E-Paper
Advertisement

Bear Face on Mars:మార్స్‌పై ఎలుగుబంటి ఆకారం..! కెమెరాలో రికార్డ్..

Bear Face on Mars:మార్స్‌పై ఎలుగుబంటి ఆకారం..! కెమెరాలో రికార్డ్..
Advertisement

Bear Face on Mars:ప్రస్తుతం మానవాళి అనేది కేవలం భూగ్రహంలో మాత్రమే జీవిస్తోంది. భూమి కాకుండా మరో గ్రహం ఏదైనా మానవాళి జీవనానికి అనుగుణంగా ఉంటుందా అన్న అంశంపై శాస్త్రవేత్తలు ఎప్పటినుండో పరిశోధనలు చేస్తున్నారు. వారి మొదటి టార్గెట్ మార్స్. మార్స్‌పై నీరు నిలిచే అవకాశం ఉంటే అక్కడ కూడా మానవాళి జీవించవచ్చని శాస్త్రవేత్తలు ఎప్పుడో నిర్ధారించారు. తాజాగా మార్స్‌పై పరిశోధనలు చేస్తున్న సమయంలో శాస్త్రవేత్తలకు ఓ వింత కనిపించింది.

ఒక ఎలుగుబంటి లాంటి ఆకారం మార్స్‌పై ఉండడాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. యూనివర్సిటీ ఆఫ్ అరిజోనా (యూఏ) చేస్తున్న పరిశోధనల్లో ఈ విషయం బయటపడింది. ఎలుగుబంటి లాంటి ఆకారం, రెండు పెద్ద కళ్లు, ఓ చిన్న ముక్కు, నవ్వుతున్నట్టుగా పెదవులతో వారికి ఓ ఇమేజ్ కనిపించింది. ఇది దాదాపు టెడ్డీ బేర్ లాగా ఉందని శాస్త్రవేత్తలు అన్నారు. ఒక శాటిలైట్.. మార్స్‌కు 251 కిలోమీటర్ల దూరంలో తిరుగుతుండగా అందులో ఈ ఇమేజ్ కనిపించింది వారు తెలిపారు.

Advertisement

హైరైజ్ ద్వారా పరిశీలించి చూస్తే ఇది ఏదైనా రాయి కావచ్చని శాస్త్రవేత్తలు అనుమానిస్తున్నారు. ఈ రాయి వి షేప్‌లో ఉందని వారు తెలిపారు. చాలాకాలంగా అది మార్స్‌పైనే ఉండిపోవడం వల్ల అది ఒక ఎలుగుబంటి ఆకారంలో కనిపిస్తుందేమోనని వారి అంచనా. చిన్న చిన్న రాళ్లన్నీ కలిసి ఒక ఎలుగుబంటి మోహంలాగా కనిపిస్తుందేమోనని శాస్త్రవేత్తలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

హైరైజ్ అనే హై క్వాలిటీ ఇమేజింగ్ కెమెరా ద్వారా 2006 నుండి మార్స్ ఫోటోలు శాస్త్రవేత్తలకు అందుతున్నాయి. ఇంత పవర్‌ఫుల్ కెమెరా ఇప్పటివరకు ఇతర గ్రహాలకు పంపలేదని శాస్త్రవేత్తలు తెలిపారు. అందుకే మార్స్‌లో కనిపిస్తున్న ఎలుగుబంటి ఆకారాన్ని మరింత క్షుణ్ణంగా ఫోటోలు తీయడానికి హైరైజ్ ప్రయత్నిస్తోంది. ఇది మాత్రం కచ్చితంగా ఒక రాయి ముక్కే అని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×