E-Paper
Advertisement

Smart Auto Driver: ఈ ఆటోడ్రైవర్ చాలా స్మార్ట్ గురూ!… ఎయిర్ పాడ్స్ పోగొట్టుకున్న యువతిని ఎలా కనిపెట్టాడో తెలుసా!

Smart Auto Driver: ఈ ఆటోడ్రైవర్ చాలా స్మార్ట్ గురూ!… ఎయిర్ పాడ్స్ పోగొట్టుకున్న యువతిని ఎలా కనిపెట్టాడో తెలుసా!
Advertisement

Smart Auto Driver : సాధారణంగా ఆటోలో ప్రయాణం చేస్తున్నప్పుడు పొరపాటున ఏవైనా విలువైన వస్తువులను పోగొట్టుకుంటే చాలామంది వాటిపై ఆశలువదులుకుంటారు. కొందరు పోలీసులకు ఫిర్యాదు చేస్తారు. మరికొందరు ఆ ఆటోకోసం వెదికే ప్రయత్నం చేస్తుంటారు. కొందరు ఆటోడ్రైవర్లు ఆ వస్తువులను గుర్తించి ఓనర్ కు అందించడానికి ట్రై చేస్తారు. కుదరని పక్షంలో సమీపంలోని పోలీస్ స్టేషన్లో అప్పగిస్తారు. కానీ బెంగళూరులోని ఓ ఆటోడ్రైవర్ యువతి పోగొట్టుకున్న ఎయిర్ పాడ్స్ ని తిరిగి ఇవ్వడానికి ఏం చేశాడో తెలిస్తే శభాష్ అని మెచ్చుకోకుండా ఉండలేరు. ఆ యువతిని కనిపెట్టిమరీ అరగంటలోనే ఆమె పనిచేస్తున్న కంపెనీకి వెళ్లి ఎయిర్ పాడ్స్ ని అప్పగించాడు.
ఇంతకీ ఇదంతా అతడికి ఎలా సాధ్యమైందంటే… టెక్నాలజీ వల్లనే. అసలు విషయం ఏంటంటే… బెంగళూరులో ఓ యువతి
ఆటో ఎక్కింది. కానీ దిగేటప్పుడు ఆటోలో తన ఖరీదైన ఎయిర్ పాడ్ లను (వీటి విలువ రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు ఉంటుంది) మరిచిపోయింది. ఆ తర్వాత కొంతసేపటికి ఆటోడ్రైవర్ వీటిని గుర్తించాడు. అవి ఎవరివో తెలుసుకునే ప్రయత్నం చేశాడు. అందుకోసం అతడు ఎయిర్ పాడ్ లను కనెక్ట్ చేసి ఆమె పేరును కనుకున్నాడు. తనకు పేమెంట్ చేసిన ఫోన్ పే ద్వారా నంబరు తెలుసుకుని ఆమెకు విషయం చెప్పాడు. ఆ తర్వాత ఆమెను డ్రాప్ చేసిన ప్లేస్ కొచ్చి అక్కడున్న కంపెనీ సెక్యూరిటీకి వాటిని అందజేశాడు. దీంతో ఎయిర్ పాడ్స్ పోగొట్టుకుని టెన్షన్ పడుతున్న యువతి… ఆటో డ్రైవర్ తిరిగివ్వడంతో ఊపిరి పీల్చుకుంది. ఆటో డ్రైవర్ మంచితనం అందరికీ తెలిసేలా ఈ విషయాన్ని ఆమె ట్వీట్ చేసింది. దీంతో ఈ పోస్ట్ కి లైకులు, కామెంట్లు వెల్లువెత్తాయి. జయహో ఆటో డ్రైవర్ అంటూ చాలా మంది నెటిజన్లు అతడి నిజాయితీని, అతడు టెక్నాలజీని వాడుతున్న తీరుని చూసి మెచ్చుకున్నారు. మరికొందరైతే టెకీ ఆటో డ్రైవర్ అంటూ పొగడ్తలతో ముంచెత్తారు.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×