E-Paper
Advertisement

Stock Exchange: గుత్తాధిపత్యం ఆ స్టాక్‌ ఎక్స్ఛేంజిలదే

Stock Exchange: గుత్తాధిపత్యం ఆ స్టాక్‌ ఎక్స్ఛేంజిలదే
Advertisement

Stock Exchange: ప్రపంచంలోని 80 ప్రధాన స్టాక్ ఎక్స్ఛేంజిల విలువ ఎంతో తెలుసా? అక్షరాలా 110.2 ట్రిలియన్ డాలర్లు. ప్రపంచ మార్కెట్ విలువలో దాదాపు సగ భాగం రెండు టాప్ ఎక్స్ఛేంజిలదే. న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజి(NYSE), నాస్‌డాక్ కలిసి 42.4% వాటా ఆక్రమించాయి.

మన దేశంలా మిగిలిన దేశాలు శరవేగంగా ఆర్థిక పురోగతిని సాధిస్తున్నా.. కేపిటల్ మార్కెట్లలో ఇప్పటికీ ఆధిపత్యం అమెరికాదే. 2016 తర్వాత NYSE మార్కెట్ విలువ 35.1% పెరగగా.. నాస్ డాక్ మార్కెట్ కేపిటలైజేషన్ 189.3% కు చేరింది. ఆగస్టు 2023 నాటికి ఆ రెండు స్టాక్ ఎక్స్ఛేంజిల విలువ 25, 21.7 ట్రిలియన్ డాలర్లుగా ఉంది.

Advertisement

యాపిల్ నుంచి ఎన్ విడియా వరకు ప్రపంచ దిగ్గజ టెక్ కంపెనీలు ఆ రెండు ఎక్స్ఛేంజిల్లోనే ట్రేడ్ అవుతుంటాయి. ఇక 7.2 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్‌తో నెదర్లాండ్స్‌కు చెందిన యూరోనెక్ట్స్ ప్రపంచంలో మూడో అతి పెద్ద ఎక్స్ఛేంజిగా అవతరించింది. బ్రెగ్జిట్ తర్వాత ఈ ఎక్స్ఛేంజి బాగా పుంజుకుంది.

దాని దెబ్బకు లండన్ స్టాక్ ఎక్స్ఛేంజి వెనుకబడిపోయింది. గత రెండు దశాబ్దాల్లో లండన్ స్టాక్ మార్కెట్ 13% నుంచి 4 శాతానికి పడిపోయింది. షాంఘై స్టాక్ ఎక్స్ఛేంజి(చైనా) 6.7 ట్రిలియన్ డాలర్లు, జపాన్ ఎక్స్ఛేంజి గ్రూప్(జపాన్) 5.9, షెన్జాన్ స్టాక్ ఎక్స్ఛేంజి(చైనా) 4.5, హాంకాంగ్ ఎక్స్ఛేంజెస్(హాంకాంగ్) 4.2 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ విలువను సాధించాయి.

Advertisement

మన దేశంలోని నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజి(ఎన్‌ఎస్ఈ) ట్రేడింగ్ కార్యకలాపాలు గత ఐదేళ్లలో ముమ్మరమయ్యాయి. దాని మార్కెట్ విలువ 3.5 ట్రిలియన్ డాలర్లుగా ఉంది.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×