E-Paper
Advertisement

Mahesh Kumar Goud: అందుకోసమే కదా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయట్లే: మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు

Mahesh Kumar Goud: అందుకోసమే కదా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయట్లే: మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు
Advertisement

Mahesh Kumar Goud: కుల‌గ‌ణ‌న స‌ర్వేపై మాజీ మంత్రి కేటీఆర్ కు టీపీసీసీ అధ్యక్షులు మ‌హేష్ కుమార్ గౌడ్ కౌంట‌ర్ ఇచ్చారు. తెలంగాణ‌లో కుల‌గ‌ణ‌న స‌ర్వే ఎలాంటి అవకతవకలు లేకుండా పారద‌ర్శ‌కంగా జ‌రిగిందని అన్నారు.  కేటిఆర్ ఎలాంటి ఆధారాలు లేకుండా తెలంగాణ సర్కార్ చేసిన కులగణన సర్వేపై విమర్శలు చేయడాన్ని మహేష్ కుమార్ గౌడ్ ఖండించారు.

రేవంత్ సర్కార్ రాష్ట్రంలో కులగణన సర్వే ఎలాంటి తప్పులు లేకుండా పారదర్శకంగా చేసిందని అన్నారు. ఎంతో శాస్త్రీయంగా లక్షకు పైన సిబ్బందిని పెట్టి ఇల్లిల్లు పరిశీలన చేసి కులగణన చేశామని చెప్పారు. కులగణన దేశానికే ఆదర్శంగా చేపట్టామని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంటే భరించలేక కేటిఆర్ ఏదేదో నోటి కి వచ్చినట్లు వచ్చిరాని మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ ఆదేశాల అనుసారం మేరకు తెలంగాణలో కుల‌గ‌ణ‌న స‌ర్వేను కాంగ్రెస్ ప్ర‌భుత్వం సంక‌ల్పంతో పూర్తి చేసిందని చెప్పారు. కుల‌గ‌ణ‌న స‌ర్వేపై కేటీఆర్ వ్యాఖ్య‌లను బీసీ స‌మాజం క్ష‌మించ‌దని మండిపడ్డారు. 1931 తర్వాత దేశంలో కులగణన జరిగిందని.. దీని వల్ల బీసీలకు ఎంతో మేలు జరుగుతోందని మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు.

Advertisement

Also Read: Manager Jobs: సువర్ణవకాశం.. డిగ్రీ, బీటెక్ అర్హతలతో ఉద్యోగాలు.. జాబ్ వస్తే లక్షకు పైగా జీతం..

దేశంలో పక్కా పకడ్బందీగా కులగణనను ఫస్ట్ టైం చేసిన ఘటన తమ కాంగ్రెస్ ప్రభుత్వానిది అని ఆయన చెప్పుకొచ్చారు. 2014లో సమగ్ర కుటుంబ సర్వే చేసి కనీసం ఆ లెక్కలను కూడా బయటకు చెప్పలేని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు మాట్లాడడం అవివేకమని అన్నారు. బీసీలకు న్యాయం జరుగుతుంటే కేటీఆర్ భరించలేక పోతున్నారని చెప్పారు. కుల‌గ‌ణ‌న స‌ర్వేలో పాల్గొన‌ని కేటీఆర్, ఆయన కుటుంబ సభ్యులు రీ – స‌ర్వే గురించి మాట్లాడ‌టం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. బ‌ల‌హీన‌వ‌ర్గాల గురించి కేటీఆర్ మాట్లాడ‌టం హ‌స్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు.

Advertisement

Also Read: Manager Jobs: SBIలో మేనేజర్ ఉద్యోగాలు.. నెలకు రూ.1,00,000 జీతం.. జస్ట్ ఈ అర్హతలుంటే చాలు..!

ప‌దేళ్ల బీఆర్ఎస్ పాల‌న‌లో బీసీల‌కు తీర‌ని అన్యాయం జ‌రిగిందని అన్నారు. తెలంగాణలో త్వరలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్‌- బీజేపీ లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నాయని ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో పోటిచేయడానికి బీఆర్ఎస్ పార్టీకి అభ్య‌ర్థులు క‌రువయ్యారని అన్నారు. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో మాదిరిగానే ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ ప‌రోక్షంగా బీజేపీకి మద్ద‌తిస్తుందని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర విమర్శలు చేశారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×