E-Paper
Advertisement

Rs 500 Notes : రూ. 500 నోట్ల మిస్సింగ్.. రూ. 88 వేల కోట్లు ఏమయ్యాయి?

Rs 500 Notes : రూ. 500 నోట్ల మిస్సింగ్.. రూ. 88 వేల కోట్లు ఏమయ్యాయి?
Advertisement

Rs 500 Notes : దేశంలో 88 వేల కోట్ల రూపాయలకుపైగా విలువైన కొత్త 500 నోట్లు అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. 2015 ఏప్రిల్-2016 డిసెంబర్ మధ్య కాలంలో దేశంలోని 3 మింట్‌లలో 9 వేల మిలియన్లకు పైగా కొత్త 500 నోట్లు ముద్రిస్తే వాటిలో ఆర్బీఐకి చేరింది 7 వేల 260 మిలియన్ల 500 నోట్లే. మిగతా 1760 మిలియన్ల 500 నోట్లు ఏమయ్యాయో ఎవరికీ తెలీదు. ఆర్బీఐ కూడా ఆ లెక్క తేల్చలేదు. ఆర్బీఐ అధికారులు కూడా నోట్ల అదృశ్యంపై నోరెత్తడం లేదు.

Advertisement

నోట్ల ముద్రణకు సంబంధించిన వివరాలను మనోరంజన్ రాయ్ అనే కార్యకర్త ఆర్టీఐ ద్వారా సేకరించడంతో నోట్లు అదృశ్యమైన సంగతి బయటపడింది. ఈ నోట్ల లెక్క తేల్చాలని ఆయన సీఈఐబీ, ఈడీలకు కూడా లేఖ రాశారు. నోట్ల అదృశ్యంతో భారత ఆర్థిక వ్యవస్థ స్థిరత్వంపై ఆందోళన కలుగుతోందన్నారు. దేశంలో నాసిక్, దేవాస్‌, బెంగళూరుల్లోని మింట్‌లలో ఆర్బీఐ కొత్త నోట్లు ముద్రిస్తూ ఉంటుంది.

బెంగళూరులోని మింట్‌లో 5,195 మిలియన్ల 500 నోట్లు ముద్రించారు. ఇక దేవాస్‌లోని మింట్‌లో 1953 మిలియన్ల 500 నోట్లు ముద్రించారు. నాసిక్‌లోని మింట్‌లో 375.65 మిలియన్ల 500 నోట్లు ముద్రించారు. అయితే వీటి నుంచి ఆర్బీఐకి అందింది 7,260 మిలియన్ల 500 నోట్లు మాత్రమే.

Advertisement

నోట్ల అదృశ్యంపై పదే పదే ప్రశ్నిస్తే ముద్రించిన నోట్లు, వచ్చిన నోట్ల మధ్య తేడా ఉన్నమాట నిజమేనని ఆర్బీఐ అధికారులు అంగీకరించారు. అదృశ్యమయ్యాయని అనుకుంటున్న నోట్లు ఇంకా రవాణాలో ఉండి ఉండొచ్చని చెబుతున్నారు. అయితే ఏడేళ్ల కిందట ముద్రించిన నోట్లు ఇంకా రవాణాలో ఉండటం ఏంటో ఎవరికీ అంతుబట్టటం లేదు.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×