E-Paper
Advertisement

Nindha Movie: ఓటీటీలోనూ దూసుకుపోతున్న ‘నింద’.. ఒక్క రోజులోనే ఇన్ని వ్యూసా..?

Nindha Movie: ఓటీటీలోనూ దూసుకుపోతున్న ‘నింద’.. ఒక్క రోజులోనే ఇన్ని వ్యూసా..?
Advertisement

Nindha movie got good response on OTT: ఏదైనా సినిమా తీస్తున్నప్పుడు లేదా ఆ సినిమాను విడుదల చేసే ముందు కానీ, ఆ సినిమా ఎలా ఉండబోతుందనేదానిపైన కొంత వివరణ ఇస్తుంటారు చిత్ర బృందం. అయితే, కొన్నిసార్లు వారి చెప్పినట్టుగా ఆ సినిమా అంతగా ప్రేక్షకులకు నచ్చదు. కానీ, పలు సినిమాలు మాత్రం ఆ చిత్రబృందం చెప్పినట్టుగా సూపర్ డూపర్ హిట్టవుతుంటాయి. అటువంటి కోవకు చెందిందే ఇటీవలే విడుదలైన ఓ తెలుగు సినిమా. ఆ సినిమానే ‘నింద’. ఈ సినిమాలో కుర్ర హీరో వరుణ్ సందేశ్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ మూవీ థియేటర్లో విడుదలై యమ సందడి చేసింది. ఏ ప్రేక్షకుడిని తట్టినా చాలా బాగుందంటూ ప్రశంసలు కురిపించారు.

Also Read: ఆయ్.. ఓటీటీలోకి వచ్చేస్తున్నామండీ

Advertisement

అయితే, తాజాగా ఈ సినిమాను ఈటీవీ విన్ ఓటీటీలోనూ విడుదల చేశారు. కేవలం ఒక్కరోజులే 1.4 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ తో దూసుకుపోతున్నది నింద మూవీ. థియేటర్ లో సందడి చేసిన ఈ సినిమాను ఓటీటీలోనూ సందడి చేస్తుండడంతో చిత్ర బృందం సంతోషం వ్యక్తం చేస్తున్నది. ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన రావడంతో నటీనటులు కూడా హ్యాపీగా ఫీలవుతున్నారు. చిత్రం ఈ నెల 6 నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతోంది. కేవలం ఒక్కరోజులోనే 1.4 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ తో నింద చిత్రం టాప్ ఆఫ్ ద ఓటీటీగా మారింది. ఈ క్రమంలో చూస్తుంటే నింద ఓటీటీలో మరింత వేగంగా దూసుకెళ్లే అవకాశం ఉందని చిత్ర బృందం చెబుతున్నది. వాస్తవ సంఘటనల ఆధారంగా ప్రత్యేకమైన కాన్సెప్ట్ తో తీసినటువంటి ఈ చిత్రం వరుణ్ సందేశ్ నటనలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించింది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఉండే ఈ చిత్రం ఓటీటీలో మరింత మంది ప్రశంసలు అందుకుంటుందనే నమ్మకం ఉందని నిర్మాత ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అన్నీ, శ్రేయ, తనికెళ్ల భరణి, భద్రం, సూర్యకుమార్, ఛత్రపతి శేఖర్, మైమ్ మధు, సిద్ధార్థ గొల్లపూడి, అరుణ్ దలై ఇతర ముఖ్యనటీనటులు ఈ సినిమాలో నటించారు. ఈ చిత్రానికి సంగీతం అందించగా కెమెరా, సంతు ఓంకార్ సంగీతం అందించగా, అనిల్ కుమార్ ఎడిటింగ్ చేశారు.

Also Read: గేమ్ ఛేంజర్ అప్డేట్.. ఎర్ర కండువాతో చరణ్ అదిరిపోయాడు

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×