E-Paper
Advertisement

Teeth Grinding in Sleep: నిద్రలో మీకు పళ్లు కొరికే అలవాటు ఉందా?

Teeth Grinding in Sleep: నిద్రలో మీకు పళ్లు కొరికే అలవాటు ఉందా?
Advertisement

Teeth Grinding in Sleep: నిద్రించేటప్పుడు కొంద‌రు ప‌ళ్ల‌ను కొరుకుతుంటారు. కొంతమంది దంతాల‌ను కొరికితే పెద్ద‌గా తెలియ‌దు, కానీ కొంద‌రు కొరికితే పెద్ద శబ్ధం బ‌య‌ట‌కు వస్తుంటుంది. అయితే ప‌ళ్ల‌ను కొరుకుతున్న‌ట్లు నిద్రించేవారికి ఏమాత్రం తెలియ‌దు. దీన్ని వైద్య ప‌రిభాష‌లో బ్ర‌క్సిజం అంటారు.

బ్ర‌క్సిజం ఎలా వస్తుందనేదానిపై ఇప్పటి వరకు ఒక స్పష్టత అనేది రాలేదు. కానీ వైద్య నిపుణులు మాత్రం కొన్ని కార‌ణాల‌ను చెబుతున్నారు. ఎక్కువ ఆందోళ‌న‌, ఒత్తిడి, కోపం, నిరాశ, ఉద్రిక్త‌త ఎక్కువ‌గా ఉంటే నిద్ర‌లో ఇలా ప‌ళ్లు కొరుకుతార‌ని చెబుతున్నారు. అయితే ఇలా ఎందుకు చేస్తార‌నే విష‌యంపై ఇంకా స్ప‌ష్ట‌త లేదు. కాకపోతే మానసిక స‌మ‌స్య‌లు ఎక్కువ‌గా ఉన్న‌వారే ఇలా చేస్తార‌ని కూడా నిపుణులు అంటున్నారు. నిద్ర‌లో ప‌ళ్ల‌ను కొరికితే వారికి ఆ విష‌యం తెలియ‌దని కానీ ప‌క్క‌న ఉండే వారికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అయితే పిల్ల‌ల్లో మాత్రం ప‌ళ్ల‌ను కొర‌క‌డం వేరే కార‌ణాల వ‌ల్ల వ‌స్తుంది.

Advertisement

చిన్నారుల్లో పేగుల్లో పురుగులు ఉన్నా, కాల్షియం, మెగ్నీషియం లోపాలు ఉన్నా వారు నిద్ర‌లో ప‌ళ్ల‌ను కొరుకుతారని అంటున్నారు. అందుకే చిన్నారుల‌కు పోష‌కాహారం ఇస్తే ఈ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చని చెబుతున్నారు. పెద్ద‌ల్లో ఈ స‌మ‌స్య త‌గ్గేందుకు ప్ర‌త్యేకమైన మందులు ఏమీ లేవు. ఒత్తిడిని త‌గ్గించుకోవ‌డం చేస్తే చాలా వ‌ర‌కు ఈ స‌మ‌స్య త‌గ్గుతుంది. ఇక మెగ్నీషియం ఎక్కువగా ఉన్న ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల కూడా ఈ స‌మ‌స్యను తగ్గించుకోవచ్చు. రాత్రి పూట పాల‌లో ప‌సుపు క‌లుపుకొని తాగినా, హెర్బ‌ల్ టీల‌ను తాగుతున్నా ఈ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. అంతేకాకుండా వీటితో పాటు ప్రతిరోజు యోగా, ధ్యానం చేసినా పళ్లు కొరికే సమస్య నుంచి బయటపడవచ్చని నిపుణులు అంటున్నారు

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×