E-Paper
Advertisement

Shivani Nagaram: అలాంటివాడే భర్తగా రావాలి.. వామ్మో కోరికలు చాలా గట్టిగానే ఉన్నాయే!

Shivani Nagaram: అలాంటివాడే భర్తగా రావాలి.. వామ్మో కోరికలు చాలా గట్టిగానే ఉన్నాయే!
Advertisement

Shivani Nagaram:ప్రముఖ హీరోయిన్ శివాని నాగారం(Shivani Nagaram ).. తెలుగమ్మాయిగా లిటిల్ హార్ట్స్ సినిమాతో భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. యూత్ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాలో ఫేమస్ యూట్యూబర్ మౌళి, హీరోయిన్ శివాని ప్రధాన పాత్రలు పోషించారు. అందం, అమాయకత్వంతో, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇకపోతే అంబాజీపేట మ్యారేజి బ్యాండ్ అనే సినిమాతో తొలిసారి ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె.. ఈ సినిమాతోనే ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. కానీ లిటిల్ హార్ట్స్ సినిమాలో కాత్యాయినిగా మరింత పాపులారిటీ దక్కించుకుంది. ఈ సినిమాతోనే కాత్యాయినిగా వెలుగులోకి వచ్చిన ఈమె గురించి అభిమానులు కూడా తెలుసుకోవాలని తెగ ప్రయత్నాలు చేశారు.

అలాంటి వాడే భర్తగా రావాలి – శివాని

అలాంటి ఈమె తాజాగా మళ్లీ సుహాస్ తో కలిసి హే భగవాన్ అనే సినిమాలో నటిస్తోంది. 20 ఫిబ్రవరి 2026న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో తాజాగా ఈ సినిమా టీజర్ ను విడుదల చేశారు. బుధవారం రోజు టీజర్ విడుదల చేయగా.. ఈ టీజర్ లాంచ్ ఈవెంట్లో తనకు కాబోయే భర్త ఎలా ఉండాలి? అతడికి ఎలాంటి క్వాలిటిస్ ఉండాలి అనే విషయాలను చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది కాత్యాయిని అలియాస్ శివాని నాగారం. టీజర్ లాంచ్ సందర్భంగా శివాని నాగారంకి పెళ్లికి సంబంధించిన ప్రశ్న ఎదురయింది. దీనికి ఆమె మాట్లాడుతూ..” అబ్బాయి ఫ్యామిలీ బిజినెస్ ఏదైనా పర్వాలేదు. కానీ అతడికి మాత్రం కచ్చితంగా వంట చేయడం వచ్చి ఉండాలి” అంటూ సరదాగా సమాధానం చెప్పింది.

Advertisement

also read:Varanasi: వారణాసి రిలీజ్ డేట్ ఫిక్స్.. భారీ హోర్డింగ్స్ వెనుక జక్కన్న హస్తం ఉందా?

ఆమెకు తిండి మీదే ధ్యాస ఎక్కువ..

ఇకపోతే ఇదే ఈవెంట్ లో ఎడిటర్ సాయి మార్తాండ..” శివానికి నటన కంటే తిండి మీదే ధ్యాస ఎక్కువ అని , ఎక్కడికి వెళ్ళినా తిండి గురించే మాట్లాడుతుందని.. ముఖ్యంగా సినిమా గురించి మాట్లాడమంటే దర్శకుడితో తిండి గురించి మాట్లాడుతూ..ఎక్కడ మంచి ఫుడ్ దొరుకుతుందో కూడా చెబుతుందని.. ఆమెకు తిండి అంటే చాలా అమితమైన ఇష్టం” అంటూ చెప్పి అందరిని నవ్వించారు. ఇక ఆయన చేసిన కామెంట్లకు శివానీ కూడా నవ్వుకుంది.

శివాని కెరియర్..

Advertisement

శివాని విషయానికి వస్తే మల్టీ టాలెంటెడ్ పర్సన్ గా గుర్తింపు తెచ్చుకుంది. డాన్సర్ గా కెరియర్ ను ఆరంభించి ఆ తర్వాత సోషల్ మీడియా ఇన్ఫ్లు యెన్సర్ గా పేరు దక్కించుకుంది. యూట్యూబ్ , వెబ్ సిరీస్ లు ఆ తర్వాత హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. హైదరాబాదులోనే పుట్టి పెరిగిన ఈమె.. చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే అమితమైన ఇష్టం.. కూచిపూడి తో పాటు సంగీతంలో కూడా ప్రావీణ్యం పొంది ఖాళీ టైంలో పిల్లలకు మ్యూజిక్, డాన్స్ నేర్పిస్తూ ఉంటుంది.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×