E-Paper
Advertisement

WhatsApp New Feature : వాట్సాప్ కొత్త ఫీచర్.. అలాంటి కాల్స్ మ్యూట్..

WhatsApp New Feature : వాట్సాప్ కొత్త ఫీచర్.. అలాంటి కాల్స్ మ్యూట్..
Advertisement
WhatsApp New Feature

WhatsApp New Feature : సోషల్ మీడియాలో యూజర్ల ప్రైవసీపై యాజమాన్యం ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా యూజర్లు ఏదో ఒక విధంగా ప్రైవసీ విషయంలో ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ముఖ్యంగా తెలియని వారి దగ్గర నుండి మెసేజ్‌లు రాకుండా ఉండడం కోసం సోషల్ మీడియా యాప్స్ ఏమీ ప్రత్యేకంగా చర్యలు తీసుకోవడం లేదు. అందుకే వాట్సాప్ ఒక కొత్త అప్డేట్‌తో ముందుకొచ్చింది. తెలియని నెంబర్ల నుండి వచ్చే మెసేజ్‌లు, కాల్స్ విషయంలో చర్యలు తీసుకోవచ్చని అంటోంది.

Advertisement

ఒకరి నెంబర్ మన దగ్గర ఉంటే దానికి వాట్సాప్ ఉందో లేదో తెలుసుకోవచ్చు. అలాగే వారి దగ్గర మన నెంబర్ లేకపోయినా కూడా మెసేజ్, వాట్సాప్ కాల్స్ చేయవచ్చు. ఈ సౌలభ్యం అనేది యూజర్లను ఇబ్బందుల్లో పడేస్తోంది. అందుకే తెలియని నెంబర్ల నుండి వచ్చే కాల్స్, మెసేజ్‌లను మ్యూట్ చేసుకునే విధంగా కొత్త అప్డేట్‌ను ప్రవేశపెట్టింది వాట్సాప్. ‘సైలెన్స్ అన్నౌన్ కాలర్స్’ పేరుతో ఈ కొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది. ఈ ఫీచర్ గురించి మెటా అధినేత మార్క్ జుకెర్బర్గ్ స్వయంగా ప్రకటించాడు.

స్పాప్ కాల్స్, స్కామ్ కాల్స్, తెలియని నెంబర్ల నుండి వచ్చే కాల్స్‌ను ఈ ఫీచర్ ఆటోమేటిక్‌గా మ్యూట్ చేస్తుంది. ఇది కచ్చితంగా యూజర్ల సెక్యూరిటీని పెంచుతుంది అంటూ మార్క్ ప్రకటించాడు. ఈ ఫీచర్ వచ్చిన తర్వాత తెలియని నెంబర్ల నుండి వచ్చే కాల్స్ వల్ల ఫోన్ రింగ్ అవ్వదు. కానీ కాల్ లిస్ట్‌లో మాత్రం ఆ కాల్ వచ్చినట్టు కనిపిస్తుంది. దీంతో పాటు ‘ప్రైవసీ చెకప్’ అనే మరో ఆప్షన్‌ను యూజర్లకు అందిస్తోంది వాట్సాప్. హెల్ప్ ఆప్షన్ లాగానే ఇది కూడా యూజర్లకు వాట్సాప్ ప్రైవసీపై పూర్తిగా అవగాహన కల్పిస్తుంది.

Advertisement

యూజర్ల మెసేజ్‌ల విషయంలో ప్రైవసీ అనేది తమకు ముఖ్య బాధ్యత అని యాజమాన్యం అంటోంది. అందుకోసమే అన్నింటికంటే ముందుగా ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ అనే ఒక ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పింది. అదే విధంగా ఇంకా ఏ ఇతర కారణాల వల్ల కూడా యూజర్లు ఇబ్బంది పడకుండా ఉండేలా ప్రైవసీ విషయంలో మరిన్ని జాగ్రత్తగా తీసుకుంటోంది వాట్సాప్. అందుకే గత కొన్నిరోజుల్లోనే ప్రైవసీకి సంబంధించి ఎన్నో కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టింది. ఇప్పుడు సైలెన్స్ అన్నౌన్ కాల్స్ కూడా అందులోనే యాడ్ అవ్వనుంది.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×