E-Paper
Advertisement

SBI : కార్పొరేట్ దిగ్గజాలను మించి రాణించిన SBI

SBI : కార్పొరేట్ దిగ్గజాలను మించి రాణించిన SBI
Advertisement

SBI : ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంక్‌ SBI.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెకండ్ క్వార్టర్లో సరికొత్త రికార్డును సృష్టించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్‌ క్వార్టర్లో రూ. 14,572 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఇది బ్యాంక్‌ చరిత్రలోనే అత్యధికం కాగా… సెకండ్ క్వార్టర్లో దేశీ కార్పొరేట్‌ చరిత్రలోనే అత్యధిక లాభంగా రికార్డు సృష్టించింది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ సాధించిన రూ. 13,656 కోట్ల లాభాన్ని, HDFC ఆర్జించిన రూ.11,125 కోట్ల రాబడిని అధిగమించి… SBI సరికొత్త రికార్డు నెలకొల్పింది.

నిరుడు ఇదే క్వార్టర్లో ఆర్జించిన రూ. 8,890 కోట్లతో పోలిస్తే… SBI లాభం ఏకంగా 74 శాతం పెరిగి రూ.13,265 కోట్లకు చేరింది. రుణాల మంజూరు, వడ్డీ ఆదాయంలో వృద్ధితో పాటు ప్రొవిజన్లు తగ్గడం బ్యాంక్ కు కలిసొచ్చింది. సెకండ్ క్వార్టర్లో బ్యాంక్‌ మొత్తం ఆదాయం రూ.1,01,143 కోట్ల నుంచి రూ.1,14,782 కోట్లకు ఎగసింది. నికర వడ్డీ ఆదాయం 13 శాతం పెరిగి రూ. 35,183 కోట్లకు చేరింది. దేశీ నికర వడ్డీ మార్జిన్లు స్వల్పంగా బలపడి 3.55 శాతానికి చేరాయి. స్థూల మొండిబకాయిలు… అంటే NPAలు 4.9 శాతం నుంచి 3.52 శాతానికి, నికర NPAలు 1.52 శాతం నుంచి 0.80 శాతానికి దిగి రావడం… మొండి రుణాలకు ప్రొవిజన్లు రూ.2,699 కోట్ల నుంచి తగ్గి రూ. 2,011 కోట్లకు పరిమితమవడం SBIకి బాగా కలిసొచ్చింది. అందుకే బ్యాంక్ చరిత్రలోనే ఒక క్వార్టర్లో రికార్డు స్థాయి లాభాలను ఆర్జించి… ప్రైవేట్ దిగ్గజ కంపెనీలకు కూడా షాకిచ్చింది… SBI.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×