E-Paper
Advertisement

Tirupati district: కొడుకుపై ప్రేమ.. శ్మశానంలో సీసీ కెమెరాలు పెట్టించిన తండ్రి

Tirupati district: కొడుకుపై ప్రేమ.. శ్మశానంలో సీసీ కెమెరాలు పెట్టించిన తండ్రి
Advertisement

Tirupati district: తిరుపతి జిల్లాలో చోటుచేసుకున్న ఒక వినూత్న సంఘటన ప్రస్తుతం సర్వత్రా చర్చనీయాంశమైంది. క్షుద్ర పూజల భయంతో ఒక తండ్రి తన కుమారుడి సమాధి వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం సంచలనం సృష్టించింది.

చంద్రగిరి మండలం కందులవారిపల్లికి చెందిన ఒక దంపతులకు ఎనిమిదేళ్ల కుమారుడు ఉన్నాడు. అనారోగ్య కారణాలతో ఆ బాలుడు వారం రోజుల క్రితం మృతి చెందాడు. ఆ బాలుడు ఆ దంపతులకు మొదటి సంతానం కావడంతో..  మృతదేహాన్ని క్షుద్ర పూజల కోసం దుండగులు వెలికి తీసే అవకాశం ఉందని స్థానికులు బాలుడి తండ్రిని హెచ్చరించారు.

Advertisement

మొదట్లో భయపడిన తండ్రి..  కుమారుడి సమాధిని రక్షించుకోవడానికి ఇద్దరు వ్యక్తులను కాపలాగా పెట్టాడు. అయితే..  దీని కోసం రోజుకు రూ. 1,500 వరకు ఖర్చు అవుతుండటంతో పాటు..  రాత్రి వేళల్లో నిఘా కష్టతరంగా మారింది. దీనికి శాశ్వత పరిష్కారంగా ఆయన ఒక వినూత్న ఆలోచన చేశాడు.

స్మశానవాటికలో బాలుడి సమాధి వద్ద 360 డిగ్రీల కోణంలో పనిచేసే అత్యాధునిక సీసీ కెమెరాలను ఏర్పాటు చేయించాడు. దీని ద్వారా తన మొబైల్ నుంచే ఎప్పటికప్పుడు సమాధి వద్ద పరిస్థితులను గమనిస్తున్నాడు.

Advertisement

నమ్మకాలకు, సాంకేతికతకు మధ్య జరిగిన ఈ పోరాటం ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. మూఢనమ్మకాల పట్ల ప్రజల్లో ఉన్న భయాన్ని ఈ ఘటన ప్రతిబింబిస్తోంది.

ALSO READ: Students Conflict: చిచ్చు పెట్టిన మేకు.. నర్సంపేట గురుకులంలో పొట్టు పొట్టు కొట్టుకున్న స్టూడెంట్స్

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×