// // Road Accident| లారీ-రెండు బస్సులు ఢీ.. పలువురికి గాయాలు -->
E-Paper
Advertisement

Road Accident: లారీ-రెండు బస్సులు ఢీ.. పలువురికి గాయాలు

Road Accident: లారీ-రెండు బస్సులు ఢీ.. పలువురికి గాయాలు
Advertisement

Road Accident: ప్రైవేట్ ట్రావెల్స్ దందాలు అడ్డూ అదుపూ లేకుండా పోతున్నాయి. ఓవర్ స్పీడ్ కారణంగా ప్రయాణికుల ప్రాణాలకు గ్యారెంటీ లేకుండా పోతోంది. తాజాగా జోగులాంబ గద్వాల్ జిల్లా పుల్లూరు టోల్‌ప్లాజా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

వివరాల్లోకి వెళ్తే.. యూటర్న్ చేసుకుంటున్న బండల లారీని.. ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. దాన్ని మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ కొన్న ఘటన జోగులాంబ గద్వాల్ జిల్లా పుల్లూరు టోల్‌ప్లాజా దగ్గర జరిగింది. ఒక బస్సులో 35 మంది ప్రయాణికులు, మరో బస్సులో 40 మంది ప్యాసింజర్స్ ఉన్నారు. గాయపడినవారిని కర్నూల్ ఆస్పత్రికి తరలించారు.

Advertisement

మరోవైపు రంగారెడ్డి జిల్లా నార్సింగిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వైద్యుడు జస్వంత్ మృతి చెందాడు. మరో వైద్యురాలు భూమికకు తీవ్ర గాయాలయ్యాయి. జన్వాడ నుంచి తిరిగి వస్తుండగా ఖానాపూర్ వద్ద కారు డివైడర్‌ను ఢీ కొట్టింది. వారిద్దరూ కామినేని ఆస్పత్రిలో హౌస్ సర్జన్స్‌గా చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉంది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారికి ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Also Read: విషాద ఘటన.. అంత్యక్రియలకు డబ్బుల్లేక.. తల్లి డెడ్ బాడీతో ఇంట్లోనే..

ఇదిలా ఉంటే.. డ్రైవర్, క్లీనర్‌ల దందా కూడా మామూలుగా లేదు. తిరుపతి నుంచి బెంగళూరు వెళ్లే యోలో ట్రావెల్స్‌లో ప్రయాణికులపై దౌర్జన్యానికి దిగారు. సీట్లు క్లీన్‌గా లేవంటూ ప్రశ్నిస్తే.. మీ సీట్లు మీరే క్లీన్ చేసుకోవాలంటూ నోరు పారేసుకున్నారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×