శిశువులకు 25 మైక్రోగ్రాముల కంటే మించొద్దు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం విటమిన్ డి సప్లిమెంట్స్ విషయానికొస్తే అవి వేసుకునే టైమ్ కూడా ముఖ్యమే. ఈ ట్యాబ్లెట్స్ ఉదయమే తీసుకోవాలి. సూర్యుని నుండి సహజంగా విటమిన్ డిని తీసుకుంటే మధ్యాహ్నం వరకూ బెనిఫిట్స్ పొందుతాం అని నిపుణులు చెబుతున్నారు.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×