E-Paper
Advertisement

Hair Loss : జుట్టు రాలే సమస్యకు కారణం కనిపెట్టిన శాస్త్రవేత్తలు..

Hair Loss : జుట్టు రాలే సమస్యకు కారణం కనిపెట్టిన శాస్త్రవేత్తలు..
Advertisement
Hair Loss

Hair Loss : ఒకప్పుడు వయసు ఎంత పెరిగినా కూడా జుట్టు రాలడం అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉండేది. కానీ ఈరోజుల్లో చిన్న వయసు నుండే జుట్టు రాలడం మొదలవుతుంది. జుట్టు రాలకుండా ఉండడం కోసం, ధృడంగా ఉండడం కోసం ఎన్నో చికిత్సలు, మందులు అందుబాటులో ఉన్నాయి కానీ అవేవి పూర్తిస్థాయిలో జుట్టు రాలే సమస్యను తగ్గించలేకపోతున్నాయి. తాజాగా దీనికి కారణమేంటో కనిపెట్టారు శాస్త్రవేత్తలు.

Advertisement

మనిషి శరీరంలో ఉండే కొత్త రకమైన ఇమ్యూన్ టీ సెల్సే అలోప్సియా అరెటా.. అంటే సింపుల్‌గా చెప్పాలంటే జుట్టు రాలడానికి కారణమవుతుందని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. ముందుగా కొరియా అడ్వాన్స్‌డ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (కైస్ట్) ఈ విషయాన్ని గుర్తించారు. అలోప్సియా అరెటా అనేది జుట్టకు సంబంధించిన ఒక వ్యాధి లాంటిది. ఇది జుట్టు కుదుళ్లను బలహీనపరిచి జుట్టును ఎక్కువగా రాలిపోయేలా చేస్తుందని వారు తెలిపారు. ఇది ఆటోఇమ్యూన్ శక్తి తగ్గిపోవడం వల్ల కూడా జరుగుతుందని అన్నారు.

అలోప్సియా అరెటా వల్ల తలపైనే కాకుండా శరీరంపై ఏ భాగం అయినా జట్టు ఎక్కువగా ఊడిపోయి.. ప్యాచ్‌లు కలిగేలా చేసి షేప్‌ను పూర్తిగా మార్చేస్తుందని తెలిపారు. దీనివల్ల మనిషి మానసిక స్థితిపై కూడా ప్రభావం పడుతుందన్నారు. ఇది ఇమ్యూన్ సెల్స్‌లోని సమస్య వల్ల కలుగుతుంది అని తెలిసినా.. అసలు ఎలాంటి సెల్స్ వల్ల సంభవిస్తుందో శాస్త్రవేత్తలు కూడా ఇప్పటివరకు తెలుసుకోలేకపోయారు. తాజాగా అలోప్సియా అరెటా ఉన్న ఎలుకపై ప్రయోగాలు చేయడం ద్వారా ఈ ఇమ్యూన్ సెల్స్ గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేశారు.

Advertisement

వర్చువల్ మెమోరీ టీ సెల్స్ ఫ్యామిలీకి చెందిన ఇమ్యూన్ సెల్స్ ద్వారానే అలోప్సియా అరెటా అనేది సంభవిస్తుందని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. వర్చువల్ మెమోరీ టీ సెల్స్ అనేవి శరీరంలోకి వైరల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంచుతాయి. ఇందులో స్కిన్ యాక్టివేట్‌కు సంబంధించిన వర్చువల్ సెల్స్ ప్రత్యేకంగా ఉంటాయి. ఇలాంటి సెల్స్ కారణంగానే జుట్టు రాలిపోవడం జరుగుతుందని వారు గుర్తించారు. సైటోకిన్స్ అనే ఈ సెల్స్‌ను నివారించడం వల్ల అలోప్సియా అరెటాను కంట్రోల్ చేసే అవకాశాలు ఉంటాయని వారు కనుగొన్నారు. ఇక ఈ కోణంలో అలోప్సియా అరెటాతో పాటు జుట్టు రాలే సమస్యకు చికిత్సను కనిపెట్టాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×