// // Samantha becomes emotional over Priyanka Chopra motherhood comments -->
E-Paper
Advertisement

Samantha: కూతురు వల్ల ఎదురైన మానసిక ఒత్తిడి చెప్పిన ప్రియాంక చోప్రా.. ఎమోషనల్ అయిన సమంత..!

Samantha: కూతురు వల్ల ఎదురైన మానసిక ఒత్తిడి చెప్పిన ప్రియాంక చోప్రా.. ఎమోషనల్ అయిన సమంత..!
Advertisement

Samantha: హాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా తాజాగా తన కూతురు జననం గురించి కొన్ని భావోద్వేగమైన విషయాలను బయటపెట్టారు. ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ జే శెట్టి నిర్వహించే పోడ్కాస్ట్‌లో పాల్గొన్న ప్రియాంక..తన జీవితంలో ఎదురైన కష్టకాలాన్ని వివరించారు. ఈ ఇంటర్వ్యూలో ప్రియాంక చెప్పిన మాటలకు.. టాలీవుడ్ నటి సమంత రూత్ ప్రభు స్పందిస్తూ.. ప్రియాంక చోప్రాణి ప్రశంసించారు.

ప్రియాంక మాట్లాడుతూ, తమ కూతురు మాల్టీ మేరీ చోప్రా జోనాస్ కేవలం 27 వారాలకే పుట్టిందని తెలిపారు. ఆ సమయంలో మాల్టీ NICUలో చికిత్స పొందిందని, అది తమ జీవితంలో చాలా భయానకమైన.‌. బాధాకరమైన దశగా మారిందని చెప్పారు. ఆ పరిస్థితుల్లో తాము మానసికంగా పూర్తిగా కుదేలైపోయామని ప్రియాంక చెప్పారు.

Advertisement

ఇంత సున్నితమైన సమయంలోనే, బిడ్డ ఉత్తరం అని వార్త మీడియాకు లీక్ అవుతుందని సమాచారం వచ్చిందని, మూడు గంటల్లో వార్త బయటకు వస్తుందని చెప్పడంతో తాము సిద్ధంగా లేకపోయినా ప్రకటన చేయాల్సి వచ్చిందని ప్రియాంక వెల్లడించారు. “మేము ఇంకా ఏం జరుగుతుందో తెలియని స్థితిలో ఉన్నాం. అయినా బలవంతంగా ప్రకటన చేయాల్సి వచ్చింది” అని ఆమె చెప్పిన మాటలు చాలామందిని కదిలించాయి.

సమంత రిప్లై..!

ఈ వీడియో క్లిప్‌ను సమంత తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేస్తూ, “చాలా అందంగా ఉంది. ధన్యవాదాలు ప్రియాంక. మీరు చాలా నిజాయితీగా మాట్లాడారు. ఈ ఇంటర్వ్యూ నాకు చాలా నచ్చింది” అని రాసుకొచ్చారు. సమంత చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Advertisement

ప్రియాంక .. ఆమె భర్త నిక్ జోనాస్ 2018లో వివాహం చేసుకున్నారు. 2022లో సరోగసీ ద్వారా మాల్టీ జన్మించింది. ప్రస్తుతం ప్రియాంక హాలీవుడ్ చిత్రాలతో బిజీగా ఉండగా, సమంత కూడా సినిమాలు, వెబ్ సిరీస్‌లు, నిర్మాణ రంగంలో ముందుకు సాగుతున్నారు.

Also Read: Allu Sirish Nainika wedding: అల్లు స్టూడియోస్ లో అల్లు శిరీష్ నైనిక రిసెప్షన్..ఎప్పుడంటే?

 

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×