// // Robot Eye : చేప కళ్లతో రోబోలకు చూపు.. - Staging.BigTvLive -->
E-Paper
Advertisement

Robot Eye : చేప కళ్లతో రోబోలకు చూపు..

Robot Eye : చేప కళ్లతో రోబోలకు చూపు..
Advertisement
Robot Eye

Robot Eye : రోబోటిక్స్ రంగంలో జరిగే పరిశోధనల్లో ఎప్పుడూ విరామం అనేది ఉండదు. ఎప్పటికప్పుడు రోబోలను కొత్త టెక్నాలజీతో ఎలా తయారు చేయాలి, ఎలాంటి రోబోలు తయారు చేస్తే సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉపయోగపడే విధంగా ఉంటుంది.. అన్న ఆలోచనతోనే రోబోటిక్స్ రంగం ముందుకెళుతుంది. ఎప్పటికప్పుడు కొత్త పరిశోధనలు చేసే రోబోటిక్స్.. తాజాగా ఓ కొత్త రకమైన రోబోను తయారు చేయడానికి సిద్ధమయ్యింది.

చీకటిలో కూడా వస్తువులను చూడడానికి సులభంగా ఉండేలా ఇప్పటికే ఎన్నో టెక్నాలజీలు అందుబాటులోకి వచ్చాయి. అంతే కాకుండా ఎక్కువ వెలుగు ఉన్న చోట కూడా పరిసరాలను గమనించే విధంగా కూడా టెక్నాలజీలు ఉన్నాయి. అయితే రోబోలకు కూడా ఆ టెక్నాలజీలను అమర్చాలని కొరియా శాస్త్రవేత్తలు నిర్ణయించుకున్నారు. బాగా ప్రకాశంగా ఉన్న ప్రాంతాల్లో కూడా పరిసరాలను గమనించేలా రోబోలకు చూపును అమర్చబోతున్నారు.

Advertisement

నురుగు చేప కంటి లక్షణాలతో రోబోలకు చూపు అమర్చితే అవి ప్రకాశవంతమైన ప్రాంతాలను కూడా స్పష్టంగా చూడవచ్చని శాస్త్రవేత్తలు గమనించారు. అక్టోపస్ జాతికి చెందినవే ఈ కటిల్ ఫిష్. ఈ కటిల్ ఫిష్‌పై చేసిన పరిశోధనల్లో దీని కంటిలో ఉండే పీపుల్ మిగతావాటికంటే కాస్త భిన్నంగా ఉంటుందని గమనించిన పరిశోధకులు.. దీనినే రోబోలకు ఉపయోగించాలని నిర్ణయించుకున్నారు. ఇది చీకటిలో కూడా స్పష్టంగా చూసేలా ఉపయోగపడుతుందని వారు తెలిపారు.

ఇప్పటికే చీకటిలో మెరుగ్గా చూడగలిగేలా.. రోబోలకు కళ్లను అమర్చారు. కానీ వాటన్నింటితో పోలిస్తే కటిల్ ఫిష్ కంటి లక్షణాలతో తయారు చేసే రోబోటిక్ ఐ అనేది మరింత మెరుగ్గా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ప్రస్తుతం కేవలం మామూలు కెమెరాలతో మాత్రమే ఎక్కువగా రోబోటిక్ కళ్లను తయారు చేస్తున్నారు. వాటికంటే కటిల్ ఫిష్ కళ్లు బాగా పనిచేస్తాయని వారి పరిశోధనల్లో తేలినట్టుగా తెలిపారు. దీని సాయంతో బ్లైండ్ స్పాట్స్‌ను గుర్తించవచ్చని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×