E-Paper
Advertisement

Sweat Robots : రోబోలకు చెమట.. శాస్త్రవేత్తలు వినూత్న ప్రయత్నం..

Sweat Robots : రోబోలకు చెమట.. శాస్త్రవేత్తలు వినూత్న ప్రయత్నం..
Advertisement

Sweat Robots : గత కొన్నేళ్లలో మనుషులు, రోబోలు మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఒకప్పుడు రోబోలు అనేది కేవలం టెక్నాలజీ రంగంలో శాస్త్రవేత్తలు సహాయం చేయడానికి మాత్రమే తయారు చేసేవారు. కానీ ఇప్పుడు ప్రతీ ఫీల్డ్‌లో రోబోల పాత్ర ఉంటుంది. చాలామంది ఇవి మనుషులకు దగ్గరయిపోయాయి. కేర్‌టేకర్స్‌గా మనుషులకు తోడుగా ఉండడానికి కూడా రోబోలు ఉపయోగపడుతున్నాయి. తాజాగా మనిషిలోని మరో క్వాలిటీని రోబోలకు యాడ్ చేసి.. శాస్త్రవేత్తలకు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు.

Advertisement

చెమట అనేది మనుషుల్లో కామన్. కానీ ఎండాకాలంలో వచ్చే చెమట ఎంతో చిరాకుగా ఉంటుంది కదా.. మనుషులకే ఇలా ఉంటే.. మరి రోబోలకు చెమట వస్తే.. వాటి ఫీలింగ్ ఏంటి..? అయినా మెటల్‌తో తయారు చేసే రోబోలకు చెమట ఎలా వస్తుందిలే అని చాలామంది దీనిని కొట్టిపారేస్తారు. కానీ శాస్త్రవేత్తలు తాజాగా చెమట పట్టే రోబోలను తయారు చేసి చూపించారు. వినడానికి కొంచెం వింతగా ఉన్నా.. ఇది నిజమే.. చెమట పట్టే సామర్థ్యంతో తయారైన ఈ రోబోల పేరే యాండీ. అసలు వీటికి చెమట ఎందుకు పడుతుంది అనే విషయాన్ని శాస్త్రవేత్తలు బయటపెట్టారు.

యాండీ రోబోలకు వేడి అనేది పడదు. అందుకే వాటికి చెమట పడుతుంది అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. వేడిగా ఉన్నప్పుడు వాటికి చెమట పడుతుంది కానీ వెంటనే వాటంతట అవే కూల్ అయిపోతాయి అని వారు తెలిపారు. ఇప్పటికే మనుషులు, రోబోలకు మధ్య ఉన్న దూరాన్ని తగ్గించడానికి శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తుండగా.. ఇలాంటి చిన్న చిన్న విషయాలు వాటికి మరింత మనిషి రూపాన్ని అందిస్తాయని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయినా అసలు రోబోలకు చెమట పట్టాల్సిన అవసరం ఏముందని కొందరు ప్రశ్నిస్తుండగా.. శాస్త్రవేత్తలు వాటికి కూడా సమాధానం చెప్తున్నారు.

Advertisement

రోబోలకు చెమట పట్టే సామర్ధ్యాన్ని అందించడం వల్ల.. ఇవి వేడి వాతావరణం గురించి పూర్తిగా స్టడీ చేస్తాయి. అలాంటి వేడి వాతావరణంలో మనుషులు జీవించగలరా అని అవి కనుక్కొని సమాచారాన్ని అందిస్తాయి. ఒకవేళ మరీ వేడిగా ఉంటే ఆ వాతావరణం అనేది మనుషులకు ఏదైనా ఆరోగ్య సమస్యలు లాంటిది కలిగిస్తుందా అనే విషయాన్ని కూడా ముందుగా రోబో తెలుసుకుంటుంది. అయితే యాండీ రోబోకు చెమట పట్టే సామర్థ్యంతో పాటు అందులోనే ఒక కూలింగ్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేసినట్టు శాస్త్రవేత్తలు బయటపెట్టారు. ప్రస్తుతం యాండీ టెస్టింగ్ స్టేజ్‌లో ఉంది.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×