// // టెర్రకోట కూలింగ్.. 3000 ఏళ్లుగా సక్సెస్.. ఏసీ రేంజ్ చల్లదనం! -->
E-Paper
Advertisement

టెర్రకోట కూలింగ్.. 3000 ఏళ్లుగా సూపర్ సక్సెస్.. ఏసీ లేకున్నా చల్లగా ఉండొచ్చు!

టెర్రకోట కూలింగ్.. 3000 ఏళ్లుగా సూపర్ సక్సెస్.. ఏసీ లేకున్నా చల్లగా ఉండొచ్చు!
Advertisement

Terracotta Cooling: ఒకప్పుడు లగ్జరీగా ఉన్న ఏసీలు ప్రస్తుత రోజుల్లో అత్యవసర వస్తువులుగా మారిపోయింది. ఏసీ లేనిదే ఇంట్లో ఉండలేని స్థితికి చాలా మంది వచ్చేశారు. ముఖ్యంగా వేసివిలో ఏసీ గది నుంచి అడుగుపెట్టలేని స్థితిలో పలువురు ఉంటున్నారు. అయితే ఏసీని కొనే స్థోమతలేని వారు.. ఆ వేడి, ఉక్కపోతను తట్టుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అటువంటి వారికి కోసం మన పూర్వీకులు ఆచరించిన ప్రాచీన పద్దతిని ఈ కథనంలో అందించడం జరుగుతోంది. దీని ద్వారా ఏసీ లేకుండానే ఇంటిని చల్లగా ఉంచుకోవచ్చు. సూర్యుడి వేడిని 50 శాతం మేర తగ్గించుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.

టెర్రకోట కూలింగ్

ఇప్పుడు చెప్పుకోబోయే టెర్రకోట కూలింగ్ (Terracotta Cooling) పద్దతి చాలా ప్రాచీనమైనది. సింధులోయ నాగరికత కాలం నుంచి ఈ పద్దతిని అవలంభిస్తూ వస్తున్నారు. ఇంటి లోపల చల్లగా ఉండేందుకు పైకప్పును మట్టితో చేసిన టెర్రకోట గొట్టాలతో అందంగా నిర్మిస్తారు. ఈ టెర్రకోట గొట్టాలపై నీటిని చల్లడం లేదా వాటిని తడిగా ఉంచడం ద్వారా.. గాలి ఆ గొట్టాల గుండా వెళ్లబడుతుంది. తద్వారా బయటి వేడిగాలి ఇంట్లోకి ప్రవేశించకుండా ఈ టెర్రకోట కూలింగ్ అడ్డుకుంటుంది. ఇంటి మీద పడ్డ సూర్య రశ్మి.. వేడి రూపంలో ఇంట్లోకి ప్రవేశించకుండా 50 శాతం మేర ీ టెర్రకోట కూలింగ్ వ్యవస్థ అడ్డుకుంటున్నట్లు తాజాగా నిర్వహించిన అధ్యయనంలో తేలింది.

విద్యుత్ అవసరం లేదు

Advertisement

టెర్రకోట కూలింగ్ వ్యవస్థ.. ప్రస్తుతం లభిస్తున్న స్మార్ట్ ఏసీల తరహాలోనే కాలాలకు అనుగుణంగా ఇంటిలో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పిస్తాయి. ఎండాకాలంలో ఇంటిని చల్లగా ఉంచితే.. వర్షా కాలంలో కాస్త వెచ్చగా ఉండేందుకు తోడ్పటు అందిస్తాయి. ఇందుకోసం ఏసీలు, కూలర్ల తరహాలో ఎటువంటి మోటార్లు, కరెంటు వీటికి అవసరం లేదు. కేవలం నీరు, గాలి ప్రవాహం ఉంటే సరిపోతుంది.

మరికొన్ని ప్రయోజనాలు

టెర్రకోట కూలింగ్ పద్దతి వల్ల.. సాధారణ ఉష్ణోగ్రతతో పోలిస్తే ఇంటి లోపల దాదాపు 10°C నుండి 15°C వరకు తగ్గే అవకాశం ఉంటుంది. అంటే దాదాపు 50% ఉష్ణోగ్రత ప్రభావం తగ్గనుంది. పర్యావరణపరంగానూ ఇది ఏంతో మేలైనదిగా చెప్పవచ్చు. ఏసీల నుంచి విడుదలయ్యే గ్రీన్ హౌస్ వాయువుల ప్రమాదం.. ఈ టెర్రకోట కూలింగ్ పద్దతిలో ఉండదు. అంతేకాకుండా ఏసీలు, కూలర్ల తరహాలో సర్వీసింగ్ సమస్యలు ఉండవు. ఒకసారి నిర్వహించకుంటే ఏళ్లతరబడి నిరంతరాయంగా ఈ ప్రాచీన పద్దతి పనిచేస్తుంది.

Advertisement

Also Read: షావోమీ కత్తిలాంటి టీవీ.. దీని ఫీచర్లు ఉన్నాయ్ భయ్యా.. చూస్తే ఇప్పుడే కొనేస్తారు!

ఈ రోజుల్లోనూ సాధ్యమే..

టెర్రకోట పెంకులతో ఇంటి పైకప్పును నిర్మించడం ఈ రోజుల్లో సాధ్యమేనా అన్న అనుమానాలు చాలా మందికి కలిగొచ్చు. కానీ ప్రస్తుతం అనేకమంది ఆర్కిటెక్ట్ లు ఈ పద్దతిని తిరిగి వినియోగంలోకి తీసుకొస్తున్నారు. ముఖ్యంగా ‘కూల్ యాంట్’ (CoolAnt) వంటి కంపెనీలు ఈ టెర్రకోట నిర్మాణాలను ఆధునికీకరించి పెద్ద కార్యాలయాల్లో, ఇళ్లలో ఎయిర్ కూలింగ్ సిస్టమ్‌లుగా వాడుతున్నాయి. నానాటికి మారుతున్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో.. మన పూర్వీకులు వాడిన ఇలాంటి సహజసిద్ధమైన కూలింగ్ వ్యవస్థను అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఈ రోజుల్లో ఎంతైనా ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Also Read: Tamil Nadu Elections: బాబు ఏమో అటు.. ఆ పార్టీతో జతకట్టిన రోజా.. జగన్ రూటు ఎటు?

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×