E-Paper
Advertisement

Small Cap Mutual Funds : ఈ స్మాల్ క్యాప్ ఫండ్స్ అద్భుత: … రిస్క్‌తో పాటు మంచి రివార్డ్ కూడా

Small Cap Mutual Funds : ఈ స్మాల్ క్యాప్ ఫండ్స్ అద్భుత: … రిస్క్‌తో పాటు మంచి రివార్డ్ కూడా
Advertisement
Small Cap Mutual Funds

Small Cap Mutual Funds : స్టాక్ మార్కెట్లో సేఫ్ గేమే మంచింది. అలా ఉంటేనే పెట్టుబడికి భద్రత, ఆదాయం. కాని, సేఫ్ గేమ్ ఆడుతున్నంత వరకు వచ్చే రాబడి కూడా అంతంతగానే ఉంటుంది. కాని, రిస్క్ తీసుకుంటే మాత్రం వేరేలా ఉంటుంది. అలా ఇన్వెస్ట్ చేయాలనుకునే వారికి స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ పర్ఫెక్ట్. వీటిలో రివార్డు ఎక్కువగానే ఉంటుంది.. అలాగే రిస్క్ కూడా అంతే లెవెల్లో ఉంటుంది.

రిస్కుల గురించి తరువాత మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ ఇస్తున్న రాబడి చూద్దాం.
నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్.. ఇది 26 శాతం రిటర్న్స్ ఇచ్చింది. ఎస్బీఐ స్మాల్ క్యాప్ ఫండ్.. ఇది 25 శాతం రిటర్న్స్ ఇచ్చింది. ఇక డీఎస్పీ స్మాల్ క్యాప్ ఫండ్ 22 శాతం, కొటక్ స్మాల్ క్యాప్ ఫండ్ 20 శాతం, ఫ్రాంక్లిన్ ఇండియా స్మాలర్ కంపెనీస్ ఫండ్ 20 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ 250 టోటల్ రిటర్న్ ఇండెక్స్ 16 శాతం రిటర్న్స్ ఇచ్చాయి.

Advertisement

ఇప్పుడు రిస్కుల గురించి మాట్లాడుకుందాం. స్మాల్ క్యాప్ అంటే.. ఒక్కోసారి షేర్ ధర రూపాయి రెండు రూపాయలు కూడా ఉంటుంది. ఎప్పుడు అప్‌ట్రెండ్‌లో ఉంటుందో, ఎప్పుడు పడిపోతుందో చెప్పలేం. ఒక్కోసారి అసలు ఆ కంపెనీ ఉంటుందో లేదో కూడా డౌటే. అంత పెద్ద రిస్క్ ఉంటుంది.

అందుకే, స్మాల్‌ క్యాప్‌ మ్యూచువల్ ఫండ్లలో ఇన్వెస్ట్ చేసే వాళ్లు జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి. అమ్మో.. ఇంత రిస్క్ భరించలేం అనుకున్న వాళ్లు దూరంగా ఉండడమే బెటర్. కానీ, రిస్క్ తీసుకోడానికి రెడీ అంటే మాత్రం.. ఇదిగో ఇలాగే 26 శాతం రాబడి చూడొచ్చు. పైగా ఇవన్నీ సగటు రాబడి మాత్రమే. ఒక్కోసారి వీటిలో లాభాలు 40 శాతం, 50 శాతం వరకు ఉండొచ్చు. పైగా వీటిలో లాకిన్ పిరియడ్ ఏడేళ్ల నుంచి పదేళ్ల వరకు ఉంటుంది. మంచి లాంగ్ టర్మ్ కోసం, రిస్క్ అయినా ఫర్వాలేదు అనుకునే వారికి ఇవి బెస్ట్ ఆప్షన్.

Advertisement

ఇప్పుడు చెప్పిన మ్యూచువల్ ఫండ్స్ కూడా నష్టాలు ఇవ్వవు అని చెప్పలేం. ఏమో.. టైం బ్యాడ్ అయితే చెప్పలేం కూడా. అందుకే, మ్యూచువల్ ఫండ్స్ ట్రాక్ రికార్డ్ కూడా పరిశీలించుకోవాలి. అన్నీ తెలుసుకున్నాకే ముందడుగు వేయాలి. 

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×