E-Paper
Advertisement

Stock Market: మళ్లీ కుప్పకూలిన మార్కెట్లు.. బ్యాంకింగ్‌ ఫియర్.. ఫెడ్ టెన్షన్..

Stock Market: మళ్లీ కుప్పకూలిన మార్కెట్లు.. బ్యాంకింగ్‌ ఫియర్.. ఫెడ్ టెన్షన్..
Advertisement

Stock Market: సోమవారం భారత మార్కెట్లు కుప్పకూలాయి. భారీ పతనాన్ని చవిచూశాయి. నిఫ్టీ ఒకదశలో 250 పాయింట్లు పడిపోయింది. సెన్సెక్స్ 900 పాయింట్లు డౌన్ అయింది. చివర్లో సూచీలు కాస్త కోలుకున్నాయి. నిఫ్టీ 111.65 పాయింట్లు నష్టపోయి 16,988.40 దగ్గర ముగిసింది. సెన్సెక్స్‌ 360.95 పాయింట్ల నష్టంతో 57,628.95 దగ్గర క్లోజ్ అయింది.

అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలు సెంటిమెంటును దెబ్బతీశాయి. బ్యాంకింగ్‌ సంక్షోభ పరిణామాలు మార్కెట్లను వెంటాడాయి. ఎస్‌వీబీ, సిగ్నేచర్‌ బ్యాంక్‌, క్రెడిట్‌ సూయిజ్‌ వంటి బ్యాంకులు దివాళా స్థితికి చేరడం మదుపర్లను కలవరపెట్టింది. ఈ వారం ఫెడ్‌ సమావేశం ఉండటంతో మదుపర్లు ముందుజాగ్రత్తగా షేర్లు అమ్మేసుకున్నారు.

Advertisement

అమెరికా ఫెడరల్‌ రిజర్వు ఈ వారంలో సమావేశం కానుంది. వడ్డీరేట్ల పెంపుపై కీలక నిర్ణయం తీసుకోనుంది. బ్యాంకింగ్‌ రంగ సంక్షోభంతో ఫెడ్‌ రేట్ల పెంపును తాత్కాలికంగా తగ్గించే అవకాశం ఉందని తెలుస్తోంది.

రిలయన్స్‌, విప్రో, హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ, జుబిలంట్‌ ఫుడ్‌ వర్క్స్‌, లారస్‌ ల్యాబ్స్‌, క్రాంప్టన్‌ గ్రీవ్స్‌, ఎంఫసిస్‌, మ్యాక్స్‌ ఫైనాన్షియల్‌, ఇమామి షేర్లు 52 వారాల కనిష్ఠాన్ని తాకాయి.

Advertisement

అదానీ గ్రూపు కంపెనీలు మళ్లీ పతనం అవుతున్నాయి. అదానీ టోటల్‌ గ్యాస్‌, అదానీ పవర్‌.. లోయర్‌ సర్క్యూట్‌ని తాకాయి. అదానీ గ్రీన్‌ ఎనర్జీ మినహా మిగిలిన అదానీ షేర్లన్నీ నష్టాల్లోనే ముగిశాయి.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×