E-Paper
Advertisement

Green Hydrogen: గ్రీన్ హైడ్రోజన్ తయారీ.. ఎన్నో అడ్డంకుల మధ్య..

Green Hydrogen: గ్రీన్ హైడ్రోజన్ తయారీ.. ఎన్నో అడ్డంకుల మధ్య..
Advertisement

Green Hydrogen:వాతావరణంపై ఏ మాత్రం చెడు ప్రభావం చూపించకుండా పరిశోధనలు చేయాలని శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఓ పరిశోధన ప్రారంభించనున్నారు. వాతావరణానికి అనుకూలంగా ఉండే విధానాల ద్వారా గ్రీన్ హైడ్రోజన్‌ను తయారు చేయాలని శాస్త్రవేత్తలు నిర్ణయించుకున్నారు.

వాటర్ ఎలక్ట్రోలైటిస్ ద్వారా గ్రీన్ హైడ్రోజన్ అనేది తయారు చేయవచ్చు. సోలార్ ప్యానెల్స్ వంటి వాటి ద్వారా ఎలక్ట్రో కెమికల్ సెల్‌లో నీటిని అనేక భాగాలుగా చేసే ప్రక్రియలోనే హైడ్రోజన్, ఆక్సిజన్ ఒకేసారి ఏర్పడతాయి. అయితే ఈ ప్రక్రియలో క్యాటలిస్ట్‌లను కూడా ఉపయోగించవల్సి ఉంటుంది. దీని కారణంగా గ్రీన్ హైడ్రోజన్ తయారు చేయడానికి ఖర్చు చాలా ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల గ్రీన్ హైడ్రోజన్ అందరికీ అందుబాటులో ఉండడం కష్టంగా మారుతుంది.

Advertisement

నైకెల్ ఐరన్ (నైఫే) క్యాటలిస్ట్‌ను కూడా ఈ ప్రక్రియ కోసం ఉపయోగించవచ్చు. కానీ ప్రక్రియ దాదాపుగా పూర్తయ్యి నీటిని విభజింగే సమయంలో ఆక్సిజన్ విడుదలవుతున్నప్పుడు ఇది డియాక్టివేట్ అయ్యే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇలా జరగకుండా ఉండడం కోసం పలువురు పరిశోధకులు కలిసి నైఫే క్యాటలిస్ట్‌లకు ఓ రక్షణ కవచాన్ని తయారు చేశారు. దీని ద్వారా నైఫే పర్ఫార్మెన్స్ మెరుగుపడుతుందని వారు భావిస్తున్నారు.

గ్రీన్ హైడ్రోజన్ తయారీ సమయంలో వాటర్ విడివిడిగా అయిపోయే ముందుగా నైఫేలోని ఫే క్యాటలిస్ట్‌ను తొలగిస్తే ప్రక్రియ విజయవంతంగా పూర్తవుతుంది. అలా అవ్వడం కోసం టెట్రాఫెనిల్‌పార్ఫిరిన్ (టిపిపి) అనే ప్రొటెక్షన్ లేయర్ ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు భావించి దానిని తయారు చేశారు. ఈ టిపిపి లేయర్ ఆక్సిజన్ బయటికి వస్తున్న సమయంలో ఫే క్యాటలిస్ట్‌ను వేరు చేసి ప్రక్రియ పూర్తయ్యేలా చేస్తుంది. ఇలా తయారు చేయబడిన గ్రీన్ హైడ్రోజన్ కూడా చాలాకాలం వరకు పనిచేస్తుందని వారు గుర్తించారు.

Advertisement

నీటిని అనేక భాగాలుగా విభజించడం ద్వారా కార్భన్ న్యూట్రల్ సాధ్యపడుతుందని పరిశోధకులు చెప్తున్నారు. ఎందుకంటే హైడ్రోజన్‌ను ఏర్పాటు చేసే సమయంలో కార్బన్ డయాక్సైడ్‌కు బదులుగా ఆక్సిజన్ వస్తుంది. కానీ ఎంతైనా వాటర్ ఎలక్ట్రోలైటిస్ ద్వారా హైడ్రోజన్ తయారు చేయడం ఇప్పటికీ ఖర్చుతో కూడుకున్న పని కావడంతోనే నైఫే క్యాటలిస్ట్‌తోనే హైడ్రోజన్ తయారీని సులువు చేయాలని శాస్త్రవేత్తలు పరిశోధనలు మొదలుపెట్టారు.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×