E-Paper
Advertisement

Tamarind Benefits : చింత‌పండు వ‌ల్ల జరిగే అద్భుతాలు

Tamarind Benefits : చింత‌పండు వ‌ల్ల జరిగే అద్భుతాలు
Advertisement

Tamarind Benefits : చింతకాయ‌లు.. వీటిని చూస్తేనే నోరూరిపోతుంది. పచ్చివి కూడా లాగించేస్తుంటారు. పులుసు కూర‌లు చేసుకుని తింటూ వాటి రుచిని ఆస్వాదిస్తారు. అంతేకాదు ప‌చ్చి చింత‌కాయ‌ల ప‌చ్చడి రుచి కూడా అద్భుతంగా ఉంటుంది. అయితే చింత పండు లేదా కాయ రెండూ అద్భుత‌ ఔష‌ధ గుణాల‌ను క‌లిగి ఉంటాయి. చింత‌పండు జీర్ణ స‌మ‌స్యల‌ను త‌గ్గిస్తుంది. ముఖ్యంగా మ‌ల‌బ‌ద్దకంతో బాధ‌ప‌డేవారు రాత్రి పూట చింత పండు తింటే మ‌రుస‌టి రోజు ఉద‌యాన్నే సుఖ విరేచ‌నం కలుగుతుంది. అంతేకాకుండా మన జీర్ణాశ‌యంలో ఉండే అల్సర్లు మాయ‌మ‌వుతాయి. వాపులు కూడా త‌గ్గుతాయి. చింత‌పండులో హైడ్రాక్సీ సిట్రిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. ఇది శ‌రీరంలో కొవ్వును నిల్వ ఉండనివ్వదు. అందుకే అధిక బ‌రువు కూడా త‌గ్గుతారు. చింత‌పండులోని విట‌మిన్ సి మన రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది. అలాగే శ‌రీరంలో ఉండే హానికార‌క ఫ్రీ ర్యాడిక‌ల్స్‌ను కూడా నాశ‌నం చేస్తుంది. దీంతో క్యాన్సర్లు మన దరిచేరవు. ఫంగ‌ల్ ఇన్‌ఫెక్షన్‌ ఉన్నవారు బాధ‌ప‌డేవారు చింత‌పండును నిత్యం ఆహారంలో భాగం చేసుకోవాలి. చింత‌పండులోని యాంటీ మైక్రోబియ‌ల్, యాంటీ సెప్టిక్ లక్షణాలు ఫంగ‌ల్‌ ఇన్‌ఫెక్షన్లను నయం చేస్తాయి. పేగుల్లో పురుగులు కూడా నాశ‌న‌ం అవుతాయి. చిన్నారుల్లో ఈ తరహా స‌మ‌స్య ఎక్కువ‌గా క‌నిపిస్తుంది. వారికి చింత‌పండు ఇస్తే చాలా మంచిది. కండ‌రాలు, నాడుల ప‌నితీరు బాగా ఉండాలంటే బి విట‌మిన్ థ‌యామిన్ అవసరం. అది చింతపండులో సంవృద్ధిగా ఉంటుంది.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×