E-Paper
Advertisement

Cyber Crimes in IT:ఐటీలో సైబర్ నేరాలకు అదే కారణం..!

Cyber Crimes in IT:ఐటీలో సైబర్ నేరాలకు అదే కారణం..!
Advertisement

Cyber Crimes in IT:టెక్నాలజీ అనేది ఎంతో పెరిగింది. దాంతో పాటు దాని వల్ల సమస్యలు కూడా పెరుగుతూ వస్తున్నాయి. టెక్నాలజీ వల్ల జరిగే క్రైమ్‌లను అడ్డుకోవడానికి సైబర్ సెక్యూరిటీ అనేది ఏర్పడింది. కానీ సైబర్ సెక్యూరిటీ కూడా పట్టుకోలేనంత వేగంగా కొందరు సైబర్ నేరగాళ్లు క్రైమ్ చేసి మాయమైపోతున్నారు. దీనికి కారణం మిస్ కమ్యూనికేషన్ అని నిపుణులు బయటపెట్టారు. ముఖ్యంగా ఐటీ రంగంలో జరిగే సైబర్ నేరాలకు ఇదే కారణమని వారు అన్నారు.

భారతదేశంలో ఐటీ సెక్టార్ విషయంలో ఎన్నో అభివృద్ధి చెందిన దేశాలతో పోటీపడుతోంది. కానీ ఐటీ రంగంలోనే దేశవ్యాప్తంగా టాప్ స్థాయిలో ఉన్న దాదాపు 80 శాతం కంపెనీలు సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కుతున్నాయి. ఇలాంటి సంస్థల్లో కనీసం ఒక్క సైబర్ క్రైమ్ అని జరిగినట్టుగా ఆధారాలు ఉన్నాయని రిపోర్టులు చెప్తున్నాయి. అతిపెద్ద సైబర్ సెక్యూరిటీ సంస్థ అయిన క్యాస్పర్‌స్కై ఈ విషయాన్ని స్వయంగా బయటపెట్టింది.

Advertisement

స్వతంత్ర్యంగా ఆఫీసులో నడుచుకుంటున్న విషయంలోగానీ, పనిచేస్తున్న విషయంలోగానీ సంస్థకు, ఉద్యోగులకు మధ్య విబేధాలు వస్తున్నాయని క్యాస్పర్‌స్కై రిపోర్టులో తెలిపింది. ఈ ఉద్యోగుల్లో సైబర్ సెక్యూరిటీ ఉద్యోగులు కూడా ఉంటున్నారని తెలిసింది. కార్పరేట్‌లో బిజినెస్ సెక్యూరిటీ దెబ్బతినడానికి ఉన్నతాధికారులకు, సెక్యూరిటీ మ్యానేజ్‌మెంట్‌ మధ్య తలెత్తుతున్న విబేధాలే కారణమని రిపోర్ట్ చెప్పింది.

డేటా అనేది ఈరోజుల్లో ఎంతో విలువైనది. అందులోనూ ముఖ్యంగా వ్యాపారాల్లో డేటా అంటే ఆ కంపెనీకి సంబంధించిన సమాచారం అంతా ఉంటుంది. అలాంటి సమాచారాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడం కంపెనీల బాధ్యత. అలాంటి సమాచారాన్ని కాపాడడానికి ఉద్యోగులపై కాస్త పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. కానీ ఈ విషయం చాలా కంపెనీలకు అర్థం కావట్లేదని క్యాస్పర్‌స్కై అధినేత అన్నారు. చాలావరకు కంపెనీల్లో సైబర్ సెక్యూరిటీలో ఉద్యోగులు లేకపోవడం, మరికొన్ని కంపెనీల్లో ఉద్యోగులతో విబేధాలు ఉండడం సైబర్ నేరాలకు దారితీస్తుందని ఆయన తెలిపారు.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×