E-Paper
Advertisement

Tips for Poor Appetite:ఆకలి బాగా అవ్వాలంటే ఇలా చేయండి

Tips for Poor Appetite:ఆకలి బాగా అవ్వాలంటే ఇలా చేయండి
Advertisement

Tips for Poor Appetite:చాలా మందికి కొన్ని కారణాలతో అప్పుడ‌ప్పుడు అజీర్తి స‌మ‌స్య తలెత్తుతుంది. దీంతో తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణం కాదు. అయితే కొంద‌రికి మాత్రం ఆహారం బాగానే జీర్ణం అవుతుంది. కానీ ఆక‌లి అయితే వేయ‌దు. అయితే ఈ చిట్కాలను పాటిస్తే ఆక‌లి పెరుగుతుంది. అంతేకాకుండా మన జీర్ణక్రియకు కూడా చాలా మేలు జరుగుతుంది.

శ‌రీరంలోని వ్యర్థాలు కూడా బ‌య‌ట‌కు వెళ్తాయి. ఆక‌లి లేని వారు గ్లాస్ నీటిలో కొద్దిగా నిమ్మర‌సం, తేనె, ఉప్పు క‌లిపి తీసుకుంటే వెంటనే ప‌రిష్కారం లభిస్తుంది. ఖ‌ర్జూరాల్లో అనేక పోష‌కాలు ఉంటాయి. ఇవి త‌క్షణ‌మే మనకు శ‌క్తిని అందిస్తాయి. ఆక‌లి లేని వారు నాలుగైదు ఖ‌ర్జూరాల‌ను తింటే ప్రయోజ‌నం ఉంటుంది. నిత్యం ఖర్జూరాలు తిన‌డం వ‌ల్ల ఆక‌లి బాగా అవుతుంది. ప్రతి రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే 2 టీస్పూన్ల అల్లం ర‌సం తాగాలి. లేదా చిన్న అల్లం ముక్కను నేరుగా అలాగే న‌మిలి మింగవ‌చ్చు. దీంతో ఆక‌లి బాగా పెరుగుతుంది.

Advertisement

ఒక స్పూన్ దాల్చిన చెక్క పొడి, 2 స్పూన్ల తేనెల‌ను క‌లిపి ప్రతిరోజు ఉద‌యం, సాయంత్రం భోజ‌నానికి ముందు తీసుకుంటే ఆక‌లి బాగా అవుతుంది. 2 స్పూన్ల మెంతుల‌ను రాత్రంతా నీటిలో నాన‌బెట్టి మ‌రుస‌టి రోజు ఉద‌యాన్నే తినాలి. ఆ తర్వాత ఆ నీటిని తాగేయాలి. ఇలా చేస్తే ఆక‌లి పెరుగుతుంది. మ‌ధ్యాహ్నం, రాత్రి భోజ‌నం చేసిన తర్వాత పెరుగులో మెంతుల పొడిని క‌లుపుకుని తింటే కూడా ఆక‌లి పెరుగుతుంది. ప్రతిరోజు మ‌ధ్యాహ్నం, రాత్రి భోజ‌నం చేశాక ద్రాక్షను తింటే కూడా మంచి ఫలితం ఉంటుంది. ప్రతిరోజు రెండు పూట‌లా జామ పండ్లను తిన‌డం వ‌ల్ల కూడా ఆకలి పెరిగి తిన్న ఆహారం బాగా జీర్ణం అవుతుందని నిపుణులు చెబుతున్నారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×