// // Rolls Royce Electric Car: రోల్స్ రాయిస్ ప్రయోగం.. ట్రెండ్‌కు తగినట్టుగా.. - Staging.BigTvLive -->
E-Paper
Advertisement

Rolls Royce Electric Car: రోల్స్ రాయిస్ ప్రయోగం.. ట్రెండ్‌కు తగినట్టుగా..

Rolls Royce Electric Car: రోల్స్ రాయిస్ ప్రయోగం.. ట్రెండ్‌కు తగినట్టుగా..
Advertisement

Rolls Royce Electric Car : ఆటోమొబైల్ రంగంలో కొన్ని కంపెనీలకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఎక్కువగా పబ్లిసిటీ లేకపోయినా.. యాడ్స్‌పై ఖర్చు పెట్టకపోయినా.. వారి క్రేజ్ అలా పెరుగుతూనే ఉంటుంది. అందులో ఒకటి రోల్స్ రాయిస్. ఈ కార్ల కంపెనీ ఎన్నో ఏళ్లుగా చెక్కుచెదరకుండా టాప్ స్థానంలో నిలుస్తోంది. తాజాగా ఇప్పటి ట్రెండ్‌తో కలవడం కోసం రోల్స్ రాయిస్ ఒక నిర్ణయం తీసుకుంది.

ఈరోజుల్లో ఎలక్ట్రిక్ కార్ల ట్రెండ్ నడుస్తోంది. ఫ్ల్యూయల్ కార్ల కంటే ఎలక్ట్రిక్ కార్లను కొనడానికే చాలామంది ఇష్టపడుతున్నారు. తాజాగా రోల్స్ రాయిస్ ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించింది. స్పెక్ట్రే అనే పేరుతో ఈ కారు కస్టమర్ల ముందుకు రానుంది. సౌత్ కొరియాలో ఈ ఆవిష్కరణ జరిగింది. సౌత్ కొరియాలో తమ మార్కెట్ బాగుంటుందని రోల్స్ రాయిస్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

Advertisement

పూర్తిగా ఎలక్ట్రిక్ పరికరాలతో తయారైన ఈ స్పెక్ట్రే.. కొరియాలో 620 మిలియన్ స్టార్టింగ్ ప్రైజ్‌తో మార్కెట్లోకి రానుంది. తరువాత డిమాండ్‌ను బట్టి ప్రైజ్ పెరిగే అవకాశాలు కూడా ఉంటాయని యాజమాన్యం అంటోంది. కొరియాలో రోల్స్ రాయిస్ మార్కెట్ ఎప్పుడూ బాగుంటుందని, ప్రీ ఆర్డర్స్ విషయంలో కూడా అక్కడ కంపెనీ పర్ఫార్మెన్స్ బాగుంటుందని తెలిపింది. కానీ ఇప్పటికీ స్పెక్ట్రేకు మాత్రం ఎన్ని ప్రీ ఆర్డర్లు వచ్చాయో బయటపెట్టలేదు.

ఈ ఏడాది చివర్లో ప్రీ ఆర్డర్ చేసుకున్న కస్టమర్లకు స్పెక్ట్రే కార్లు డెలివరీ అవుతాయని యాజమాన్యం తెలిపింది. కొరియాలో తమ పెట్టుబడులకు తగినట్టుగా ఆదాయం, లాభాలు కూడా పెరుగుతూ వచ్చాయని సంతోషం వ్యక్తం చేసింది రోల్స్ రాయిస్. కొరియాలో రోల్స్ రాయిస్ సంస్థ.. బీఎమ్‌డబ్ల్యూకు చెందింది. అందుకే అక్కడ బీఎమ్‌డబ్ల్యూ, మిని, రోల్స్ రాయిస్ సేల్స్‌ను కూడా ఈ సంస్థే చూసుకుంటోంది.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×