E-Paper
Advertisement

Safety Rating: సేఫ్టీకే మొదటి ప్రాధాన్యత.. కస్టమర్ల టేస్ట్ బయటపెట్టిన సర్వే..

Safety Rating: సేఫ్టీకే మొదటి ప్రాధాన్యత.. కస్టమర్ల టేస్ట్ బయటపెట్టిన సర్వే..
Advertisement

Safety Rating : సేఫ్టీకే మొదటి ప్రాధాన్యత.. కస్టమర్ల టేస్ట్ బయటపెట్టిన సర్వే..రివ్యూలు, రేటింగ్‌లు అనేవి చాలావరకు ఏ బిజినెస్‌ను అయినా చాలా రకాలుగా ఎఫెక్ట్ చేస్తాయి. ఉదాహరణకు సినిమాల విషయంలో ఎలా అయితే రేటింగ్స్ అనేవి ఎఫెక్ట్ చూపిస్తాయో.. అలాగే ఆటోమొబైల్ ఇండస్ట్రీలో కూడా రేటింగ్స్ కీలక పాత్ర పోషిస్తాయని తాజాగా సర్వేలో తేలింది. కొత్తగా కారు కొనేవారు ఏ కంపెనీ అయితే బాగుంటుంది అని ఇతరులను అడిగి, వారి అభిప్రాయానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారంటూ.. రేటింగ్స్ విషయంలో మరికొన్ని విషయాలను సర్వే బయటపెట్టింది.

స్కోడా ఆటో ఇండియా, ఎన్ఐక్యూ బేసెస్ కలిసి తాజాగా ఇండియాలో ఒక సర్వేను నిర్వహించారు. పర్సనల్ కారు కొనే విషయంలో కస్టమర్లు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో తెలుసుకున్నారు. ఈ సర్వేలో 10లో 9 మంది సేఫ్టీ విషయంలో కంపెనీలకు, కార్లకు మంచి రేటింగ్ ఉండాలంటూ సమాధానం ఇచ్చారు. ముందుగా ఫలానా కంపెనీ కార్లను ఉపయోగించిన కస్టమర్లు.. దాని సేఫ్టీ విషయంలో మంచి రేటింగ్ ఇస్తేనే.. వారు కూడా ఆ కారును కొనడానికి ఆలోచిస్తామని వారు తెలిపారు. అన్నింటికి మించి సేఫ్టీ ముఖ్యమని వారు అంటున్నారు.

Advertisement

సేఫ్టీ రేటింగ్‌కు, ఎయిర్‌బ్యాగ్స్ లాంటి వాటికి ఇండియన్ ఆటోమొబైల్ కస్టమర్లు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చినట్టు సర్వే చెప్తోంది. ఈ సర్వే జరగక ముందు కస్టమర్లు కార్ల ఎంపిక విషయంలో మైలేజ్‌ను ప్రముఖంగా తీసుకుంటారని అనుకున్నాయి కంపెనీలు. కానీ ఈ సర్వేలో సేఫ్టీ అనేది టాప్ ప్లేస్‌ను అందుకుంది. ఈ సర్వేలో ఎక్కువగా రూ. 5 లక్షల కంటే ఎక్కువ ధర ఉన్న కార్లను కొన్నవారే పాల్గొన్నారు. మిగిలిన వారు ఏడాదిలోపు రూ. 5 లక్షల కంటే ఎక్కువ ధర ఉన్న కార్లను కొనడానికి సిద్ధంగా ఉన్నారు.

ఈ సర్వే గురించి తెలిసిన తర్వాత చాలావరకు కారు కంపెనీలు.. సేఫ్టీ అనేది తమ ముఖ్య ప్రాధాన్యతగా ఉంటుందని, ఎప్పటినుండి అయినా కస్టమర్ల సేఫ్టీనే వారు ప్రముఖంగా భావిస్తారని చెప్తున్నాయి. ఇండియాలో ఎక్కువగా సేఫ్టీ విషయంలో 5 స్టార్ రేటింగ్ ఉన్న కార్లకే ఎక్కువగా డిమాండ్ ఉన్నట్టు సర్వేలో తేలింది. దీని ద్వారా కార్ కంపెనీలు అన్ని అలర్ట్ అయ్యి కస్టమర్లను సేఫ్టీ పరంగా ఇంప్రెస్ చేయాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×