E-Paper
Advertisement

OTT Movie : సైతాన్ ని శిక్షించే బుద్ధుడు… ఈ సైతాన్ మళ్ళీ వస్తే ప్రపంచం అంతమైపోతుందా ?

OTT Movie : సైతాన్ ని శిక్షించే బుద్ధుడు… ఈ సైతాన్ మళ్ళీ వస్తే ప్రపంచం అంతమైపోతుందా ?
Advertisement

OTT Movie : దయ్యాలు, ఆత్మలు ఉన్నాయో లేవో తెలియదు గాని, వీటికి భయపడే మనుషులు మాత్రం ఉన్నారు. దయ్యాలు, ఆత్మలు ఈ రెండు పదాల మధ్య తేడా ఏమిటో తెలియక ఇప్పటికీ సతమతమవుతున్నారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో 2500 సంవత్సరాల క్రితం ఒక సైతాన్ ను బుద్ధుడి శిష్యులు బంధిస్తారు. అది మళ్ళీ రాకుండా, దాని రెండు కళ్ళు పీకి వేరు చేస్తారు. ఈ డిఫరెంట్ స్టోరీతో వచ్చిన ఒక కొరియన్ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఆ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…

నెట్ఫ్లిక్స్ (Netflix) లో

Advertisement

ఈ కొరియన్ హర్రర్ థ్రిల్లర్ మూవీ పేరు (The 8th night). 2021లో విడుదలైన ఈ కొరియన్ హర్రర్ థ్రిల్లర్ మూవీకి కిమ్ టే-హ్యోంగ్ దర్శకత్వం వహించారు. ఇందులో లీ సంగ్-మిన్, పార్క్ హే-జూన్, కిమ్ యో-జంగ్, నామ్ డా-రీమ్ నటించారు. ఈ మూవీ 2500 సంవత్సరాలకు  పూర్వం మానవులను హింసించిన ఒక సైతాన్ ని,  ఆపడానికి  భూతవైద్యుడు చేసే పొరటంతో మూవీ స్టోరీ నడుస్తుంది. ఈ కొరియన్ హర్రర్ థ్రిల్లర్ మూవీ  ఓ టిటి ప్లాట్ ఫామ్ నెట్ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది.

స్టోరీ లోకి వెళితే

Advertisement

కిమ్ పురాతనమైన వస్తువులపై పరిశోధన చేస్తూ ఉంటాడు. అయితే ఇతను 2500 ల సంవత్సరాల క్రితం జరిగిన ఒక సైతాన్ స్టోరీ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఈ పరిశోధనలో భాగంగా ఆ సైతాన్ రెండు కళ్ళు వేరువేరు ప్రాంతాల్లో ఉన్నాయని తెలుసుకొని, వాటిని కనిపెట్టే ప్రయత్నం చేస్తాడు. ఒకవేళ ఆ రెండు కళ్ళు కలిస్తే సైతాన్ మళ్ళీ పుడుతుంది. ఇంతలో ఒక రెడ్ ఐ ఇతనికి దొరుకుతుంది. వాటిలో ఒకదానిని కనిపెట్టానని గవర్నమెంట్ కి కూడా సమాచారం ఇస్తాడు. అదంతా ఫేక్ అని గవర్నమెంట్ కూడా అతని మాటలు పట్టించుకోదు. అయితే అతడు కూడా సైతాన్ కు ఉన్న రెండు కన్నుల్లో రెడ్ ఐ ఫేక్ అనుకుని సూసైడ్ చేసుకోవాలనుకుంటాడు. అప్పటికే ఆ రెడ్ ఐ కిమ్ ను తన వశం చేసుకుంటుంది. నిజానికి ఈ సైతాన్ కళ్ళు కలవకుండా ఉండాలంటే ఒక మంత్రగత్తేని చంపాల్సి ఉంటుంది.

మరోవైపు మిన్ కి ఈ విషయం తెలిసి, చియాగో అనే శిష్యుడు ద్వారా, ఒక మంత్రగత్తేని చంపాలనుకుంటాడు. సైతాన్ ని మళ్ళీ రాకుండా చేయాలంటే ముందు ఒక మంత్రగత్తెను చంపాల్సిఉంటుంది.   చియాగో మంత్రగత్తె ను చంపే ప్రయత్నంలో ఉంటాడు. చివరికి ఆ సైతాన్ రెడ్ ఐ, బ్లాక్ ఐ కలుస్తాయా? సైతాన్ వస్తే ప్రపంచం అంతమైపోతుందా? సైతాన్ని ఎవరు ఎదుర్కొంటారు? ఈ విషయాలను తెలుసుకోవాలనుకుంటే, నెట్ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతున్న The 8th night అనే ఈ మూవీని మిస్ కాకుండా చూడండి. ఒక మంచి మూవీని చూసి ఎంటర్టైన్ అవ్వాలనుకుంటే ఈ హర్రర్ థ్రిల్లర్ మూవీ బెస్ట్ సజెషన్.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×