E-Paper
Advertisement

Military employees:-సైనికులను వెంటాడుతున్న అనారోగ్య సమస్యలు..

Military employees:-సైనికులను వెంటాడుతున్న అనారోగ్య సమస్యలు..
Advertisement

Military employees:-ఆహార పదార్థాల విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. అనారోగ్య సమస్యల నుండి ఎవరూ తప్పించుకోలేకపోతున్నారు. ఎంత పర్ఫెక్ట్ డైట్ ఫాలో అయినా కూడా అంతుచిక్కని వ్యాధులు ప్రస్తుతం మానవాళిని ఇబ్బందులు పెడుతున్నాయి. సిటీలో ఉంటూ మూడు పూటలా తింటున్నవారి పరిస్థితే ఇలా ఉంటే.. కష్టమైన వాతావరణంలో జీవిస్తూ కడుపు నిండా తినలేని సైనికులు పరిస్థితి ఏంటి..? అందుకే వారి ఆరోగ్య సమస్యలపై శాస్త్రవేత్తలు దృష్టిపెట్టారు.

సరిగా సమయానికి తినకపోయినా.. లేదా సరిపడా తినకపోయినా గ్యాస్ సమస్యలు అనేవి కామన్‌గా కనిపిస్తాయి. దాని వల్ల మరెన్నో ఆరోగ్య సమస్యలు కూడా అటాక్ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకే ప్రస్తుతం డిఫెన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ లేబరేటరీ (డీఎస్టీఎల్) మిలిటరీలో పనిచేసే వారి గ్యాస్ట్రోఇంటెస్టైనియల్ ఇన్ఫెక్షన్స్‌ను తగ్గించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. మామూలుగా స్వచ్ఛమైన తాగునీరు లేని ప్రాంతాలకు వెళ్తూ పనిచేస్తున్నవారిలో ఇలాంటి ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా కనిపిస్తాయని వైద్యులు చెప్తున్నారు.

Advertisement

ఒక దేశంలోనే ఉంటూ పనిచేస్తున్న మిలిటరీ ఉద్యోగుల కంటే వేరే దేశాలకు వెళ్లి పనిచేసే ఉద్యోగుల్లో ఈ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయని పరిశోధకులు గమనించారు. డయేరియా కూడా ఈ ఇన్ఫెక్షన్ లక్షణమే అని వారు చెప్తున్నారు. ఇతర ప్రాంతాలకు వెళుతున్న ఉద్యోగుల మైక్రోబయోమ్‌ను, అదే దేశంలో పనిచేస్తున్న ఉద్యోగుల మైక్రోబయోమ్‌ను శాస్త్రవేత్తలు పోల్చి చూశారు.

ఇతర ప్రాంతాలకు వెళుతున్న ఉద్యోగుల మైక్రోబయోమ్‌‌పై వాతావరణ మార్పులు, జియోగ్రాఫీ, డైట్ వంటి అనేక అంశాల ప్రభావం పడినట్టు వారు గుర్తించారు. దీని వల్లే అనేక ఆరోగ్య సమస్యలు కలుగుతాయని అన్నారు. ప్రస్తుతం వీరి పరిశోధనలో బయటపడిన విషయాలను బట్టి త్వరలోనే మిలిటరీ ఉద్యోగుల ఆరోగ్యం మెరుగుపడేలా చర్యలు తీసుకుంటామని శాస్త్రవేత్తలు హామీ ఇచ్చారు.

Advertisement

 రెయిన్‌బో కలర్స్‌ను ప్రతిబింబిస్తున్న చేప చర్మం..

for more updates follow this link:-bigtv

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×