E-Paper
Advertisement

NASA Artemis : భూమిని అద్భుతంగా చిత్రీకరించిన ఆర్టెమిస్ 1. నాసా చేపట్టిన ప్రయోగం సక్సెస్

NASA Artemis : భూమిని అద్భుతంగా చిత్రీకరించిన ఆర్టెమిస్ 1. నాసా చేపట్టిన ప్రయోగం సక్సెస్
Advertisement

NASA Artemis : అమెరికన్ స్పేస్ ఏజెన్సీ-నాసా చేపట్టిన ఆర్టెమిస్ 1 ప్రయోగం విజయవంతమైంది. మూడుసార్లు వాయిదా పడినా… నాలుగోసారి ఎలాంటి అవాంతరాలు లేకుండా నింగిలోకి దూసుకెళ్లింది. ఇది చంద్రుని కక్ష్యలోకి వెళ్లే సమయంలో భూమిని అద్భుతంగా వీడియో తీసి నాసాకు పంపింది. నాసా దీన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
ఫ్లోరిడాలోని కెనెడీ స్పేస్ సెంటర్ నుంచి నాసా ఆర్టెమిస్ 1 ప్రయోగం చేపట్టింది. ఈ ప్రయోగాన్ని వివిధ సోషల్ మీడియా ప్లాట్ ఫాంలపై లైవ్ స్ట్రీమ్ చేసింది. ఇందులో ఒక వీడియోలో భూమి గుండ్రంగా అందంగా ఉన్న ద్రుశ్యం స్పష్టంగా కనిపిస్తోంది.
ఆర్టెమిస్ 1 ను చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశపెట్టడానికి అత్యంత శక్తివంతమైన స్పేస్ లాంచ్ సిస్టం-ఎస్ఎల్ఎస్ రాకెట్ ను నాసా శాస్త్రవేత్తలు ప్రత్యేకంగా రూపొందించారు. దీని ఎత్తు 32 అంతస్తుల బిల్డింగ్ అంత ఉంటుంది. దీనికి ముందు భాగంలో ఓరియన్ క్యాప్సుల్ ని అమర్చారు. ఓరియన్ స్పేస్ షిప్ గంటకు 36 వేల 370 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతోంది. ఇంత స్పీడులోనూ భూమిని అత్యద్భుతంగా చిత్రీకరించింది. వచ్చే సోమవారం నాటికి ఓరియన్ చంద్రుడి ఉపరితలం నుంచి 96.5 కిలోమీటర్ల దూరం దాటిపోతుంది. దాదాపు 25 రోజులపాటు అంతరిక్షంలో గడిపిన తర్వాత డిసెంబర్ 11న పసిఫిక్ మహాసముద్రంలో పడిపోతుంది.
నిజానికి ఆర్టెమిస్ 1 ప్రయోగం తొలుత ఆగస్టు 29న చేపట్టాలని భావించింది నాసా. కానీ అప్పుడు హరీకేన్ ముప్పుతోపాటు ఇంధనం లీకేజీ వల్ల వాయిదా వేసింది. ఆ తర్వాత సెప్టెంబర్ 3న ప్రయోగానికి సిద్ధమైంది. కానీ లిక్విడ్ హైడ్రోజన్ లీక్ కావడంతో ప్రయోగాన్ని వాయిదా వేసింది. ఆ తర్వాత నవంబర్ 14న ప్రయోగం చేపట్టడానికి రెడీ అయింది. కానీ ఇంతలో ఉష్ణమండల తుఫాను నికోల్ ప్రభావంతో ఆ ప్రయోగాన్ని కూడా నిలిపేసింది. ఎట్టకేలకు నాలుగోసారి ప్రయోగం చేపట్టి ఊపిరిపీల్చుకుంది నాసా.
ఓరియన్ స్పేస్ క్యాప్సూల్ ని అంతరిక్షంలోకి పంపడానిిక ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన రాకెట్ ఎస్ఎల్ఎస్ ని తయారు చేసింది. ఈ రాకెట్ ని నాసా 1972లో చంద్రుడిపైకి అపోలో మిషన్ పంపింది. 50 సంవత్సరాల తర్వాత తిరిగి నాసా మూన్ మిషన్ ప్రారంభించింది. ఈ ప్రయోగం ఫలితాలను బట్టి… వచ్చే ఏడాది ఆర్టెమిస్ 2 ప్రయోగం చేపట్టనుంది.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×