E-Paper
Advertisement

Science Diplomacy:దేశాల మధ్య శత్రుత్వాన్ని పెంచుతున్న సైన్స్..

Science Diplomacy:దేశాల మధ్య శత్రుత్వాన్ని పెంచుతున్న సైన్స్..
Advertisement

Science Diplomacy:గత కొన్ని దశాబ్దాలుగా సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్నో ఊహించని మార్పులు వచ్చాయి. విదేశీ వ్యవహారాలు, నిర్ణయాలు తీసుకునే విషయంలో సైన్స్ అండ్ టెక్నాలజీ ధృడత్వాన్ని సాధించింది. ప్రపంచవ్యాప్తంగా ఎదురవుతున్న సమస్యలను దృష్టిలో పెట్టుకొని, శాస్త్రవేత్తలు, పరిశోధకులు అందరూ కలిసి పనిచేయాలన్న విషయం అర్థమైంది. ఈ విధంగా సైన్స్ విభాగంలో దౌత్య సంబంధాలు ఏర్పడ్డాయి.

గత కొన్నేళ్లలో సైన్స్ విభాగంలో డిప్లొమసీ పెరిగింది. ఒకదాని తర్వాత ఒకటి దేశాలు పలు సమస్యల్లో చిక్కుకున్నప్పుడు శాస్త్రవేత్తలు దేశంతో సంబంధం లేకుండా వారికి సాయంగా నిలబడ్డారు. దీని ద్వారా సైన్స్ విషయంలో దేశాల మధ్య దూరం కూడా తగ్గిపోయింది. సైన్స్ డిప్లొమసి ముఖ్యంగా రెండు విషయాలను సూచిస్తుంది. అవే సమస్యలు వచ్చినప్పుడు ప్రపంచ దేశాల మధ్య నెట్‌వర్క్‌ను పెంపొందించడం, ఫారిన్ పాలిసీని బలంగా మార్చుకోవడం.

Advertisement

సైన్స్ డిప్లొమసి ఈ రెండు విషయాలపై ప్రత్యేక దృష్టి పెడుతుంది. కానీ సైన్స్ ద్వారా ముందుగా దేశ అభివృద్ధిని సాధించాలా లేదా ప్రజలకు సాయంగా నిలబడాలా అన్న విషయంపై ప్రభుత్వాలు ఇంకా సతమతమవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా సైన్స్‌లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు వెళ్లడంతో పాటు ప్రజలకు సైన్స్ అండగా కూడా నిలబడేలా చేయాలని శాస్త్రవేత్తలు నిర్ణయించుకున్నారు. కానీ మరోవైపు సైన్స్ విషయంలో అండగా నిలబడుతున్న దేశాల మధ్య పోటీ కూడా ఏర్పడుతోంది.

కేవలం స్వదేశంలోనే కాదు విదేశాలలో కూడా మనుషులు ఎదుర్కుంటున్న సమస్యలను పరిష్కరించడానికి సైన్స్ అండ్ టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తుంది. ముందుగా శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలు పాలిసీ మేకర్స్ దృష్టికి వెళ్లాలి. అవి పాలిసీకి లోబడి ఉన్నాయా లేదా అన్న పరీక్షలు జరిపిన తర్వాతే మార్కెట్‌లోకి వెళ్తాయి. ఇప్పటివరకు సైన్స్ డిప్లొమసి అన్నది పాలిసీ మేకింగ్‌లో ఒకటిగా చేరలేదు. కేవలం దేశాల మధ్య సహకారం అందించడం కోసం ఇది పనిచేస్తోంది.

Advertisement

సైన్స్ డిప్లోమసి ద్వారా ప్రపంచ దేశాల సమస్యల సులువుగా పరిష్కారమవుతున్న కూడా సైన్స్ విభాగంలో దేశాల మధ్య పోటీ మాత్రం అలాగే ఉండిపోతుంది. సైన్స్ విషయంలో ఎవరికి వారు తామే నెంబర్ 1 ప్లేస్‌లో ఉండాలనే దిశగా దేశ శాస్త్రవేత్తలు అడుగులు వేస్తున్నారు. ఈ ఒక్క విషయాన్ని సైన్స్ డిప్లోమసి ఏ మాత్రం మార్చలేకపోతోంది. మానవాళి మంచి కోసం సైన్స్ పనిచేసినా.. పరిశోధనల పరంగా ఎవరు ముందు విజయం సాధిస్తారు అన్నదే శాస్త్రవేత్తలు లక్ష్యంగా పెట్టుకుంటున్నారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×