E-Paper
Advertisement

Viranica Manchu:- విష్ణు మంచు స‌తీమ‌ణి కొత్త వ్యాపారం

Viranica Manchu:- విష్ణు మంచు స‌తీమ‌ణి కొత్త వ్యాపారం
Advertisement

Viranica Manchu new business:- మంచు మోహ‌న్ బాబు ఫ్యామిలీ నుంచి ఇండ‌స్ట్రీకి విష్ణు, మ‌నోజ్‌, ల‌క్ష్మీ ప్ర‌స‌న్న ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఇందులో విష్ణుది సెప‌రేట్ స్టైల్. ఎందుకంటే ఈయ‌న సినిమాల్లో న‌టిస్తూనే ప‌లు వ్యాపారాల‌ను కూడా నిర్వ‌హిస్తుంటారు. అయితే ఇప్పుడు ఆస‌క్తిక‌ర‌మైన మ‌రో విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. విష్ణు మంచు స‌తీమ‌ణి విరానికా సైతం వ్యాపార రంగంలో రాణిస్తున్నారు. ఆమె ప్యాష‌న్ డిజైన‌ర్‌గా రాణిస్తుంది. మైస‌న్ అవా పేరుతో విరానికా కిడ్స్ ప్యాష‌న్ బిజినెస్ మంచి పాపుల‌ర్ అయ్యింది. అలాగే విరానికా కొన్ని బిజినెస్‌లు నిర్వ‌హిస్తున్నారు. ది కేక్ రూమ్ పేరిట ప్రీమియం కేక్స్, డిజర్ట్స్, లగ్జరీ గిఫ్టింగ్స్ విక్రయిస్తున్నారు. మరోవైపు, న్యూయార్క్ అకాడమీ పేరిట హైదరాబాద్‌లో అమెరికన్ ఇంటర్నేషనల్ స్కూల్‌ను ర‌న్ చేస్తున్నారు.

ఇవ‌న్నీ కాకుండా విరానికా ఇప్పుడు కొత్త బిజినెస్‌లోకి అడుగు పెట్టారు. అది కూడా ప్యాష‌న్ డిజైనింగ్‌కి సంబంధించిదే. ఆమె త‌న విరానికా పేరుతోనే బ్రైడల్ కలెక్షన్ స్టార్ట్ చేశారు. అయితే, ఇది మామూలు బ్రైడల్ కలెక్షన్ కాదు. చాలా గ్రాండ్‌గా ఉంది. 2023 సంవత్సరంలోకి కొత్త వ్యాపారంతో అడుగుపెడుతున్నట్టు ఆమె జనవరి 1న ప్రకటించారు. ప్ర‌క‌టించ‌ట‌మే కాదు.. ప్రారంభిస్తున్నట్టు ప్రకటించినప్పుడే విరానికా మంచు స్వయంగా ఒక చీర కట్టుకుని ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలు పెట్టారు.

Advertisement

ఈ చీరను 18 మీటర్ల స్వచ్ఛమైన జరీ బట్టను వాడినట్టు విరానికా తెలిపారు. అంతేకాదు, ఈ చీరను తయారుచేయడానికి 1860 గంటలు పట్టిందని తెలియ‌జేశారు. అలాగే ఇప్పుడు ఇక తన విరానికా బ్రైడల్ కలెక్షన్ నుంచి మరో కొత్త చీరను పరిచయం చేశారు. ఈ చీరను ‘సీతారామం’ ఫేమ్ మృణాలిని ఠాకూర్ దరించారు. దీన్ని త‌యారు చేయ‌టానికి 980 గంట‌లు ప‌ట్టింద‌ని ఆమె తెలిపారు.

Follow this link for more updates:- Bigtv

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×