E-Paper
Advertisement

Robot:-అంటార్కిటా ఐస్ పరిశోధనల్లో రోబోల సాయం..

Robot:-అంటార్కిటా ఐస్ పరిశోధనల్లో రోబోల సాయం..
Advertisement

Robot:-ఈరోజుల్లో ఎలాంటి ప్రాంతంలో అయిన పరిశోధనలు చేసేలా టెక్నాలజీ ఎదిగిపోయింది. కానీ కొన్ని పరిస్థితుల్లో కొన్ని ప్రమాదకరమైన ప్రాంతాలకు మనుషులే వెళ్లాల్సి ఉంటుంది. అలాంటి సమయాల్లో వారికి ప్రాణహాని కూడా జరిగే అవకాశం ఉంటుంది. అందుకే అలాంటి పరిశోధనలు చేయడం కోసమే శాస్త్రవేత్తలు.. రోబోలను తయారు చేశారు. తాజాగా ఈ రోబోలతో వారు ఓ కఠినమైన ప్రదేశంలో పరిశోధనలు చేయనున్నారని తెలుస్తోంది.

అంటార్కిటాలోని మంచును స్టడీ చేయడానికి ఇప్పటికీ ఎంతోమంది శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తూనే ఉన్నారు. అక్కడి మంచు గడ్డ కట్టుకొని ఉండడం వల్ల పరిశోధనలు కష్టంగా ఉంటాయి. మనుషులు ఈ మంచులోపలికి వెళ్లి పరిశోధనలు చేయలేరు కాబట్టి టెక్నాలజీ సాయంతో వీటిలోపల ఎలా ఉంటుందో కనిపెట్టగలిగారు. కానీ ఆ పరిశోధనలు కూడా కొంతవరకే పరిమితమయ్యాయి. ఇప్పుడు ఈ పరిశోధనల్లో శాస్త్రవేత్తలు సాయం చేయడానికి రోబోలు రంగంలోకి దిగనున్నాయి.

Advertisement

అంటార్కిటాలోని ఐస్ షెల్ఫ్ అండర్‌వాటర్‌కు చేరుకునేలా రోబోలను ట్రైన్ చేశారు శాస్త్రవేత్తలు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో సున్నితంగా ఉండే ఐస్.. ఉన్నట్టుండి పచ్చగా మారిపోయింది. అంతే కాకుండా ఉప్పుశాతం కూడా దానిలో పెరగిపోతుందని వారు గమనించారు. అంటార్కిటాలోని రాస్ ఐస్ షెల్ఫ్, కాంబ్ ఐస్ స్ట్రీమ్ కలిసే ప్రాంతాన్ని అమెరికా, న్యూజిలాండ్‌కు చెందిన శాస్త్రవేత్తలు స్టడీ చేశారు. అక్కడ మునుపెన్నడూ ప్రయోగించని ఐస్ పంపింగ్ అనే ప్రక్రియను ప్రారంభించారు.

ఐస్‌లోని 100 అడుగుల లోతును గమనించడానికి ఈ ఐస్ పంపింగ్ ప్రక్రియ ఉపయోగపడుతుంది. మామూలుగా 100 అడుగు లోతున ఐస్ కరిగి.. పైగా నీటిలాగా తేలి మళ్లీ ఐస్‌లాగా మారిపోతుంది. ఈ ప్రక్రియను గమనించడానికి శాస్త్రవేత్తలు ఐస్ పంపింగ్‌ను చేపట్టారు. దీనికోసం ఐస్‌ఫిన్ అనే రోబోను ఉపయోగించారు. భూభాగంలో ఐస్ అనేది ఎలా మార్పులు చెందుతుందో తెలుసుకోవడానికి ఈ రోబో మరింత ఉపయోగపడనుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ పరిశోధనల్లో మరికొన్ని విషయాలు బయటపడనున్నాయని వారు ఆశిస్తున్నారు.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×