E-Paper
Advertisement

Born in March: మార్చి నెలలో పుట్టారా..? అయితే మీ లైఫ్ ఎలా ఉంటుందో తెలుసా..?

Born in March: మార్చి నెలలో పుట్టారా..? అయితే మీ లైఫ్ ఎలా ఉంటుందో తెలుసా..?
Advertisement

Born in March: మార్చి నెలలో జన్మించిన వారి వ్యక్తిత్వం చాలా ప్రత్యేకంగా, ఆసక్తికరంగా ఉంటుందట. న్యూమరాలజీ, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, మార్చిలో పుట్టిన వారి జీవితం మరియు స్వభావం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

స్వభావం (Personality): మార్చిలో పుట్టిన వారు చాలా సున్నితమైన మనస్తత్వం కలిగి ఉంటారట. ఇతరుల బాధను చూసి వెంటనే చలించిపోతారట. ఎదుటివారికి సహాయం చేయడంలోనూ ఎప్పుడూ ముందుంటారట. వీరికి కళలు, సంగీతం, పెయింటింగ్ వంటి రంగాలపై ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుందట. మార్చిలో పుట్టిన వ్యక్తులు బయటకు చాలా మర్యాదగా కనిపిస్తారట. ఏదైనా విషయాన్ని సూటిగా చెప్పడానికి ఇష్టపడతారట.

Advertisement

కెరీర్ మరియు ఆర్థిక పరిస్థితి: మార్చి నెలలో పుట్టిన వ్యక్తులు కేరీర్‌లో రాణించాలనుకుంటే టీచింగ్, ఆర్ట్స్, సోషల్ సర్వీస్, మెడిసిన్, లేదా పరిశోధనా రంగాలను ఎంచుకోవాలని పండితులు సూచిస్తున్నారు. మార్చి నెలలో పుట్టిన వారికి డబ్బు కంటే కీర్తి, గౌరవమే ముఖ్యం అనిపిస్తుంట. ఆర్థికంగా స్థిరపడటానికి వీరు చేసే ప్రయత్నం నిలకడగా ఉంటుంది. తొందరపాటు నిర్ణయాల వల్ల కొన్నిసార్లు ఆర్థిక ఇబ్బందులు రావచ్చట.

సామాజిక సంబంధాలు: మార్చి నెలలో పుట్టిన జాతకులు ఎవరికైనా ప్రాణ స్నేహితులుగా ఉంటారట. ఒకరిని నమ్మితే చివరి వరకు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటారట. వీరికి అందరితో కలిసి ఉండటం ఎంత ఇష్టమో, అప్పుడప్పుడు ఒంటరిగా గడపడం కూడా అంతే ఇష్టమట.

Advertisement

మార్చిలో పుట్టిన వారిపై గ్రహాల ప్రభావం: మార్చిలో పుట్టిన వారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీన రాశి (Pisces) లేదా మేష రాశి(Aries)కి చెందినవారై ఉంటారట. మార్చి 21 కంటే ముందు పుట్టిన వారు మీన రాశి వారు. వీరు ఆధ్యాత్మికమైన ఆలోచనాపరులుగా ఉంటారట. మార్చి 21 తర్వాత పుట్టిన వారు మేష రాశి కిందకు వస్తారట. వీరు ఎంతో ఉత్సాహవంతులుగా, నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారట.

కొన్ని సవాళ్లు (Challenges): మార్చి నెలలో పుట్టిన వాళ్లు చిన్న చిన్న విషయాలకు కూడా వీరు ఎక్కువగా ఆలోచించి..  మానసికంగా ఆందోళన చెందుతారట. ఇతరులను బాధపెట్టకూడదనే ఉద్దేశంతో వీరు నష్టపోతుంటారట. అదే ఆలోచనలో ఉంటూ వీళ్లు నిర్ణయాలు తీసుకోవడంలో కూడా జాప్యం చేసి నష్టపోతుంటారట.

విజయానికి చిట్కాలు: మార్చిలోపుట్టిన వ్యక్తులు ఏ విషయంలోనైనా అతిగా ఆలోచించకుండా, ప్రాధాన్యతలను బట్టి నిర్ణయాలు తీసుకోవడం నేర్చుకోవాలట. అలాగే తమ ప్రతిభను తక్కువ అంచనా వేసుకోకుండా, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలట. ఇక మార్చిలో పుట్టిన వారు అందమైన మనసున్న వ్యక్తులట. వీరు తమ క్రియేటివిటీని, నమ్మకాన్ని ఆయుధాలుగా మార్చుకుంటే మాత్రం వీరికి జీవితంలో తిరుగుండదట. ఎన్నో విజయాలను అందుకుంటారట.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: తిరుమల వెంకటేశ్వర స్వామికి శనివారం అంటే ఎందుకు ఇష్టమో తెలుసా..?

 

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×