E-Paper
Advertisement

Telangana Students: టెన్త్ మార్కులిస్టులపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. స్పోర్ట్స్ వివరాలు కూడ అందులోనే..!

Telangana Students: టెన్త్ మార్కులిస్టులపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. స్పోర్ట్స్ వివరాలు కూడ అందులోనే..!
Advertisement

టెన్త్ మార్కుల లిస్టులోనే
స్పోర్ట్స్ వివరాలు సైతం
⦿ హెచ్ఎస్‌సీ కాలంలో ఈ విధానం అమలు
⦿ పునరుద్ధరించడంపై ప్రభుత్వం ఆలోచన
⦿ పుల్లెల గోపీచంద్ తండ్రి సర్టిఫికెట్ పరిశీలన
⦿ అప్పటి విధానాన్ని ప్రస్తావించిన మంత్రి శ్రీధర్‌బాబు

తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ :
Telangana Students: హయ్యర్ సెకండరీ స్కూల్ సర్టిఫికెట్ విధానం అమల్లో ఉన్న కాలంలో మార్కుల లిస్టుతో పాటే క్రీడారంగం (ఫిజికల్ ఎడ్యుకేషన్) లోనూ విద్యార్థుల వివరాలు ఉండేవని, మళ్లీ ఈ విధానాన్ని ప్రవేశపెట్టాలని ప్రాథమిక స్థాయిలో ఆలోచిస్తున్నట్లు మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ తండ్రి సుభాష్ చంద్రబోస్ 1964లో హెచ్ఎస్‌సీ పూర్తిచేసినప్పుడు పాఠశాల జారీచేసిన మార్కుల సర్టిఫికెట్‌లో రన్నింగ్ రేస్, హై జంప్, లాంగ్ జంప్, బాల్ త్రోయింగ్ తదితర క్రీడల్లో చూపిన ప్రతిభను కూడా పేర్కొన్నారని మంత్రి గుర్తు చేశారు.

Advertisement

Also Read: Hyderabad News: హైదరాబాద్ లో బుర్జ్ ఖలీఫా.. నగర అందాలు సరికొత్తగా.. సీఎం రేవంత్ సర్కార్ ప్లాన్

ఇలాంటి విధానంతో విద్యార్థుల్లో క్రీడల పట్ల ఆసక్తి పెరుగుతుందని, దాన్ని ఒక విధానంగా ఇకపైన పాటించడంపై ప్రభుత్వంతో చర్చిస్తానని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడా రంగానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నదని, స్పోర్ట్స్ విశ్వవిద్యాలయాన్ని కూడా నెలకొల్పిందని, ఒలింపిక్ క్రీడల్లో తెలంగాణ యువత మెడల్స్ సాధించేలా తీర్చిదిద్దడంపై ఫోకస్ పెట్టిందని గుర్తుచేశారు. హెచ్ఎస్‌సీ కాలంలో మార్కుల లిస్టుతో పాటే క్రీడల్లో, ఎక్స్ ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌లో చూపిన ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలని భావిస్తున్నట్లు తెలిపారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×